This is a story about the importance of change.
Ususally the first reaction to change is resistance.
But, without change we cannot expect much progress.
This is an ancient story.
It is interesting to note that wise people have identified the importance of change long back.
Read the story!
ప్రవాహం - ఎడారి
అది ఒక ప్రవాహం. దూరంగా ఉండే కొండలలో పుట్టింది.
అక్కడి నుంచి అందాలతో నిండిన రకరకాల ప్రాంతాల మీదుగా ప్రవహించింది.
చివరకొక ఎడారిని చేరింది.
అన్నిచోట్లా ఎన్నో అడ్డంకులను దాటుతూ ప్రవహించినట్లే, ఎడారిని కూడా దాటేయాలనుకున్నది ప్రవాహం. కానీ ఇసుకలోకి ప్రవేశించిందో లేదో, దాని నీరంతా మాయమయి పోతున్నది.
అయినా ఎడారిని దాటాలని ప్రవాహం పట్టుదలగా ఉంది. మరి ఏమిటి దారి
అంతట్లో ఎడారిలోనుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది. “గాలి ఎడారిని దాటుతుంది. మరి ప్రవాహం కూడా ఎడారిని దాటగలగాలి” అన్నది ఆ గొంతు గుసగుసగా. ఆ గొంతు ఎడారి ఇసుకదే.
కానీ ఇసుకలోనేమో ప్రవాహం మాయమయి పోతున్నది. గాలి ఎగరగలుగుతుంది. అందుకే అది ఎడారిని దాటగలుగుతుంది. ప్రవాహానికి అనుమానంగా ఉంది.
“అవును! నీ పద్ధతిలో నీవు పరుగులు పెడితే, ఎడారిని దాటలేవు. లేకుండ పోతావు. లేదంటే మడుగవుతావు. నీవు గాలిని ఆశ్రయించాలి. గాలి నిన్ను ఎత్తుకుపోయి గమ్యం చేరుస్తుంది” అన్నది గొంతు.
“అదెట్లా?” అన్నది ప్రవాహం.
“గాలి నిన్ను తనలోకి పీల్చుకుంటుంది.”
అది ప్రవాహానికి నచ్చలేదు. ప్రవాహమంటే ఎదురు లేని పద్ధతి. స్వంత గుర్తింపు గల పద్ధతి. తన గుర్తింపును పోగొట్టుకుంటే, అది తిరిగి దొరికేనా, అనుమానం పుట్టింది.
“గాలి తనపని తాను చేస్తుంది. నీటిని గ్రహించి ఎడారిని దాటుతుంది. అక్కడ వదిలేస్తుంది. వర్షంగా కురిసిన నీరు తిరిగి ప్రవాహమవుతుంది!” అన్నది ఇసుక.
“నాకేమిటి నమ్మకం?”
“నమ్మకపోతే బురదగుంటగా మిగులుతావు. అదికూడా ఒకపూటలో జరిగే పనికాదు. అది ప్రవాహానికిపట్టవలసిన గతీకాదు.”
“నేను ప్రవాహంగా ఉన్నాను, ప్రవాహంగానే ఉండిపోలేనా?”
“ఏ రకంగానూ అది వీలయేట్టు లేదు. మారితే మళ్లీ ప్రవాహంగానూ మారే వీలుంది. అప్పుడూ నిన్ను ప్రవాహమనే అంటారు. ఇవాళటి ప్రవాహానికీ ఆ ప్రవాహానికీ తేడా ఏమిటి?”
ప్రవాహం తీవ్రంగా ఆలోచించింది. ఒకప్పటి తన స్థితి కళ్లముందు మెదిలింది. అంతా తానేనా? అంతా ఉండేదా? గాలిలోనుంచే పుట్టిందా ఏమిటి తాను? తాను తానేనా నిజంగా ?
ప్రవాహం గాలిని ఆశ్రయించింది. ఆవిరయింది. ఎత్తులకు ఎగిసింది. ఎడారిని దాటింది. కొండ మీద కురిసింది. ప్రవాహంగా మారింది. ప్రవాహానికిందంతా ఈసారి గుర్తుంది.
“అవును! నా అసలు రూపం సంగతి ఇప్పుడు అర్థమయింది.” అనుకున్నది ప్రవాహం. అది పాఠాలు నేర్చింది.
“అవును! ఇది కలకాలంగా జరుగుతున్న చక్రక్రమం. అంతటా వ్యాపించిన మాకది ఎప్పుడో తెలుసు!” అన్నది ఇసుక.
జీవన ప్రవాహం నడిచే తీరు కూడా ఇసుక మీద రాసి ఉందంటారు అందుకే.
A STREAM, from its source in far-off mountains, passing through every kind and description of countryside, at last reached the sands of the desert. Just as it had crossed every other barrier, the stream tried to cross this one, but it found that as fast as it ran into the sand, its waters disappeared.
It was convinced, however, that its destiny was to cross this desert, and yet there was no way.
Now a hidden voice, coming from the desert itself, whispered: The Wind crosses the desert, and so can the stream.'
The stream objected that it was dashing itself against the sand, and only getting absorbed: that the wind could fly, and this was why it could cross a desert. 'By hurtling in your own accustomed way you cannot get across. You will either disappear or become a marsh. You must allow the wind to carry you over, to your destination.' But how could this happen?
'By allowing yourself to be absorbed in the wind.' This idea was not acceptable to the stream. After all, it had never been absorbed before. It did not want to lose its individuality. And, once having lost it, how was one to know that it could ever be regained?
'The wind', said the sand performs this function. It takes up water, carries it over the desert, and then lets it fall again. Falling as rain, the water again becomes a river.'
'How can I know that this is true?' 'It is so, and if you do not believe it, you cannot become more than a quagmire, and even that could take many, many years; and it certainly is not the same as a stream.'
'But can I not remain the same stream that I am today?'
You cannot in either case remain so,' the whisper said. ‘Your essential part is carried away and forms a stream again. You are called what you are even today because you do not know which part of you is the essential one.'
When he heard this, certain echoes began to arise in the thoughts of the stream. Dimly, he remembered a state in which he—or some part of him, was it?—had been held in the arms of a wind. He also remembered—or did he?—that this was the real thing, not necessarily the obvious thing, to do.
And the stream raised his vapour into the welcoming arms of the wind, which gently and easily bore it upwards and along, letting it fall softly as soon as they reached the roof of a mountain, many, many miles away. And because he had had his doubts, the stream was able to remember and record more strongly in his mind the details of the experience. He reflected, 'Yes, now I have learned my true identity.'
The stream was learning. But the sands whispered: 'We know, because we see it happen day after day: and because we, the sands, extend from the riverside all the way to the mountain.'
And that is why it is said that the way in which the Stream of Life is to continue on its journey is written in the Sands.
Let us enjoy change in life!!
$$$$$$$$
No comments:
Post a Comment