ఏడుకొండల ఎంకన్నను చూడడానికి వీఐపీలు అంటే నిజంగా పెద్దమనుషులు వెళ్లినపుడు ఆలయం అధికారులు ఎదురువచ్చి ఆహ్వానం పలికే సంప్రదాయం ఒకటి ఉన్నది. మిగతా చోట్ల అంతా పూర్ణకుంభ స్వాగతం అని సలాంఛన స్వాగతం అని ఆ కార్యక్రమానికి పేరు. తిరుమల క్షేత్రం వారు మాత్రం ఇస్తికపాల అనే స్వాగతం పలికారు అని పత్రికలలో రాస్తుంటారు. ఈమాటకు ఎవరికీ అర్థం తెలియదు. రాచకార్యాలన్నీ ఉర్దూలో జరుగుతున్న కాలంలో ఈ మాట పుట్టింది అని నా వంటివారు చెప్పగలరు. ఉర్దూలో ఇస్తెఖ్బాల్ అంటే స్వాగతం అని అర్థం. స్వాగతం గురించి జరిగే తంతును ఇస్తెఖ్బాలియా అంటారు. బహుశా దేవస్థానంవారి పాత పుస్తకాలలో ఈ మాట రాసి ఉంటుంది. ఇప్పటి అధికారులకు దాని అర్థం తెలియదు. కనుక అదేదో గొప్ప విషయం అనుకుని అదే మాటను వచ్చీరాని పద్ధతిలో ఇస్తికపాల అని చెప్పడం నేర్చుకున్నారు. స్వాగతానికి కపాలాలతో సంబంధం లేదు. కుండలాలతో అంతకన్నా లేదు. ఈ చిన్న విషయాన్ని నేను ఒకటి రెండు చోట్ల రాశాను. కానీ అది ఎవరి దృష్టిని ఆకర్షించినట్లు లేదు. కనుక ఊరుకున్నాను. వేంకటేశ్వర స్వామిని దీర్ఘాలు ఇష్టంలేనివాళ్ళు అందరూ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. సంస్కృతం సమాసం ప్రకారం ఆయన పేరుకు అర్థం మారిపోతుంది. ఇక ప్రేమ ఎక్కువైనవాళ్లు అంతమాట వదిలేసి ఎంకటేశ్వరుడు అంటారు. యంగటేస్పరుడు అనగా కూడా విన్నాను. మరాఠీ వారు వేంకట శబ్దాన్ని పట్టించుకోకుండా వ్యంకట అనే మాటను వాడతారు. దేవుడి పేరుకే దిక్కులేదు. ఇక నన్ను పట్టుకుని కపాలం అన్నవారిని ఏం చేయగలను? ఇంగ్లీషులో కామెడీ, ట్రాజెడీ అని రెండు మాటలు ఉన్నాయి. కామెడీ అంటే హాస్యంతోకూడినది అని ఒక వైపు, సుఖాంతం అని మరొకవైపు అర్థాలు ఉన్నాయి. నవ్వు పుట్టించే మాట చెబితే దాన్ని ఇంగ్లీషులో జోక్ అంటారు. ఎందుపు పుట్టిందో తెలియదు కానీ, ముఖ్యంగా సినిమా రంగంతో ప్రారంభమై కామెడీ చేస్తున్నాడు అని ఒక ఎక్స్‌ప్రెషన్ వాడుకలోకి వచ్చింది. అంటే నవ్వు పుట్టే విధంగా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. కామెడీ అనే ఇంగ్లీషు మాటలు సి తరువాత ఓ ఉంటుంది. అంటే గింటే దాన్ని కోమెడీ అనవచ్చుగానీ మనవాళ్ళు చాలామంది దాన్ని కాకు యావత్తు ఇచ్చిన రకంగా క్యామెడీ అని పలుకుతున్నారు. అది తప్పు. తప్పున్నర. మాటలకు అర్థాలు మారిపోవడం ఇట్లాగే మొదలవుతుంది. మార్పు కారణంగా ఎవరికైనా సౌకర్యం కలిగితే దాన్ని అంగీకరించవచ్చు. కానీ విషయం తెలియక మూర్ఖంగా మార్పులు చేస్తే భాష మారిపోతుంది.
మైండ్ అంటే మనసు మెదడు. వాటికి సంబంధించిన విషయాలను మెంటల్ మేటర్స్ అంటారు. మళ్లీ ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ, మెంటల్ అంటే వెర్రి అనే అర్థం ఒకటి తెలుగులో స్థిరమైపోయింది. వాడికి ఏమైనా మెంటలా? అన్న ప్రశ్న సినిమాల్లోనూ, పుస్తకాల్లో కూడా కనిపించినట్టు అనుమానం. చెప్పడానికి ప్రయత్నిస్తే గోపాలానికి మెంటల్ అంటారేమో? గోపాలం మెంటల్ అంటే నాకు అభ్యంతరం లేదు. నాకు కొంత పిచ్చి ఉంది. ఊరికే ఆలోచించే గుణం కూడా ఉంది.
కుర్రవాళ్ళు ఈమధ్యన అర్థం తెలిసి తెలియక కిర్రాక్ అని ఒక మాటను వాడుతున్నారు. పైపేరాలో చెప్పుకున్న మెంటల్ మనుషులకు అది విశేషణం. క్రాక్ అనే మాటకు పగులు అని అర్థం. క్రాక్‌పాట్ అంటే పగిలిన కుండ అని అర్థం. కానీ ఒక మనిషిని క్రాక్‌పాట్ అంటే ఆ వ్యక్తి బుర్రలోని మెదడు ఉండవలసిన పరిస్థితిలో లేదు అని అర్థం. అటువంటివారిని క్రాక్ అనడం కూడా ఉంది. శుభ్రంగా వున్న ఆ ఇంగ్లీష్ మాటను వాడక కిర్రాక్ అని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థంకాలేదు.
ల్యాంటర్న్ అన్నది ఒక ఇంగ్లీష్ మాట. దానికి దీపం అని అర్థం. అది మామూలు దీపం కాదు. మంటకు రక్షణగా గాజుబుడ్డి గల దీపం. హరికేన్ అనే మాటలో వున్న హరికి సంస్కృతంలో దేవుడు, సింహం అని అర్థాలు వచ్చే హరి అన్నమాటకు అసలు సంబంధంలేదు. హరికేన్ అంటే హరి చేతిలోని కర్ర కాదు. పెద్ద పెట్టున గాలివస్తున్న తుఫాను లాంటి పరిస్థితి అది. అంతటి గాలిలో కూడా ఆరిపోకుండా ఉండే దీపాన్ని హరికేన్ ల్యాంటర్న్ అంటారు. మా చిన్నతనంలో ఆకుపచ్చ రంగుల్లో ఇటువంటి దీపం ఒకటి ఇంట్లో ఉండేది. మిగతాన్నీ కోడిగుడ్డు దీపాలు. వాటి బుడ్డి చిన్నది. వెలుగు కూడా చిన్నది. కందిలి అనే పెద్ద దీపంలోని ఒత్తి వెడల్పుగా ఉంటుంది. కనుక దాని నుంచి వెలుగు ఎక్కువగా వస్తుంది. ఖందిల్ అన్నది ఉర్దూ మాట. అది తెలుగులో ఈ కందిలిగా మారింది. అదే దీపాన్ని చారిత్రక కారణాలుగా ఉర్దూ ప్రభావం లేక ఇంగ్లీషు ప్రభావంగల ప్రాంతంవారు లాంతరు అని పిలుచుకున్నారు. మాటలను సులభంగా మన భాషలో కలుపుకోవడానికి ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. జమీందారుగారు ముద్దాయిని హాజరుపరచమని హుకుం జారీచేశారు, అని ఒకప్పుడు నేను రాసిన వ్యాసం వాక్యం గుర్తుకువస్తున్నది. గారు తో బాటు చేశారు, పరచమని అన్నది మాత్రమే తెలుగు మాటలు. మిగతావన్నీ ఉర్దూ మాటలు. జమీన్ అంటే భూమి. భూమిగలవాడు, ధనవంతుడు గనుక భూమిగల వారు భూస్వామి. ఆయనకి పేరు జమీందారు. ఈమాట ఉర్దూ అని చెబితే నన్నిప్పుడు మెంటల్ కింద లెక్కపెడతారు. కుర్ర జమీందారు, పిల్ల జమీందారు లాంటి మాటలు కూడా మనవాళ్ళు కలకాలంగా వాడుకుంటూనే ఉన్నారు. ముద్దాయి అంటే నిందితుడు అని అర్థం. ఇవన్నీ ఉర్దూ మాటలే. ఆ సంగతి మనకు పట్టదు. వాటిని హాయిగా తెలుగు మాటల క్రింద లెక్కపెట్టుకుంటున్నాము. కొంచెంలోని ఏ భాష అయినా మొహమాటం లేకుండా మిగతా భాషల మాటలను ఈ రకంగా కలుపుకుంటూ పోతుంది. అప్పుడే ఆ భాష అభివృద్ధి చెందుతుంది.
జుర్మ్ అంటే నేరం. జుల్మ్ అంటే నేరంతో కూడిన ఒత్తిడి. నేరం చేస్తే వేసే శిక్షలో డబ్బులు వసూలు చేసే పద్ధతి కూడా ఉంది. జుర్మ్ కారణంగా వసూలు చేసే మొత్తాన్ని జుర్మానా అంటారు. పోలీసు వాళ్ళు, మరొకరు తమ ధోరణిలో అతిగా ప్రవర్తించే తీరును జుల్మ్ అంటారు. జుర్మానా తెలుగులోకి వచ్చి జరిమానాగా మారింది. జుల్మ్ అన్నమాట జులుంగా రూపం పోసుకున్నది. హాయిగా అందరూ మాటలను అర్థం తెలిసి తెలియక వాడుకుంటున్నారు. ఇపుడు ఈ విశే్లషణ అవసరమా అని ఎవరైనా అడిగితే మీరు భాష యొక్క గొప్పతనాన్ని బేఖాతిర్ చేస్తున్నారు అని నేను అనకతప్పదు. ఖతర్ అంటే మర్యాద గౌరవం అని అర్థం. దాని విశేషణం ఖాతిర్. మర్యాద గలవారు ఖతర్ దాన్‌లు. అటువంటి మర్యాదలను పట్టించుకోకుండా ఉంటే బేఖాతిర్ అనే పరిస్థితి వస్తుంది. ఈ వ్యాసం రాసిన నాటి తెలుగు పేపర్లో కూడా దేన్నో బేఖాతరు చేశారు అంటూ ఒక్క శీర్షిక కనిపించింది. మాటకు అర్థం తెలిసి వాడితే బాగుంటుంది. ఇటిమాలజీ అంటే మాట పుట్టిన తీరును గురించిన శాస్త్రం. ఏ మాటకైనా ఇటిమాలజీ తెలియకున్నా కనీసం అర్థం తెలిసి వాడితే చాలా బాగుంటుంది. బేఖాతర్ లేదా బేఖాతరు అంటే పట్టించుకోలేదు; నిర్లక్ష్యం చేశారు అన్న అర్థంలో వాడుతున్నారు. కనుక పరిస్థితి బాగానే ఉన్నట్టు లెక్క.
మాట ఉంటే మతలబ్ ఉంటుంది. అంటే మాటకు అర్థం ఉంటుంది. మతలబ్ మాటకు అర్థం అని పేరు. గూడార్థం అని మాత్రం ఆ మాటకు అర్థం లేదు. అంతేకానీ తెలుగులో ఆయన మాటలలో ఏదో మతలబు ఉందిలే అంటే గూడార్థం వుంది అన్న అర్థం పలుకుతుంది. అక్కడ అనర్థం మొదలవుతుంది. తెలుగులో మతలబు అని రాసినది అనర్థం. లేదా విపరీత అర్థం. అంతేగాని మతలబ్ అంటే కేవలం మాట యొక్క అర్థం మాత్రమే. అచ్చం ఇదే పద్ధతిలో గూడుపుఠాణీ అనే మాట ఒకటి తెలుగులో వాడుకలో వున్నది. మతలబ్ ప్రకారం చూస్తే గుడ్ అంటే బెల్లం. పుఠాణి అంటే కొందరికి పుట్నాలు. మరికొందరికి పిడత కింద పప్పు లేదా శనగపప్పు. పుట్నాలు, బెల్లం కలిపి తినడం కొబ్బరి, బెల్లంలాగే నాలాంటి కొందరికి అభిమాన కాంబినేషన్. కానీ అమాయకమైన ఆ పుట్నాలు, బెల్లం అనే మాట వెనుక ఏదో మతలబు వుంది అనుకుంటే, ఉర్దూ తెలిసిన నాలాంటివారికి మతలబ్ దొరకదు. గూడుపుఠాణి అనే పేరుతో సినిమా కూడా వచ్చినా వచ్చి ఉండవచ్చు. ఆ మాటకు మనకు తెలిసిన తెలుగులో ఏదో కుట్ర అని అర్థం. ఆ అర్థం ఎట్లా వచ్చింది అన్న కథ తెలిసి వుంటే నిజంగా మతలబు బయట పడేది. నాకైతే ఆ కథ తెలియదు. తెలిసినవాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని తెలియచెప్పమని మనవి.

No comments:
Post a Comment