XXXVIII
At the court of Kisra, or Nushirowan, a cabinet council
was debating some State affair. Abu-zarchamahr,
who sat as president, was silent. They asked him,
“Why do you not join us in this discussion?” He
replied, “ Such ministers of State are like physicians,
and a physician will prescribe a medicine only to a sick
man; accordingly, so long as I see that your opinions
are judicious, it were ill-judged in me to obtrude a
word.—-While business can proceed without my interference,
it does not behoove me to speak on the subject;
but were I to see a blind man walking into a pit, I
would be much to blame if I remained silent.”
కిస్రా లేక నౌషేర్వాన్ ఆస్థానంలో మంత్రుల సమావేశం జరుగుతున్నది.
ఏవో రాచకార్యాల గురించి మాట్లాడుతున్నారు.
అబూ జార్ చమార్ అధ్యక్షుడుగా ఉన్నాడు.
కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు.
"చర్చలో ఎందుకు పాలుగొనవు?" అని వారు అతనిని అడిగారు.
"మీ వంటి రాజ్య మంత్రులు వైద్యుల వంటివారు.
వైద్యుడు, రోగం వచ్చిన మనిషికి మాత్రమే మందులిస్తాడు.
కనుక, మీ అభిప్రాయాలు న్యాయబద్ధంగా ఉన్నంత వరకు
నేనొక మాటతో అడ్డు రావడం తప్పవుతుంది.
నా ప్రమేయం లేకుండా పని కొనసాగుతున్నంత వరకు,
విషయం గురించి మాట్లాడడం సరిగాదు.
కానీ, గుడ్డి మనిషి గుంటలో పడుతున్నట్లు
కనబడితే మాత్రం,
మాట్లాడకుండా ఉంటే నేను తప్పు చేసిన వాణ్ణవుతాను"
అన్నాడతను.
Let us enjoy words and works of wisdom
$$$$$$$
No comments:
Post a Comment