చీకటి వెలుగులు గోపాలం వ్యాసం
చీకటి వెలుగులు
ఒకప్పుడు పట్నంలో కూడా ప్రతి దినం కొన్ని గంటలపాటు కరెంటు ఉండేది కాదు. పల్లెల్లో
నయితే ఎన్ని గంటలసేపు
ఉంటుందో చెప్పగలిగితే గొప్ప! పల్లెలకు కూడా పంటల పేరున
కరెంటు ఇస్తామంటున్నరట. పట్నమంటే పెద్దలంతా ఉండి వ్యవహారం నడిపేచోటు. ఎక్కడ కరెంటుపోయినా అక్కడ పోవడానికి వీలులేదు. అక్కడ అంతా వెలుగే, నీడలు ఉండకూడదు. నేను రాజధాని ఢిల్లీలో ఉండగా డిప్లోమేటిక్ ఏరియా పక్కన ఉండే వాడిని.
ఊరంతా కరెంటు పోయినా సరే అక్కడ మాత్రం పోయేది కాదు. గొప్పవారికి చీకటితో పనిలేదు.
వాళ్లకు బతుకంతా వెలుగే.
వెదకగలిగితే నీడల్లోనూ, చీకట్లోనూ అందం ఉందనే
సంగతి అందరం మరిచిపోయాం. చిన్నప్పుడు నూనె దీపాలుండేవి.
అంతకుముందు ఉండే ఆముదం దీపాలకంటే నేలలోంచి బయటకు వచ్చిన మట్టినూనె
దీపాలు మేలనిపించింది. అప్పట్లో ఇప్పటిలాగా పగలూ, రాత్రీ తేడా తెలియకుండా
చిటుక్కుమని `లైటు' వేసుకుని నీడలు లేకుండా బతకడం తెలిసేది కాదు. బుడ్డి దీపం ముట్టించిన తర్వాత
ఉండేది వెలుతురా చీకటి కూడానా? చెప్పడం కష్టంగా ఉండేది.
ఏం చూడాలన్నా కళ్లు చికిలించాల్సి వచ్చేది. చదువు కూడా వాటి
ముందే కొనసాగేది. ఇంట్లో ప్రతి గదిలోనూ కోడిగుడ్డు దీపాలు
మాత్రమే ఉండేవి. కోడిగుడ్డుతో దీపాలు పెడతారని ఎవ్వరికీ అనుమానం
రాకూడదనే. ఆ దీపాల బుడ్డీలు, కోడిగుడ్డు
ఆకారం కంటే కొంచెం పెద్దగా ఉండేవి. చిన్న అక్షరాల అపరాధ పరిశోధన నవలలను కూడా నేను
అటువంటి కోడిగుడ్డు దీపాల దగ్గర చదువుకున్నాను. వంట ఇంట్లో, భోజనాల శాలలో వెలుతురు వచ్చేటట్టు ఒక కందిలీ ఉండేది. వృద్ధులు కందిల్
అంటే దీపం అని అర్థం. ఇది కొంచెం పెద్ద దీపం. దీన్ని హరికేన్ లాంతరు అంటారు. అది
కూడా నిజానికి అంతంత వెలుగే. అందరి భోజనాలు అయ్యేదాకా అది అక్కడే ఉంటుంది.
నిజానికి చేయవలసిన రాచకార్యాలన్నీ పగలుండగానే చక్కదిద్దుకోవడం,
పొద్దుకూకిన తర్వాత,
విరామంగా కాలం గడపడం అప్పటి పద్ధతి. ఇంత ఉడకేసుకుని తినడం, చేతనయినంత త్వరగా పడకేయడం
అప్పటి కార్యక్రమం. ఆ చీకటిలాంటి వెలుతురులో అంతకన్నా చేయవలసిన పనులు ఏవయినా ఉంటే అవి సరదాకూ, ఉల్లాసం
కొరకు చేయవలసినవే. ఊరికే కూచుని ముచ్చట్లు చెప్పుకోవడం మొదలు
భజన, పాట, ఆట మొదలయిన కాలక్షేపం కార్యక్రమాలకు అనువయిన సమయం రాత్రిలో మొదటి భాగం.
మంచి వెలుతురులో చదువుకోవాలంటే దాని ముందుకే చేరాలి. ఇక వీధుల్లో దీపాలు ఉండేవి కాదు. వెన్నెల రోజులయితే,
`వెన్నెల- నీడ' ఆట, `వెన్నెల కుప్పల' ఆట సాగుతుంది. అమావాస్య పక్షమయితే ముడుచుకు పడుకోవడమొక్కటే ఆట. కొంచెం ధైర్యం చేసి ఆ గుడ్డి చీకట్లో బయటకు వెడితే
దృశ్యం చాలా బాగుండేది. కరెంటు దీపాలు ఆ అందాలను దొంగిలించేశాయి.
ఇప్పుడంతా పట్టపగలే! అందుకే కరెంటు పోయినప్పుడు ఉండే చీకటిని ఎవరూ ఇష్టపడడం లేదు.
సంధ్య
వేళలు రెండూ ఎర్రగానే ఉంటాయి. అయితే రెండింటిలోనూ తేడా ఉంది.
పొద్దుటి ఎరుపులో నుంచి పసుపురంగు పుడుతుంది. నేనున్నానంటూ వెలుగు వస్తుంది. నీడలు వస్తాయి. నిజాలు బయటపడతాయి. మరో కొత్తరోజు మొదలవుతుంది. కానీ సాయంత్రం పరుచుకునే ఎరుపు సంగతి మరో రకంగా ఉంటుంది.
అది నెమ్మదిగా నీడలను మాయం చేస్తుంది. చీకటిని పరిచయం చేస్తుంది. అదీ నెమ్మదిగానే! ఆ చీకటి మనతో దోస్తీ చేస్తానంటూ
చేయి చాపుతుంది.
చల్లగా వెన్ను
నిమురుతుంది.
నిద్ర పుచ్చుతుంది. కాలమంటే ఏమిటో
తెలియని పాతకాలం మానవుడు, చీకట్లో ఇంకేమీ చేయలేకనే రాత్రి
నిద్రపోవడం మొదలు పెట్టాడు. మనం ఇప్పుడు తెలివి మీరి తెల్లవార్లూ పనిచేయడం నేర్చుకున్నాం!
సహజంగా,ప్రకృతి సిద్ధంగా వచ్చే చీకటి, వెలుతురూ నెమ్మదిగా వస్తాయి. మీటలతో వచ్చేవి మాత్రం హఠాత్తుగా వస్తాయి.
ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ దొరకని అందం,
జొన్నలు చల్లినట్లు నక్షత్రాలు కనిపించే ఆకాశం! చీకటి పోయింది. దానితో బాటే ఆకాశం అందాలూ మాయమయినాయి.
పగలంతా ప్రపంచతంత్రం నడుస్తుంది. రాత్రి
నడిచేది రమ్యమైన తంత్రం. లేదా రహస్య తంత్రం! మెదడుకు పనిచెప్పే పనులు, సాహిత్య, కళాజగత్తుకు సంబంధించిన
కార్యక్రమాలకు
ఈ చీకటి పొద్దుకన్నా మించిన సమయం మరొకటి లేదు. ఇంత వెలుగుల కాలంలోనూ, ఒకనాటకం, సినిమా, సంగీత కచేరీ నడవాలంటే సాయంత్రం కావల్సిందే.
అంతా వచ్చి చేరిన తర్వాత దీపాలు ఆర్పి చీకటి చేయవలసిందే. జరగబోయే కార్యక్రమానికి ఆ చీకటి
మన మనస్సుల్లో ఒక వాతావరణాన్ని తయారు చేస్తుంది.
పాత కాలంలోనయినా అమ్మమ్మ కథల నుంచి మొదలు అన్ని
రకాల కళారూపాలకు అనువయిన కాలం రాత్రిలో తొలిజాము. ఆ చీకట్లోనే మనసు పంచుకున్న జంటలు,
భయం భయంగానే ఒకచోట చేరి మాటలూ పంచుకునేది. అదంతా చీకటి సమయం. నీడల కాలం. ఈనాటి మీటలకాలంలో నీడలకు తావులేదు. సినిమాల్లో
టెలివిజన్ కథల్లో నీడలుండవు. అంటే
అదంతా నిజం కాదని సూచన. అన్యాయంగా నిజం జీవితంలో కూడా నీడలు లేకుండా పోతున్నాయి. నీడలతోనే కాలం కొలతలు వేసుకున్నారు.
ఒకప్పటి సన్‌డయల్, జంతర్ మంతర్‌లు అందుకు ఉదాహరణలు.
వెలుతురు లాంటి చీకటి, వెలుతురు కలిసిన చీకట్లో నీడలు ఒకటే కాక లోతులూ తెలుస్తాయి. చిత్రపటంలో లోతులు తేవడం కోసం చీకటిని ఆశ్రయించే,
నీడలను సృష్టించే
కళాకారులు ఈ సంగతిని అంగీకరిస్తారు. వెలుగులో దృశ్యం, ప్లాష్ వేసి
తీసిన ఫోటోలా చదునయిపోతుంది.
దక్షిణ భారతదేశపు గుడులలో ఇప్పటికీ చీకటిని
నిలబెడుతున్నారని చాలామంది
గమనించారు. బయట
ఇంటి అలంకరణలు, దీపాలు ఉన్నా,
గర్భగుడిలో చమురు దీపాలు, నెయ్యి దీపాలు మాత్రమే మినుకు మినుకు
మంటుంటాయి. ఆ మసక వెలుతురులో భక్తునికి కనిపించీ, కనిపించని దేవుడు,నిజంగా ఆస్తినాస్తి విచికిత్సను
కలిగిస్తాడు. నక్షత్రాల హోటళ్ళల్లోనూ ఇదే పద్ధతి! బయటంతా వెలుగుల పండుగయినా తిండి తినే చోట మాత్రం చీకటి! అంటే అది అందమనే గదా!
ఎంతమంది గమనించారో తెలియదు కానీ, సినిమాలలో నీడలు కనిపించవు. అక్కడి వెలుగంతా అసలు వెలుగు కాదు.
కృత్రిమమైనది. అందులో నీడలకు చోటులేదు. మరీ ఎక్కువ వెలుగు ఏర్పాటుచేసి అందులో
చీకటి సృష్టించాలని ప్రయత్నిస్తారు. టీవీ షూటింగ్ లో వరుసగా మూడు రోజులు కూర్చుంటే,
ముఖం నల్లగా మాడిపోయేది. మనకు అది అలవాటు లేని వ్యవహారం. అందునా
భారీగా మేకప్ కూడా వేసుకునే పద్ధతి లేదు. సినిమా వాళ్ళు కావాలనే ఎక్కువ మేకప్
వేసుకుంటారు. కనుక వాళ్ల చర్మం బహుశా రక్షింపబడుతుంది.
వెలుగునీడలు గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక
కథ గుర్తుకు వచ్చింది. నక్క ఒకటి పొద్దున్నే వేటకు బయలు దేరింది. ఉదయం కనుక దాని నీడ నిటారుగా
కనిపించింది. ఇవాళ కనీసం నేను తినడానికి ఒక ఏనుగు అయినా కావాలి అనుకున్నది నక్క.
మధ్యాహ్నం సమయంలో ఏనుగు కాదు కదా ఎలుక కూడా దొరకలేదు. ఆకలి మాత్రం మండుతున్నది.
సూర్యుడు నడినెత్తిన పొందుతున్నాడు. ఇప్పుడు నీడ చూస్తే అది పొట్టిగా ఉంది. అసలు
లేనట్టుంది. ఇంత ఆకలి ఉన్నా నాకు తిండి ఎంత కావాలి అని నక్క ఆశ్చర్యపోయింది. నీడలు
మనిషిని మప్పగిస్తాయి.
చూడు చూడు నీడలు, నీడలు పొగ మేడలు అన్న పాట బహుశా పెద్ద కవి ఎవరో రాశారు. నీడలు ఉండవు. కానీ కనిపిస్తాయి.
అవి మారుతుంటాయి. మనం ఉన్న చోటును బట్టి వాటిని గుర్తించాలి. దీపంలో నీడలు
కదలాడుతాయి. పగటి నీడలు పద్ధతిగా ఉంటాయి.
అందరికీ వెలుగు మీద ప్రేమ ఎక్కువ
అయినట్టు కనబడుతుంది. నేనేమో ఇంటి పై కప్పు లో ఏర్పాటుచేసిన లైట్ల లో బల్బులు
తెచ్చి పెట్టాను. కానీ గోడ మీద ఎల్ఈడి ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ ట్యూబ్
లైట్ వెలిగిస్తే ఇళ్ళు ఇంటిలా గాక బట్టల అంగడిగా కనబడుతుంది. నాకు మరీ వెలుగు అంటే ఇష్టం లేదు. చీకటిని ఇష్టపడే
మనిషిని. ఇక ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో అంగళ్లు మిగతా వాటికి, సైన్
బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి వెలుగుతో వీధి వీధి మొత్తం వెలిగిపోతున్నది.
మా ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వెళితే ఎదురుగా ఒక కొత్త హోటల్ పెట్టారు. ఆ పక్కన ఒక
చెప్పుల దుకాణం ఉంది. అవి రెండూ కలిసి స్ట్రీట్ లైట్ల అవసరం లేకుండా చేస్తున్నాయి. ఇటువంటి లైట్లు నగరమంతా
ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. హైదరాబాదు అదేదో లాస్ వేగస్ లాగ, ఇలాంటి
వెలుగు నగరంగా మారిపోయింది. ఈ వెలుగులో నీడలో అస్సలు ఉండవు.
ఏ రంగు లేకుంటే నలుపు మిగులుతుంది. నలుపు
అంటూ ఒక వేరు రంగు లేదు. అచ్చంగా అలాగే, వెలుగు
లేకుంటే చీకటి మిగులుతుంది. చీకటి అనే ఒక పద్ధతి లేదు. వెనుకకు తిరిగి చూస్తే,
ఎక్కడ వెలుగు కనిపించడం లేదు. గుండె మండింది చూచినా, గతం
కనిపించడం లేదు. అని నేను కవిత లాంటిది ఒకటి రాసుకున్నాను. అందరికీ ముందుచూపే కానీ,
గతం గురించి పట్టడంలేదు. గతం అంతా చీకటి కాదు. గతం వెలుగులోనే
మనం ముందుకు సాగుతున్నాము. ముందు ముందు మరింత వెలుగు సాధిస్తా మేమో. కానీ వెలుగు కన్నా చీకటి
ప్రాముఖ్యం ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. చీకటిని అలవాటు చేసుకోవాలి. చీకటిలో
చిన్న దీపం పెట్టాలి. చీకట్లో దారి వెతకాలి. చీకటిలో చూడగలగాలి. చిన్నపిల్లలకు
చీకటిని చూపించి బూచి ఉందని ఏనాడూ చెప్పకూడదు.
నిజానికి కళ్లకు చీకటి
అలవాటవుతుంది. కొంతసేపటికి చీకట్లో కూడా చూడగలుగుతాము. కనీసం వస్తువులు చూచాయగా
నైనా కనిపిస్తాయి. తెలివి విషయంలో మాత్రం ఈ పద్ధతి పనికిరాదు. అజ్ఞానం అనే చీకటి
లో నుంచి అందరూ వెలుగులోకి రావాలి. అప్పుడే చీకటి వెలుగుల మధ్య తేడా తెలుస్తుంది.

No comments:
Post a Comment