He said:
Looking for the stone in the water
and looking for the water in the stone.
It is I, who is optimistic in the time of fall
It is I, who loves the wheat woman
and is not scared of the death of silence.
In the crowd I eat few words
and wink to the women passing by.
I see gazelles crying
and I see happiness committing suicide in the city plaza.
I remember, how my apple turned back, naked
before the moon, and how its fear stepped back
and begged for forgiveness.
Alphabet on the wall
asking the wall to turn into ash
and not reveal the buildings’ secrets.
The buildings say as they close their doors:
When the concept is clear, the police disappear
అతనన్నాడు
నీటిలో రాతికోసం వెతుకులాట
రాతిలో నీటి కోసం వెతుకులాట
పడిపోయే సమయంలోనూ ఆశాభావం కనబరచేది నేనే గదా
అందమయిన అమ్మాయిలను ఆనందంగా ప్రేమించేది నేనే గదా
నాకు నిశ్శబ్దమనే మరణం గురించి ఇసుమంతయినా చింత లేదు
గుంపులో నేను కొన్ని మాటలను మింగేస్తాను
పక్కగా వెళుతున్న అమ్మాయికి కన్ను గిలుకుతాను.
జింకలు ఏడుస్తుంటే చూస్తాను
నగరం నడిబొడ్డున సంతోషం తనను తాను చంపుకుంటుంటే చూస్తాను కూడా
నాకు, నా పండు, దిసమొలతో, వెనకతిరగడం గుర్తుంది.
అది చంద్రుని ముందర, దాని భయం వెనక్కు తగ్గి
క్షమించమని అడుక్కోవడమూ గుర్తుంది.
గోడ మీద అక్షరాలు
గోడను బూడిదగా మారమంటున్నాయి.
భవనం రహస్యాలను బట్టబయలు చేయవద్దంటున్నాయి.
భవనాలు తమ తలుపులను మూసుకుంటూ
విషయం అర్థమయితే పోలీసు వాళ్లు మాయమవుతారంటున్నాయి.
Let us enjoy good play with words!!
^^^^^^