He showed the employee all the gadgets that he could use!
At the end, he asked about the manual that must have come with the employee!
Everything, these days, comes with a manual.
The employee must also have come with one!
Otherwise how do we make him work?
మరి నీ సంగతి?
March 23rd, 2011
ఉద్యోగి: థాంక్స్ సర్!
మే: ఇదుగో ఇదే నీ కంప్యూటర్! ఇది అన్ని కంప్యూటర్స్ లాంటిది కాదు. మన కంపెనీ కోసం తయారు చేయించిన కస్టమైజ్‌డ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇందులో ఇన్‌స్టాల్ అయి ఉన్నాయి. అదుగో మ్యాన్యువల్ కూడా సిద్ధంగా ఉంది. జాగ్రత్తగా చదువు! తెలివిగల వాడివి! అన్నీ సులభంగా అర్థమవుతాయి!
ఉ: థాంక్స్ సర్! తప్పకుండా చదువుతా!
మే: ఇదుగో నీవు వాడడానికి ఇది మల్ట్ఫింక్షన్ డివైస్! ఇది కూడా మన ఇతర బ్రాంచీలన్నింటితో లింక్ అయి ఉంటుంది. మ్యాన్యువల్ ఉంది. చదువు! అన్నీ అర్థమవుతాయి!
ఉ: సరే సర్, తప్పకుండా!
మే: ఇదుగో ఇది నీ ఫోన్! ఇది కూడా మామూలు ఫోన్ కాదు. దీంతో చేయగలిగే పనులు చాలా చాలా ఉన్నాయి. మ్యాన్యువల్ ఏదీ? డెస్క్‌లో ఉంటుంది. లేకుంటే మెయింటెనెన్స్ వాళ్ళను అడుగు! ఈ ఫోన్‌తో నీ పని చాలా సులభమవుతుంది!
ఉ: ఓకే సర్, థాంక్స్!
మే: అంతా బాగుంది. కానీ, మరి నీ మ్యాన్యువల్ ఏదీ?
ఉ: అదేమిటిసర్! నా మ్యాన్యువల్ ఏమిటి? అర్థం కాలేదు!
మే: చూడూ! ప్రతి యంత్రంతో ఒక మ్యాన్యువల్ ఉంటుంది. ఆ యంత్రాన్ని వాడుకునే పద్ధతి అందులో వివరంగా రాసి ఉంటుంది. యంత్రంతో బాటే అదే పెట్టేలో ఆ మ్యాన్యువల్ కూడా ఉంటాయి! నువ్వు అదే పద్ధతిలో కొత్తగా వచ్చావు. నీతో ఒక మ్యాన్యువల్ కూడా వచ్చి ఉండాలిగా మరి! లేకుంటే నీతో నేను పని చేయించడం ఎలా?
ఉ: (ఉలకడు. పలకడు!)
Interesting read!!
$$$$$$
No comments:
Post a Comment