This is an article published in the magazine Sharada after the sad demise of the young artiste.
దామెర్ల రామారావు
రాజమహేంద్రవర పుర వాస్తవ్యులగు దామెర్ల రామారావుగారి
యకాలమరణమును గూర్చి నివేదించుట కెంతయు చింతిలుచున్నారము. వీరి కిరువది
యేడువత్సరములు మాత్రమే వయస్సు. కాని వారికిప్పుడే శతవర్ష పరిమితి యగుట యాంధ్రుల
దురదృష్టమనుటకు సందియములేదు. వీరాంధ్ర దేశమునందేకాక భారతదేశము నందును ` ఖండాంతరముల యందుగూడ కీర్తిగణించిరి. వీరివలననే దేశ
దేశాంతరములు ` ఖండ ఖండాంతరములయందు శిల్ప
కళాసామ్రాజ్యము నందాంధ్రుల కర్హస్థానము లభించునని యువ్విళ్లూరుతుండ బంధుమిత్రులు,
విద్యార్థులు, విద్యాధికుల కోరికల నూడబెరికి రామారావుగారిని పరలోకమునకుగొని యేగిన విధి నేమన
వలయును?
వీరితండ్రి దామెర్ల రమణారావు పంతులుగారు ప్రసిద్ధికెక్కిన
వైద్యులైయుండిరి. సంఘసంస్కార ప్రియులు. వీరేశలింగం పంతులుగారికి కుడిభజమైయుండిరి.
అందువలననే వారు పుత్రికా పుత్రుల కున్నతవిద్య జెప్పించి పరమపదించిరి. వీరియున్న
గారగు వేంకటరావుగారు కూల్డ్రేగారి శిష్యులు. ఆర్ట్సు కాలేజి ప్రింసిపాలగు
కూల్డేగారే రాజమహేంద్ర వరమున శిల్పబీజముల నాటిన మహనీయుడు.
చాలమంది యువకులను చేర దీసి కళావిషయముల బోధించియుండిరి. వారి యపూర్వాదరణకు బాత్రమైన
వారిలో ముఖ్యులు మన రామారావు గారొక్కరు.
రామారావుగారికి స్వభావ సిద్ధముగనే శిల్పకళ యలవడెను. ఈయన
బాల్యము నుండియు చిత్తరువుల రచించుచుండిరి. వీరు చిన్నప్పుడు స్వతంత్రముగ రచించిన
చిత్తరువుల గాంచి కూల్డేగా రానంద భరితులై యీతడాంధ్రదేశమున శిల్పపీఠము నలంకరింప
గలడను నమ్మకమున ధనసహాయమొనర్చి బొంబాయియందు గవర్నమెంటువారు స్ధాపించిన శిల్ప
కళాశాలకు బంపించిరి.
అచ్చటనయిదువత్సరములు శిల్పవిద్యనభ్యసింపవలయును. కాని
ప్రధమముననే రామరావుగారిన మూడవతరగతియందు జేర్చుకొనిరి. ఉపాధ్యాయులు విద్యార్ధులు
నబ్బురబాటు జెంద వీరుమూడువత్సరములలో సంపూర్ణ పాండిత్యమునార్జించి
ప్రఖ్యాతిగాంచిరి. ఆ కాలేజి ప్రింసిపాలగు సాలమనుగారు అజంటా పద్ధతులనుగ ఊడ తన
పద్ధతులయందు జొప్పింపజొచ్చెను. రామారావుగారు సాలమను మొదలగు ప్రముఖుల
యాశీర్వాదమునొంది యజంటాకేగి యచ్చటి మనోహర ప్రాచ్య శిల్ప చిత్తరువులగాంచి
కలకత్తాకేగి జగద్వ్యిఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకళాచార్యులగు అవనీంద్ర నాధటాగూరు,
గగనేంద్ర నాధటాగూరు, నందలాల్‌బోసు మొదలగు శేముషీ దురంధరుల దర్శించి పావనగోదా నరీసలిలముల
పవిత్రమగుచున్న రాజమహేంద్ర పురమున స్వగృహమునందు చిత్రరచనకు గడంగిరి. వీరురచించిన
గోదావరి చిత్తరువునొక దానిని శారద, యందు బ్రచురించు
యుంటిమి. ఆ చిత్తరువు పాఠకుల మిక్కుటముగ నాకర్షించియుంట యతిశయోక్తిగాదు.
రాజమహేంద్రవరము కాకినాడ పురములయందు జరిగిన ప్రదర్శనములయందు వీరికి ప్రధమ బహుమానము
వచ్చెను.
1922 సంవత్సరమున కలకత్తాయందు జరిగిన ప్రాచ్యశిల్ప ప్రదర్శనమును
గాంచుట కేగియుంటిమి. అప్పుడేమఱి యొకచోట గవర్ణమెంటువారొక శిల్ప ప్రదర్శనమును
బెట్టిరి. అందు రామారావుగారి చిత్తరువులకు ప్రధమ బహుమానము. వచ్చుటయే కాక, ఈతనినామధేయము కలకత్తాయందంతటను మారు మ్రోగెను. కొందఱు
స్నేహితులు రామారావుగారి చిత్రములగూర్చి మాతో ప్రసంగింపుచు, నాతని కళానిపుణతను శతముఖముల వెల్లడిరచిరి ` అండను నందు జరిగినవెంబ్లీ యెగ్జిబిషను నందు వీరి
చిత్తరువులు గణకెక్కెను.
కెనడా యెగ్జిబిషనునకు వీరి బొమ్మలలో కొన్నిటి నెన్నిరి `
శుక్లపక్ష చంద్రుని బోలినది దినాభివృద్ధి గాంచుచున్న
రామారావుగారి స్వర్గారోహణ పర్వమువలన గలిగిన దీరనిదుఃఖమునకు వీరి కుటుంబమునకును,
బంధు బాంధవులకును మాహృదయ పూర్వకముగు సానుభూతిని
దెల్పుచు, రామారావుగారి యాత్మకు శాంతిని గలిగించు గాతయని
పరమేశ్వరుని బ్రార్ధింపుచున్నాము.
No comments:
Post a Comment