Friday, May 14, 2010

The Three Fishes

Here is an interesting story.
It has a message for the elders and managers also!
You have to look for the message.

Here is the Story!

తెలివి

ఒకప్పుడొక మడుగులో మూడు చేపలుండేవి. అవి ఒకటి పూర్ణజ్ఞాని, రెండు అర్ధజ్ఞాని, మూడు అల్పజ్ఞాని. వాటి బ్రతుకు అన్ని చేపలకు అంతటా జరిగినట్లే జరుగుతుండగా మడుగు దగ్గరకు ఒకనాడొక మనిషి వచ్చాడు. అతని దగ్గర ఒక వల ఉన్నది. పూర్ణజ్ఞాని నీటిలోపలినుంచే అతగాడిని చూచింది. తన అనుభవాన్ని, విన్న కథలనూ, స్వంత తెలివినీ ఒక్కసారి సమకూర్చుకుని, ఏదో చేయవలెనని నిశ్చయించింది. ‘ఈ మడుగులో దాగుండను అనుకూలమయిన చోట్లు తక్కువ. అందుకే చనిపోయినట్లు నటిస్తే సరి!’ అనుకున్నది.

శక్తినంతా కూడగట్టుకుని మడుగులోనుంచి బయటకు ఎగిరింది. వెల్లి జాలరి కాళ్ల ముందు పడింది. అతను చాలా ఆశ్చర్యపోయాడు. కానీ పూర్ణజ్ఞాని శ్వాస బిగబట్టి ఉంది మరి. అది చచ్చిందనుకున్నాడు జాలరి. ఎత్తి నీటిలోకి పడవేశాడు. చేప నెమ్మదిగా గట్టు పక్కనున్న చిన్న రంధ్రంలోకి జారుకున్నది.

ఇక రెండవ చేప అర్ధజ్ఞాని, ఏం జరుగుతున్నదో తెలియక చూస్తూ ఉన్నది. అది నెమ్మదిగా పూర్ణజ్ఞాని వద్దకు ఈది విషయమేమిటని అడిగింది. ‘ఏముందీ? చనిపోయినట్టు నటించాను. అతను నన్ను తిరిగి నీటిలోకి పడవేశాడు!’ అన్నది పూర్ణజ్ఞాని. అర్ధజ్ఞాని కూడా నీటిలోంచి బయటకు ఎగిరింది. జాలరి కాళ్ల ముందు పడింది. చిత్రం ఎక్కడా లేనిది ఈ చేపలిట్లా ఎగురుతున్నాయేమిటి అనుకున్నాడతను. అర్ధజ్ఞాని శ్వాస బిగబట్టడం గురించి మరిచిపోయింది. బతికి ఉన్న చేపే గనుక జాలరి దాన్ని ఎత్తి తన సంచిలో వేసుకున్నాడు.

అతను తిరిగి నీటివేపు చూడసాగాడు. చేపలు ఎగురుతూ ఉండడం అర్థంకాక అతను కొంచెం ఆశ్చర్యంలో ఉన్నాడు గదా! అందుకే సంచిని సరిగా మూయలేదు. ఆ సంగతి అర్థంచేసుకున్న అర్ధజ్ఞాని ఏదో రకంగా సంచిలోంచి బయటపడి దొరలుతూ నీటిలోకి చేరుకున్నది. పూర్ణజ్ఞాని ఉన్నచోటికి చేరి రొప్పుతూ ఉండిపోయింది.

ఇక అసలే తెలివిలేని అల్పజ్ఞానికి ఏమీ అర్థం కాలేదు. రెండు చేపలు తమ అనుభవాలు వివరించి చెప్పినా అర్థం కాలేదు. అవి విషయాన్నంతా వివరించి, చనిపోయినట్టు నటించడం, అంటే ఊపిరి బిగబట్టడం గురించి మరీమరీ చెప్పినయి.


‘ఓ అదా! సంగతి అర్థమయింది!’ అన్నది అల్పజ్ఞాని
అదికూడా ఎగిరి జాలరి ముందు పడింది.

అప్పటికే రెండు చేపలను పోగొట్టుకున్న జాలరి, ఈ మూడవ చేప చచ్చిందా బతికిందా పట్టించుకోకుండా ఎత్తి సంచిలో వేసుకున్నాడు. ఈసారి వలను మరల మరల మడుగులోకి విసిరాడు. మొదటి రెండు చేపలు గట్టు కింద దాగున్నాయి. ఇటు సంచీ మూత గట్టిగా మూసి ఉంది.
జాలరికి చివరికి విసుగు పుట్టింది.


తిరిగి వచ్చి సంచీలోకి చూచాడు.
అల్పజ్ఞాని శ్వాసను బంధించింది.

చచ్చింది కనీసం పిల్లికయినా పనికిరాకపోతుందా అనుకుని సంచీ మూసి అతను ఇంటితోవ పట్టుకున్నాడు.
(మహమ్మదు మనవడు హుసేన్ చెప్పిన 18వ శతాబ్దం నాటి కథ.)


THREE fishes once lived in a pool. They were: a clever fish, a half clever fish and a stupid fish. Life continued for them very much as it is for fishes everywhere until one day came—a man.

He was carrying a net, and the clever fish saw him through the water. Calling upon his experience, the stories he had heard, and his cleverness, he decided to take action.
'There are few places to hide in this pool,' he thought. 'I shall therefore play dead.'

He summoned his strength and jumped out of the pool, landing at the feet of the fisherman, who was rather surprised. But as the clever fish was holding his breath, the fisherman supposed that he was dead: and threw him back. This fish now glided into a small hole under the bank.

Now the second fish, the half-clever one, did not quite understand what had happened. So he swam up to the clever fish and asked him all about it. 'Simple,' said the clever fish, 'I played dead, so he threw me back.'
So the half-clever fish immediately leaped out of the water, at the fisherman's feet. 'Strange,' thought the fisherman, 'they are leaping about all over the place.' And, because the half-clever fish had forgotten to hold his breath the fisherman realized that he was alive and put him into his satchel.

He turned back to peer into the water, and because he had been slightly confused by the fishes jumping on to dry land in front of him, he did not close the flap of his bag. The half-clever fish, when he realized this, was just able to ease himself out and, flipping over and over, got back into the water. He sought out the first fish and lay panting beside him.

Now the third fish, the stupid one, was not able to make anything at all of this, even when he heard the first and second fishes' versions. So they went over every point with him, stressing the importance of not breathing, in order to play dead.
'Thank you so much: now I understand,' said the stupid fish. With these words he hurled himself out of the water, landing just beside the fisherman.

Now the fisherman, having lost two fish already, put this one into his bag without bothering to look at whether it was breathing or not. He cast the net again and again into the pool, but the first
two fish were crouched into the depression under the bank. And the flap on the fisherman's bag this time was fully closed.

Finally the fisherman gave up. He opened the bag, realized that the stupid fish was not breathing, and took him home for the cat.

Got it?
I am sure!!
****

No comments: