I have translated almost the entire collection under the title.
You can read them in my web pages on tripod.
Link is available on the right of the blog page.
Now I am adding more lines from Sand and Foam.
I am thoroghly impressed by Gibran's style and thoughts!!
Faith is an oasis in the heart which will never be reached by the caravan of thinking.
నమ్మకమన్నది మనసులోని ఒయాసిస్సు. ఆలోచనతో ప్రయాణికులు దాన్ని అందుకోలేరు.
When you reach your height you shall desire but only for desire; and you shall hunger, for hunger; and you shall thirst for greater thirst.
నీవా ఎత్తుకు ఎదిగిన తర్వాత, కేవలం కోరికలనే కోరుకుంటావు. ఆకలికై ఆకలిగా ఉంటావు. గొప్ప దాహానికై తపిస్తావు.
If you reveal your secrets to the wind you should not blame the wind for revealing them to the trees.
నీ రహస్యాలను గాలికి చెప్పి, ఆ గాలి వాటిని చెట్లకు చెప్పిందని తప్పు పట్టలేవు.
The flowers of spring are winter's dreams related at the breakfast table of the angels.
వసంత పుష్పాలంటే, దేవతలు తమ భోజనం బల్ల దగ్గర చెప్పుకున్న చలిరాత్రి కథలు.
Said a skunk to a tube-rose, "See how swiftly I run, while you cannot walk nor even creep."
Said the tube-rose to the skunk, "Oh, most noble swift runner, please run swiftly!"
మురికి పంది కందమూలంతో అన్నది గదా, చూడూ నేనెంత వేగంగా పరుగెత్తగలనో, నీవేమో నడవడం కాదు, పాకనుకూడా లేవు అని, కంద ఓ వేగం గల మిత్రమా, వేగంగా పరుగెత్తి వెళ్లి పో అన్నది.
Turtles can tell more about roads than hares.
దారులను గురించి కుందేళ్లకన్నా తాబేళ్లే ఎక్కువ చెప్పగలవు.
Strange that creatures without backbones have the hardest shells.
వెన్నుపాము లేని ప్రాణులకు, అన్నిటికన్నా గట్టి పెంకులుండటం విచిత్రం.
The most talkative is the least intelligent, and there is hardly a difference between an orator and an auctioneer.
ఎక్కువగా మాట్లాడేవానికి తక్కువగా తెలివి ఉంటుంది. మహావక్తకూ వేలం పాటగానికీ తేడా తక్కువే.
Be grateful that you do not have to live down the renown of a father nor the wealth of an uncle.
But above all be grateful that no one will have to live down either your renown or your wealth.
తండ్రి కీర్తికీ పినతండ్రి ధనానికి తగినట్టు నీవు బతకనవసరం లేనందుకు కృతజ్ఞుడుగా ఉండు.
ఇక నీ కీర్తికీ, ధనానికి తగినట్టు ఎవరూ బతకనవసరం లేదని కూడా కృతజ్ఞుడుగా ఉండు.
Only when a juggler misses catching his ball does he appeal to me.
గారడీవాడు బంతిని పట్టుకోలేక పోయినప్పుడు నాకెంతో నచ్చుతాడు.
The envious praises me unknowingly.
అసూయగలవాడు తెలియకుండానే నన్ను పొగుడుతుంటాడు.
Long were you a dream in your mother's sleep, and then she woke to give you birth.
చాలా కాలం మీ అమ్మ కలలో నిద్రలో నీవు కలగా ఉన్నావు. అప్పుడామె నిన్ను కనడానికి మేలుకుంది.
The germ of the race is in your mother's longing.
మీ వంశానికి అంకురం మీ అమ్మ కోరికలో ఉంది.
My father and mother desired a child and they begot me.
And I wanted a mother and a father and I begot night and the sea.
మా అమ్మా నాన్న ఓ పిల్లవాడిని కోరుకుని నన్ను కన్నారు.
నాకు అమ్మ, నాన్న కావాలనుకున్నాను, రాత్రీ, సముద్రం దొరికాయి.
Some of our children are our justifications and some are but our regrets.
మన పిల్లల్లో కొంతమంది మన సమర్థనలు, కొంతమంది మన క్షమాపణలు.
When night comes and you too are dark, lie down and be dark with a will.
And when morning comes and you are still dark stand up and say to the day with a will, "I am still dark."
It is stupid to play a role with the night and the day.
They would both laugh at you.
రాత్రి వచ్చి నీవూ నలుపై ఉంటే, కోరి నలుపుగాపడి ఉండు.
ఉదయమయ్యి ఇంకా నీవు నలుపుగా ఉంటే, లేచి కోరికతో దినానికి విషయం చెప్పు.
రాత్రి పగళ్లతో కలిసి నటించడం బుద్ధిలేని పని.
అవి రెండూ నిన్నుచూచి నవ్వుతాయి.
The mountain veiled in mist is not a hill; an oak tree in the rain is not a weeping willow.
పొగమంచువల్ల కనపడనంత మాత్రాన కొండ గుట్ట కాదు. వర్షంలో వంగినంత మాత్రాన మహా వృక్షం చిన్నది కాదు.
Behold here is a paradox; the deep and high are nearer to one another than the mid-level to either.
ఇదోక విరోధాభాసం. లోతు ఎత్తు రెండూ, మధ్యస్థానం కన్నా ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి.
When I stood a clear mirror before you, you gazed into me and saw your image.
Then you said, "I love you."
But in truth you loved yourself in me.
నేనొక శుభ్రమయిన అద్దాన్ని నీ ముందుంచితే, నీవు నాలోకి చూచావు, నీ బొమ్మే కనుపించింది.
అప్పుడు నీవు, నీవంటే నాకిష్టం అన్నావు.
కానీ నిజానికి , నీకు నాలోని నీవంటే ఇష్టం.
When you enjoy loving your neighbor it ceases to be a virtue.
నీ పొరుగింటి వానిని ప్రేమించడంలో నీకు ఆనందం దొరికితే, అది ఇక మంచి గుణంగా మిగలదు.
Let us enjoy some great works of thought!!
$$$$$$$
No comments:
Post a Comment