అతిశయమని ఒక గుణం ఉంది.
ఒకటి చేయవలసిన చోట నాలుగు, వీలయితే నలభయి చేయడం, కొందరికి అలవాటు.
దీనికి మరొక చివర, కడుపుకు కూడా కావలసినంత తినకపోవడం.
రెండూ తప్పే.
ఒకరికి పెట్టకుండా తినడం గొప్పదనం కాదు.
మనం కూడా తినకపోవడం, గొప్పదనం అసలే కాదు.
అయితే మాకు గనుక దాతృత్వమున్నదని, మాకు గనుక కలిమి ఉన్నదని, ప్రదర్శించడం అసహ్యకరంగా ఉంటుంది.
కొందరు ధనవంతులకు ఇదొక జబ్బు.
దాన్ని తప్పు పట్టడానికి లేదు.
మరి కొందరు గూడులాంటి ఇంట్లో ఉంటారు.
పెట్టుపోతలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉంటాయి.
వాటితో అప్పులపాలయినా ఆశ్చర్యం లేదు. అదొక జబ్బు.
బాగా ఉండికూడా పిల్లికి బిచ్చం పెట్టని వారిని చాలా మందిని ఎరుగుదుము.
వారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. బాగానే ఉంటారు.
వారిలో కొందరు బాగా తింటారు కూడా. అది కూడా ఒక పని.
వారి గురించి మాటాడనవసరం లేదు.
తమకు సరిపడినంత వండుకుని సంతృప్తిగా తినే వారు గొప్పనా?
అనవసరంగా వండి పెంటకు కొట్టేవారు గొప్పనా?
No comments:
Post a Comment