I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, January 29, 2018
Tuesday, January 23, 2018
Saturday, January 13, 2018
Panduga - Festival that is!
సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో తొంభయి తొమ్మిది శాతం మంది అవును అంటరు. సూర్యుడు ఉదయించడము, అస్తమించడము నిజమే. అయితే కదిలేది సూర్యుడు కాదు భూమితో బాటు మనం సూర్యగోళం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఒక చుట్టు తిరగడానికి ఒక సంవత్సరము. అయితే సూర్యుని చుట్టు తిరుగుతున్న భూమి,
బొంగరంలాగ తన చుట్టు తాను కూడా తిరుగుతున్నది. కనుక పగలు రాత్రి కలుగుతున్నయి. సూర్యుడు ఉదయించి,
అస్తమించే ఆభాసలు కూడా కలుగుతున్నయి. ఈ తిరుగుతున్న భూమి బొంగరంలాగ నిటారుగా తిరగదు. ఇరవయి మూడు డిగ్రీలు ఒక పక్కకు వంగి ఉంటుంది. కనుక రుతువులు,
మరెన్నో వీలయినవి.
ఎంతమంది గమనించినరు అన్నది నాకు తెలియదు గానీ, సంవత్సరం పొడుగున సూర్యుడు ఒకేచోట ఉదయించడు. మన ఇల్లు సరిగ్గ తూర్పు దిక్కుకు మళ్లి ఉంది అనుకుందము. సంవత్సరమంత ఉదయాన సూర్యుని వెలుగు సూటిగ ఇంటిలోకి రాదు. అది ఉత్తర, దక్షిణాలకు కదిలి ఉంటుంది. అవే ఉత్తర దక్షిణ అయనాలు. జనవరి నెలలో సూర్యుడు సూటిగ ఇంటిలోకి దూరి పలకరిస్తడు. రేపు మీరు ఈ సంగతి గమనించి చూడండి. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అనే కాలం మొలవుతుంది. సంక్రాంతినాడు ఇంట్లోకి సూటిగ వచ్చిన సూర్యుడు తూర్పు వేపు కదలడం మొదలవుతుంది. క్రమంగా, సంతవ్సరంతా గమనించి చూడండి. అంతకు ముందు ఈ సంగతి పట్టించుకోని వారికి ఆశ్చర్యం గ్యారంటీ.
పంచాంగం ప్రకారం ప్రతి నెలా ఒక సంక్రాంతి ఉంటుంది. సూర్యుడు నెలకు ఒకటి ప్రకారం రాశులలో ప్రవేశిస్తాడు. సైన్సు ప్రకారం కూడ ఈ లెక్కను వివరించవచ్చు. పనె్నండు రాశుల స్థానాలకు, సూర్యునికి పొందిక ఆ రకంగ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది సౌర కుటుంబంలోని గ్రహాలు కావు. నక్షత్ర సమూహాల సంగతి ఇది. సౌరమానం అంటే సంవత్సరాన్ని ఈ కదలిక ప్రకారం విభజించే తీరు. తమిళుల పంచాంగంలో రాశుల ప్రకారం నెలలు ఉంటాయి. తెలుగు వారు, మరాఠీలు మరి కొందరి పద్ధతిలో చంద్రుడు, నక్షత్రాల కలయికతో నెలలు ఏర్పడతాయి. సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశిస్తే అది ఆ రాశి పేరున సంక్రమణం. మకరంలోకి ప్రవేశించే మకర సంక్రమణమే మకర సంక్రాంతి. అదే పొంగల్, లోహ్రీ, మన సంకురాత్రి పండుగ. సూర్యుని లెక్క గ్రెగోరియన్ కాలెండర్లో కూడ పొందుపరుపబడి ఉంది. అందుకే సంక్రాంతి పండుగ ప్రతి ఏటా జనవరి పదునాలుగు, పదిహేనులలోనే వస్తుంది. సౌరమానం, చాంద్రమానం కలిగే పరిస్థితి ఇది. సైన్స్, సంప్రదాయం కలిసే పరిస్థితి ఇది. ఇక మాఘమాసం వస్తుంది. మంచి రోజులు వస్తాయి. ఇక మీదట ప్రతినెలా సూర్యుని కదలికలను గమనించే ప్రయత్నం చేయండి. ఈ మంచి రోజులన్న మాట వెనుక ఆంతర్యం సులభంగా అర్థమవుతుంది. మబ్బులు, వానలు ఉన్నంతకాలం అంతా చికాకు. చలి కూడా చికాకే. ఏ పని చేయాలన్నా ఆటంకాలే. ఇక మీద ఆరు నెలలపాటు అట్లా ఉండదు. అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఇంక సంక్రాంతి పండుగ సంగతి. చిన్ననాటి ననుంచి మాకు తెలిసి పండుగ మూడు నాళ్లు ఏదీ పట్టని పల్లెవారు కూడా ఈ పండుగ చేసుకుంటరు. మొదటినాడు భోగి. చలిమంటలు, తలస్నానాలు. మాకది నూగుల రొట్టెల పండుగ. జొన్నరొట్టెలు గాక ఆనాడు సజ్జ లేదా వరిరొట్టెలు చేస్తరు. వాటికి పుష్కలంగ నువ్వులు అనే నూగులను అతికిస్తరు. ఆ రొట్టెలోకి తినెటందుకు కలెగూర, కలియగూర చేస్తరు. గుమ్మడి, చిక్కుడు, వంకాయ, గోరుచిక్కుడు, మెంతికూర మొదలయిన కాయగూరలన్ని కలిపి నూలపూడి కలిపి వండె కత అది. అంటే సంక్రాంతి సమయానికి రకరకాల కూరగాయలు పుష్కలంగ అంది వస్తయని అర్థము.
రెండవనాడు అసలయిన సంకురాత్రి పండుగ. ఆనాడు పాలు పొంగించేది, పులుగము వండేది ప్రత్యేకము. ఈ ప్రపంచానికి, ఇక్కడి జీవులకు, వాటి ఆహారానికి, ఆరోగ్యానికి ఆధారము సూర్యుడు. ఆ సూరన్న దేవుడు నిత్యం కనపడుతడు. ఆయనకు, ఆయన ముందరనే నైవేద్యం వండి, ఆరగింపు చేయాలె. భోగినాడే ఊరిలోని బాజాభజంత్రీల వాండ్లు, తెల్లవార, తమ వాద్యబృందముతో ఊరంత తిరుగుతరు. పాలు పొంగించే యిండ్ల వారికి, కుమ్మర్లు, కుండలు, గురుగులు ఇచ్చి పోతరు. వాండ్లకు పంటలో బహుమానం.
చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది అంటే అక్కలతోటి గలిసి తమ్ములకు కూడ చేతినిండ పని. ఒక నెల ముందే సంక్రాంతి నెల నిలవెడుతరు. అప్పటి నుంచి ప్రత్యేకముగ పిడకల తయారి మొదలవుతుంది. పండుగ వచ్చింది, అంటే అంగణమంత ముగ్గులతోటి నింపాలె.
అందుట్లో పాము ముగ్గు, తేలు ముగ్గు కూడ ఉంటయి. వాటిని గుర్తించి గౌరవించే పద్ధతి మన సంప్రదాయంలో ఒక భాగం. ఇగ గొంతెమ్మల తయారీ, ఇల్లంత వాటిని అలంకరించడము నవధాన్యాలు, రేగిపండ్లు, జీడిపండ్లు, చెరకు తుంటెలు కలిపి గొంతెమ్మల చుట్టు పోయాలె. పిండిపూత (ఒక రకం ఆకు), గునుగు పూలు సేకరించి గొబ్బెమ్మలు లేదా గొంతెమ్మలను అలంకరించాలె. అక్కలు ఒక్కరే అన్ని పనులు చేయజాలరు కనుక నావంటి తమ్ములు వెనుక ఉండి అన్ని నేర్చుకోవాలె.
ఊరి రైతుల కుటుంబాల వారు వచ్చి పాలు పొంగించేనాటి గురించి ముందే అడగడము గుర్తుంది. ఇంటి ముందర అంగణములో, తలవాకిలి (ప్రధాన ద్వారం) ఎదురుగ నలుచదరంగ అలికి, పూసి, ముగ్గులు వేసి అలంకారము చేయాలె. లాంఛనముగ నెల నిలవెట్టిన నాడు కొట్టిన పిడకలను అయిదింటిని ముందు తెచ్చి ఆ ముగ్గు మధ్యన పేర్చి ఉంచాలె. అక్కడ గూడ గొంతెమ్మలు, అలంకరాములు పుష్కలంగ ఉంటయి. అక్కడ ఒక అద్దము తెచ్చి ఒక పీట మీద నిలబెట్టేవాళ్లు. అందులో సూర్యుడు ప్రతిబింబిస్తడని అర్థమయేందుకు చాలకాలం పట్టింది. కొత్త గురిగిని పిడకల మీద పెట్టి అందులో పాలుపోసి పొంగించాలె. అవి పొంగిన దిక్కు శుభం జరుగుతుందని నమ్మకము. పాలలో బియ్యము పెసరపప్పు పోసి ఉడికించాలె. ఆ తరువాత చక్కెర, పలుకులు చేర్చాలె. పులుగము అనే పొంగలి ఉడికిన తరువాత సూర్యునికి నైవేద్యము పెట్టాలె. ఆ తరువాత మేమయితే ఆ పొంగలిని ప్రసాదముగ సాపాటు (భోజనం)తో బాటు తీసుకునేవాళ్లము. కొందరు దాన్ని తినరట. పొలాల మీద వెదజల్లుతరట!
మేము తమిళ వైష్ణవులము. తమిళం, పోయింది. సంప్రదాయం, తెలిసినంత వరకు మిగిలింది. నెల, నిలబెట్టినరు అంటే ధనుర్మాసం మొదలయిందని అర్థం. ప్రతి నిత్యం తిరుప్పావైతో సేవాకాలం జరగాలె. పొంగలి నివేదన ఉండాలె. మా యింట్లో ఈ తతంగం జరిగిన గుర్తు లేదు. మామూలుగ నిత్యం వలెనే ఆరాధన జరిగేది. నాన్న తిరుప్పావై చదివేవాడేమో? పదహేనవ నాడు నాయగనై, మరొకనాడు కూడారై అని తియ్యని పొంగలి వండడం గుర్తుంది.
సంక్రాంతి వంటలలో నూగులకు ప్రత్యేకత ఉంది. నూగుల కర్జెకాయలు, సంక్రాంతి స్పెషల్. వాటి రుచే వేరు. నేను కొంతకాలం మరాఠీ కుటుంబాల మధ్యన గడిపే అవకాశం కలిగింది. వారు సంక్రాంతికి నూలు, బెల్లం కలిపి, అందరికి పంచుతరు. తియ్యగ తిని, తియ్యగ మాట్లాడు అని అర్థం వచ్చే మాట ఏదో అంటరు. ఉత్తర హిందుస్తానంలో అంటే దిల్లీలో ఈ నూల తీసి మరింత ముందుకు సాగుతుంది. రువ్వుపిండి, బెల్లం కలిపి గజక్ అనే మిఠాయి తయారుచేస్తరు. రేవడియా అనే పేరుతో రకరకాలుగా నూగుల లడ్డు వంటివి తయారుచేస్తరు. వాటిని నెల మొత్తం వీలయినంత మందికి పంచుతరు. అక్కడ ఈ పండుగను ముఖ్యంగా సిఖ్లు జరపడం గమనించాను. క్రైస్తవులు, ముస్లింలు కూడా పంజాబ్లో ఈ పండుగ జరుపుతరట. లోహ్రీకి ప్రత్యేకంగా పాటలు ఉంటయి. వాటిలో ప్రేమికుల గురించి, పల్లె బతుకు గురించి పాడుతరు.
నవగ్రహాలలోని శనిగ్రహానికి, నూగులకు లంకె ఉంది. అందుకే మన ప్రాంతంలో చాలామంది, నూలు నూగుల ఉండలు ఇస్తమంటే తీసుకోరు. ఇక మూడవ నాటి పండుగ గురించి, వ్యాసంలో రాయకుండా ముగిస్తే అన్యాయం. అందరు దాన్ని కనుమ అంటరు. మా ప్రాంతంలో కరిపండుగ అంటరు. మొదటి రెండునాళ్లు భక్తి. ఇక కరిపండుగ నాడు, ఖీంచ్కాట్ (అంటే మాంసం), మద్యం ఇంటింట నాట్యం చేస్తయి. మేము ఆనాడు ఇంట్లో నుంచి బయటకి రావడానికి భయపడేవాళ్లం. ఏ వీధిలో చూచినా ఉదయాన మేకలు, గొర్రెల వధ, మాంసం పంపకాలు. ఇక ఆ తరువాత ‘మందేమాతరం’ అంటూ జరిగే వీరంగాలు.
నినికి ఇవన్నీ జ్ఞాపకాలలో, అవి కూడా నా వంటి ఛాదస్తుల జ్ఞాపకాలలో మిగిలినట్లున్నయి. నూగుల రొట్టెలు లేక ఎంత కాలమయిందో, నువ్వుల కర్జెకాయలు తినక ఎన్ని ఏండ్లయిందో?

Subscribe to:
Posts (Atom)