Here is an interesting story from Sadi.
ఖురాసాను రాజుల్లో ఒకతనికి సుల్తాను మహమ్మదు కలలో కనిపించాడు. అప్పటికి సుల్తాను మరణించి వందేళ్లయింది.
కలలో కనిపించిన సుల్తాను శరీరమంతా కరిగి దుమ్మయి ఉంది. ఒక్క కళ్లు తప్ప. అవి అటుయిటు తిరుగుతూ దేని కోసమో చూస్తున్నాయి. పండితులెవరూ కలకు అర్థం చెప్పలేక పోయారు. ఒక దర్విష్ మాత్రం వంగి సలాము చేసి ఇలా చెప్పాడు. అతను తన రాజ్యం ఎట్లా ఇతరుల చేతజిక్కిందని ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు అన్నాడతను.
ఎందరో ఘనులు మట్టిలో నిద్రించినారు
భూమిన వారి ఉనికి జాడలే లేవు
మట్టిలో కప్పినట్టి ఆ ముసలి శవము
మట్టియైనది, ఎముకయు మిగుల లేదు
నౌషేర్వాన్ ఘనకీర్తి నిలిచి ఉంది
అతడు గతించి ఎంత కాలమైననేమి
మనిషీ, మంచి చేయవలె, బతుకునొక వరముగా నెంచవలె.
ముఖ్యముగ, గొంతెత్తి, మనిషి లేడని, చాటినపుడు.
The Eyes
One of the kings of Khorasan had a vision in a dreamof Sultan Mahmud, one hundred years after his death.
His whole person appeared to have been dissolved andturned to dust, except his eyes, which were revolvingin their orbits and looking about. All the sages wereunable to give an interpretation, except a dervish whomade his salutation and said: ‘He is still looking amazed how his kingdom belongs to others.’
Many famous men have been buried under ground
Of whose existence on earth not a trace has remained
And that old corpse which had been surrendered tothe earth
Was so consumed by the soil that not a bone remains.
The glorious name of Nushirvan survives in goodrepute
Although much time elapsed since he passed away.
Do good, O man, and consider life as a good fortune,
The more so, as when a shout is raised, a man exists no more.
Let us enjoy some great ideas!
^&^&^&^&