Monday, April 27, 2009

Kunalamma Padalu



Or are they Koonalamma Padalu?

Whatever they are, interesting are they for sure?


Arudra was a phenomenon.


Whatever he did, it was with a diffrence and class!

కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ
Bapu's pictures are an added attraction to the words.
Even Arudra says so.
These poems were published in Jyoti Monthly along with the cartoons.
చెరకు రసముల వూట
చిన్మయత్వపు తేట
యోగి వేమన మాట
ఓ కూనలమ్మ
I tried to choose the best from the small book.
I could not.
Every piece is a gem.
People should learn Telugu to read such works.
I have added this entry as an illustration to the earlier entry on poetry.

Sunday, April 26, 2009

Why write?

A poem by William Blake

Piping down the valleys wild,
Piping songs of pleasant glee,
On a cloud I saw a child,
And he laughing said to me:

'Pipe a song about a Lamb!'
So I piped with merry cheer.
'Piper, pipe that song again.'
So I piped: he wept to hear.

'Drop thy pipe, thy happy pipe;
Sing thy songs of happy cheer!'
So I sung the same again,
While he wept with joy to hear.

'Piper, sit thee down and write
In a book, that all may read.'
So he vanished from my sight;
And I plucked a hollow reed,

And I made a rural pen,
And I stained the water clear,
And I wrote my happy songs
Every child may joy to hear.


I am amzed at the idea of the poet.
This is why we write.
Not that we can write!
Only that it may bring joy to someone at some place.
Let the wonderful world of words grow.
Let the children and the child in all the grownups read the words and enjoy.
What can I say about those who cannot enjoy the beauty of the words?
I remember telling a friend that words are feelings in frozen form.
Instead, if we are frozen, who can help us?
I stumbled upon this wonderful poem and brought it for you!!


పాటలెందుకు?
విలియం బ్లేక్

అడవిలో, లోయలో, అందంగా పాడుతూ
ఆనందం పాటలను అందంగా పాడుతూ,
ఆ మబ్బు మీద నేనొక కుర్రవాడిని చూచాను
అతను నవ్వుతూ నాతో అన్నాడూ...

గొర్రె గురించి పాట పాడవూ...
నేనానందంగా ఆ పాట వాయించాను
అన్నా ఆ పాట మళ్లీ పాడవూ...
నేను మళ్లీ వాయించాను. అతను కంట తడి పెట్టాడు

నీ వాద్యం పడెయ్. ఆనంద వాద్యం పడెయ్.
నీ ఆనందం గీతం అందంగా పాడు...
నేను అదే పాట మళ్లా పాడాను
అతను వింటూ ఆనందంగా కన్నీరు కార్చాడు

అన్నా! కూచుని ఆ పాట రాయి.
అందరూ పుస్తకంలో చదువుతారు....
అతను కనుమరుగయ్యాడు
నేనొక బోలుతనాన్ని మీటాను

నేనొక పల్లె కలం చేశాను
శుభ్రమయిన నీట ముంచాను
పిల్లలందరూ విని ఆనందించాలని
ఆనంద గీతాలు రాశాను

Tuesday, April 21, 2009

A page from the diary

16 February 2000
మనిషికి తన స్వంతముగ తెలివని ఉన్నచో, అది ఏదో ఒకనాడు గుర్తింపు పొందక తప్పదు.
ప్రయత్నించి తిరస్కరించవలెననుకున్నవారుగూడ, సరియగు సమయము వచ్చినపుడు, విలువను గుర్తించక తప్పదు. విజయము విలువకేగాను ఇతరములకు గాదు.
విషయ విజ్ఞానము, తర్కించు నైజగుణము, సదసద్వివేకము, స్వార్థరాహిత్యము మున్నగు విశేషములకు ధారణయను మరియొక శక్తి తోడయిన తర్వాత అట్టి మనిషిని ప్రయత్నించియు తోసిరాజనుట సాధ్యముగాదు.

పనిచేయుటయందొక ఆనందమున్నది.
ఆ పనియందు మన ప్రమేయము ప్రభావము ఉండినచో
ఆనందము మరింత ఎక్కువగనుండును.
ప్రమేయ ప్రభావములు ఫలితములనిచ్చినచో ఆనందము తలవరకు వచ్చును.
అప్పుడిక పని మదిర వలె పనిచేసి, మనిషిని మభ్యపెట్టును.
అందుకే అందరును అధికారము కొరకు పాకులాడుచుందురు.
రాణి ఈగ గొప్పది.
పనిచేయు ఈగలకు కృషి తప్ప,
ప్రమేయ ప్రభావముల గురించి ఆలోచించు హక్కుగూడ ఉండదు.
నిర్ణయాధికారము పంచుకొనుటకు ప్రభువులు అంగీకరింపరు.
కేవలము పని మాత్రము చేయువారలకు ఆ భావము బలపడినచో,
పనియందు రుచి తగ్గును.
అప్పుడు వాతావరణము చెడిపోవును.
ఉత్తమ నాయకత్వమన్నచో అది ప్రభుతగా గాక,
బరిలో ముందు నడుచుటయను తీరుండును.
అట్టి నాయకుడు అందరికిని ప్రీతి పాత్రుడగును.

Friday, April 17, 2009

Helena of Viswanatha

Thisis a passage from the novel Helena.

కోసగల కన్ను సహజముగా సుందరమే. దానికి కాటుక పెట్టినప్పుడు మఱియు సుందరము. ఆ కాటుకరేఖ అపాంగము చివరనొక సన్నని శలాకతో సుంత నెమరు కణత వరకు పొడుగించి, తీసినచో నది మఱియు నందముగా నుండును. ఈ కాటుక వట్టి కాటుక కాదు. వట్టి కాటుకయనగా నాముదపు దీపము వెలిగించి, దీపమునకంటకుండ పొగమాత్రము వాఱునట్లు, సుంత యెత్తున నొక నునుపైన పళ్లెమును సమావేశపరచినచో, రెండుమూడు గంటలలో ఈ పొగ యా పళ్లెమునందు నల్లని బిళ్లగా నేర్పడును. అది పొడిపొడిగా నుండును. దానిని తాటియాకుతో లాగి, తగినంత యాముదము కలపి, స్త్రీలు పూర్వము వాడెడువారు. అంజనమనగా నది. మహాధనవంతులైనవారు పొగనిట్లు తీయరు. అత్తరులతో దీపములు వెలిగించి, వెండిపళ్లెముల మీద నీ పొగపారింతురు. దాని మెత్తదనము, దాని సౌకుమార్యము, దాని పరిమళమును ఆముదపు కాటుకకుండునా? మరియు కనురెప్పలకు సుంతయు క్లేశము కలిగించనిదియు, పరమాణు రూపమైనదియు నొక బంగరు తళుకుపొడి, రతనంపుపొడి యీ యత్తరుకాటుకయందు కలుపగా నట్టి కాటుకను ధరించిన కోసగల కంటి సౌభాగ్యమేమని చెప్పవలయును? కొన్ని పదార్థములు తిన్నప్పుడు, కన్నులు కొంచెము మూతవడును. మరి కొన్ని పదార్థములు తిన్నప్పుడు కన్నులు విస్తరించియుండును.

“Eyes with a tapering end are naturally beautiful. If kohl is applied, they are more beautiful. If that kohl line is drawn with a fine pin till the edge of the temple, it will be much more beautiful. This kohl is not an ordinary one. Ordinary kohl is made with a lamp of castor oil. A smooth plate is held above the flame so that it does not touch the flame itself. In two or three hours the smoke will settle as a black tablet on the plate. That would be dry. Pulling it away with a Palmyra leaf, adding enough castor oil, women of yore were using it as kohl. That is Kajal or Anjanam. Really rich people do not collect smoke in this way. Lighting the lamp with scented materials, they would collect the suit on silver salvers. Would the fineness, delicacy and scent be there in kohl made with castor oil? Moreover, a fine powder of golden mist, and of diamonds, that will in no way disturb the eyes, mixed to it, and applied, do we have words to describe the eyes adorned with it? After eating certain kinds of food, eyes are slightly shut. When eaten certain other foods, the eyes are wide open.”


My comments:
Viswanatha Stayanarayana was a multifaceted genius. There was nothing on which he did not write. In one of those novels he goes away from the story to describe the preparation of a curry with brinjal. A man, being good at cooking, is nothing unusual. Viawanatha was one such, perhaps. He must have been real problem for people who cooked at his place. Men who are good at cooking are very critical of what they eat.

When I was a student at Warangal, there was a Ramayana festival. Viswanatha was invited as the chief speaker. There was to be a Carnatic music concert after the session. Knowing this he went on speaking about music at length. I was awestruck with the nuances he was aware of. The singer on that day was not exactly an extraordinary scholar. He was just a good singer. I really do not know with what kind of feelings Viswanatha went home that day.

The next day there was a poets gathering. There were some good poets lined up for the recitations. A young man made himself like Cinare with the hairstyle and Dhoti etc., and asked permission of Viswanatha, who was in the chair to allow him to recite poems of his own. All could listen to the reply that the young man got. He was asked to come the next day when there would be a gathering of females. He was such a blunt man.

I read so much of him and never was I let down. As he tells, his works will give new understanding with every reading. The series of novels he wrote under the heading of Purana Vaira Granthamala is fiction written to prove some facts. He thinks that westerners have meddled with the history of our country. To prove this fact, he has traced the history based on references from old scriptures etc., and wrote a series of novels with the correct series of kings and their kingdoms. However, it is not to my understanding why he added fiction to the format and not picked up some academic process to prove his point.

That is not the subject of this posting, anyway. In Helena,the 10th of the 12 novels, he starts with the description of the protagonist, Helena, daughter of Selucus, the king. As a part of the exercise, here he describes Kohl, the unguent used to beautify the eyes. He knew Kajal is made.
He explains the process with details. In the later pages of the novel, his ideas expressed about female beauty and aesthetics are worth reading.

A genius is a genius.
Here goes another piece about beauty and being able to discern it!

సహజమైన సౌందర్యము ముఖ నేత్ర నాసిక కపోల ఫాల శ్రవణాదుల నాశ్రయించి మొగమునందుండును. ఇవి, చేసికొనిన యలంకారములచేత నధికముగా భాసించును. కపోలములయొక్క పుష్టియు, నేత్రవైశాల్యము, తృష్ణత నైగనిగ్యము, సౌందర్యమునధికముగా బోషించును. కాని పురుషులు, నైగనిగ్య భూషణ లేపనాదుల చేతగలిగిన సౌందర్యమును సౌందర్యమనుకొందురు. నేత్రకపోలనాసికా రమణీయాధర సన్నివేశముల చారుత్వమును జూచుటకు పురుషునియందొక విధమైన యధికమైన భావుకదృష్టి యుండవలయును. ఒక్కొక్కప్పుడు స్త్రీ చిక్కిపోయి, దాని మొగము మిక్కిలి యందముగా కనిపించును. అనగా నామె లోచన కపోల నాసికాదులయొక్క సన్నివేశ లక్షణము సహజ సుందరమని అర్థము. అవి పుష్టములైయున్నప్పుడు వాని సౌందర్యమును దెలిసికొనెడి తెలివి యా పురుషునియందు లేదు.అది తెలిసికొనుటకు వీడు వట్టి పురుషుడేకాదు, భోగపరాయణుడు, బహుస్త్రీ ముఖగత సౌందర్య పర్యాలోచనా వివేచనా బుద్ధి కూడ కావలయును.

Aesthetics is an interesting subject.
The master has proved himself to be a discerning aesthete with this description and understanding.
Are you with him?

Saturday, April 11, 2009

Rumi Poem

At the twilight, a moon appeared in the sky;
Then it landed on earth to look at me.
Like a hawk stealing a bird at the time of prey;
That moon stole me and rushed back into the sky.
I looked at myself, I did not see me anymore;
For in that moon, my body turned as fine as soul.
The nine spheres disappeared in that moon;
The ship of my existence drowned in that sea.

అసుర సంధ్య వేళలో ఆకాశంలో ఒక సూర్యుడు అగుపించాడు
అప్పుడతను నన్ను చూడడానికి భూమి మీదకు వచ్చాడు
వేటలో గద్ద పక్షినెత్తుకు పోయినట్టు
ఆ చంద్రుడు నన్నెత్తుకుని ఆకాశంలోకి తిరిగి వెళ్లాడు
నన్ను నేను చూచుకుంటే, నాకు నేనే కనిపించలేదు
ఆ చంద్రునిలో నా శరీరం, ఆత్మంత చిన్నదయ్యింది మరి
తొమ్మిది గోళాలూ చంద్రునిలో మాయమయ్యాయి.
నా అస్తిత్వమనే పడవ ఆ సముద్రంలో మునిగిపోయింది.

In an earlier post, you have seen love poems of Maulana Jalaluddin Rumi.
If you have not, nothing is lost.
You can always enjoy them here in Lokabhiramam.
Now, here is an astounding poem of Rumi, one which is totally different from the earlier ones.
Such philosophical works are rare.
If you have understood it, or you know someone who can make a commentary on such poems, I would welcome here.
Rumi has made some discourses which are known throughout the world.
I really do not know how many of us are aware of such works.
I will try to bring some of his works here.

Monday, April 6, 2009

Yaadi (యాది) by Sri Samala sadasiva of Adilabad


The following is an excerpt from one of the article Sri Sadasiva wrote for the Telugu daily Varta.
He has written about many people and many things. His erudition peeps in between lines in every piece therein. The selections of articles are printed in a book “Yadi” which means memoirs. The Yaden of such people are tutorials in many aspects of life including simple and sweet prose.

If I claim that Sri Sadasiva is a friend, it will not be an exaggeration. He saw that the book is delivered to me through a friend, who is another great man.

People interested in Telugu and culture should be reading and listening to such people. There are not many like him. If we do not take advantage of their presence, we will be the losers.
Recently, I received an invitation from a group felicitating some people on Ramanavami day. Sadasiva’s name also is found there at the end of the list. He is described as a music critic. Those people have only seen a part of his personality. Such people deserve to be studied over months and years. Only then, we will know what they are! I call him a polyglot. He knows so much. Did such extraordinary things! And is silently living in a place, where there are not even a few people who understand his wisdom.

I had the good fortune of interacting with him in a limited way!

I asked him recently “How is it that you found only good people everywhere and no bad people anywhere?” He coolly said, “I have not taken cognisance of the other kind of people.”
Can you find such people around?

Sri Viswanatha Satyanarayana visited Kaloji brothers at Warangal.

This is incident during that visit.

Sri Sadasiva heard it from Sri Kaloji Narayana Rao and wrote it in his column.

Incredible people and incredible incidents!!

విశ్వనాథవారు కాళోజీల ఇంట వున్నప్పుడు తమ గురువుగారి కవిత విశ్వనాథకు వినిపించాలనుకున్నారట కాళోజీ ప్రముఖులు. గార్లపాటి (రాఘవరెడ్డి) వారికి అది ఇష్టమో కాదో. శిష్యుల కోరిక మన్నించారు. విశ్వనాథవారి అభిమానులో, అయినవాళ్లో, కానివాళ్లో వారిగురించి పనిగట్టుకుని ఎన్ని కథలు ప్రచారం చేసే వాళ్లంటే, అవి విన్నవాళ్లకు వారిని చూడాలనిపించేది కాదు. ‘అతనితో మనకెందుకులే’ అనిపించేది. కాళోజీల యింట (మాటి మాటికి ఇలా అనేకంటే రామాబాయమ్మ గారి యింట అనడం బాగుంటుంది. ఆమె అందరికీ అన్నదాత్రి) విశ్వనాథవారు భోజనంచేసి, తాంబూలచర్వణం చేస్తూ, పరిచిన మంచంలో పడుకున్నారు. కొంచెం ఎడంగా ఉన్న నులక మంచం మీద రాఘవరెడ్డిగారు పద్యాల కాగితాలు పట్టుకుని కూర్చున్నారు. ‘అయ్యా! మాగురువుగారి పద్యాలు చిత్తగించండి’ అని విన్నవించుకున్నారు శిష్యులు. ‘చదవమనండి’ అని గోడవైపు తిరిగి పడుకున్నారు విశ్వనాథవారు. ‘ఈ తెలంగాణా రెడ్డిగారి పద్యాలు నేను వినదగినవా’ అనుకున్నారా? రాఘవరెడ్డిగారు తమ పద్యాలు వినిపిస్తున్నారు. ఎవరు వింటున్నారో ఎవరు వినటంలేదో వారికి అనవసరం. విశ్వనాథవారు ఎటు తిరిగి వింటున్నారనేది కూడా వారికి అనవసరమే. తమ పద్యాల మీద వారికి నమ్మకం. ధారారమ్యమైన భావబంధురమైన పద్యాలు. కొన్ని పద్యాలు విన్నతర్వాత, అటు తిరిగి పడుకున్న విశ్వనాథవారు ఇటు తిరిగి పడుకొని కవిని చూస్తూ పద్యాలు వింటున్నారు. మరికొన్ని పద్యాలు వినగానే మంచంలో కూర్చుండి వింటున్నారు. ఇంకా కొన్ని పద్యాలు విన్న తర్వాత, మంచం దిగి, రెడ్డిగారు కూర్చున్న నులక మంచంకోడును పట్టుకుని, నేలమీదనే కూర్చుండి వింటున్నారు. మరిన్ని పద్యాలు విని లేచి, రెడ్డిగారిని గట్టిగా కౌగిలించుకుని ‘రెడ్డిగారూ! మీరు మహాకవులు! మీ పద్యాలు నన్ను కదిలించాయి!’ అని అభనందించారు విశ్వనాథవారు. వారి కళ్లలో ఆనందాశ్రువులు. అక్కడున్న వారందరి కళ్లలోనూ ఆనందాశ్రువులే.

కాళోజీ సోదరులు మాటల్లో చిత్రించిన ఈ దృశ్యం, రెడ్డిగారెంతటి కవులో, విశ్వనాథవారెంతటి సహృదయులో తెలియజేస్తున్నదికదా

పోతన చరిత్ర రచించి, అభినవ పోతనగా కీర్తింపబడిన వానమామలై వరదాచార్యులవారు నాతో చెప్పిన ఒక ముచ్చట చెప్పి ముగిస్తాను. ఆచార్యులవారి పద్యాలు ఎంత రసరమ్యమైనవో, వారు తమ పద్యాలనెంత కమ్మగా గానం చేసేవారో, చదివిన వాళ్లకు, విన్నవాళ్లకు తెలుసు. కాళోజీల వలెనే వారుకూడా మొదట్లో మడికొండ వాస్తవ్యులు. మొదట్లో వారు మణిమాల అనే చిన్న పద్యకావ్యాన్ని రచించి దాన్ని అచ్చువేయించే మార్గాలు అన్వేషిస్తున్నారట. అప్పట్లోనే సాహిత్య ప్రియులైన వరంగల్లు పురప్రముఖులు కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించాలని తలపెట్టినారట. ఘనంగా అంటే శాలువా, నూత్న వస్త్రాలు, అయిదువేల రూపాయిల నగదు. ఆ కాలంలో అయిదు వేలంటే పెద్ద మొత్తమే. సన్మానానికి కొన్ని గంటలు ముందు వానమామలవారు విశ్వనాథవారికి మణిమాలలోని కొన్ని పద్యాలు వినిపించినారట. రామాబాయమ్మవారింటనే కావచ్చు. విశ్వనాథవారు శ్రద్ధగా విన్నారట కాని తమ అభిప్రాయం తెలుపలేదట. మెచ్చుకున్నట్లా? మెచ్చుకోనట్లా? వారు మెచ్చుకోకపోయినా వానమామలవారి పద్యాల వన్నెతగ్గదు. బాగున్నయి అనైననా అనాలెగదా. అదీ అనలేదట. సాయంకాలం సన్మానసభ. వరంగల్లు విద్వాంసులు, పురప్రముఖులు విశ్వనాథవారి సమున్నత సాహితీ వ్యక్తిత్వాన్ని బహుధా ప్రశంసించినారట. ఇక సన్మాన కార్యక్రమం. వారిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, శాలువా కప్పి, ఐదువేల పర్సును సమర్పించబోతుండగా, “ఆగండి!” అన్నారట విశ్వనాథ. శ్రోతల్లో కూర్చున్న ఆచార్యులవారిని వేదికపైకి ఆహ్వానించి, ‘ఇతడు శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు. ఇతని కవిత విన్నాను. ఇతను పద్యం హృద్యమయింది. రమణీయమైంది. ఇతని మణిమాల కావ్యం ముద్రణకు నోచుకోలేదు. మీ ఊరి కవిని సన్మానించుకోక ముందే, నాకీ సన్మానమెందుకు చేస్తున్నారు? ఈ డబ్బుతో ఇతని కావ్యాన్ని ముద్రింపజేయండి. అది నా సన్మానమే అని సంతోషిస్తాను’ అన్నారట. ‘అయ్యా వారు మావారే. వారి కావ్యాన్ని త్వరలోనే అచ్చువేయించి, మీకొక కాపీ పంపిస్తాము. ఈ డబ్బు మీరు స్వీకరించండి’ అని ఎన్నో విధాల బతిమాలిన తర్వాత విశ్వనాథవారు స్వీకరించినారట. ఈ ముచ్చట నాకు వానమామలవారే చెప్పినారు.

ఇట్లాంటివారు విశ్వనాథవారు.