Friday, October 10, 2008

08 02 2000 A page from the diary

A page from the diary.
Over the years you grow up.
You realise that many things that you have done were senseless.
Can you correct yourself?
I did in this entry.

పని చేస్తున్నట్టు బిజీగా కనిపించాలంటే ఏంచేయాలి?
బిజీగా పనిచేయాలి!
నాకు తెలిసింది అంతవరకే!
కొందరు ఏంచేయకుండానే బిజీగా కనిపించే కళను అలవరుచుకుంటారు.
వారు సుఖంగా బతుకుతున్నామనుకుంటారు.
అయితే పనిచేయడంలో గల సుఖం, బహుశః వారికి ఈ జన్మలో అనుభవంలోకి రాదు.

కళ్లజోడుండాలి. కాళ్లుచేతులు స్వాధీనంలో ఉండాలి. ఆలోచనలు అదుపులో ఉండాలి. దాన్ని కుదురు అంటారు.
ఆ కుదురు కుదరకపోతే ఈ రాత కుదరదు!
కుదురు అనే ఒక వ్యావసాయిక వస్తువిశేషం ఉండేదని ఎంతమందికి తెలుసు?
వడ్లు రోట్లో పోసి దంచుతుంటే ఎగురుతయి. అవి చిందకుండా, ఒక ఫనల్ వంచి కర్ర కంట్రాప్షన్ ఉంటుంది.
అదే కుదురు. అది కుదురుగా ఉండి వడ్లను కుదురుగా ఉంచుతుంది.
అట్లాంటిదే, లోహంతో తయారు చేసిన వస్తువు కూడా ఒకటి ఉండేది. దాన్ని కుందెన అంటారని గుర్తు.
అది బొక్కెనకు తమ్ముడు!
ఇటువంటి మాటలు, ఆ వాతావరణం, ఆ పద్దతులు గ్రంధస్థం చెయ్యకపోతే మాయమయి పోతయి.
నేనేమో భాషా పరిశోధకుణ్ని కాదు.
నిజమయిన పరిశోధకులకు ఎందుకో ఇంత దూరం రావాలనిపించదు.
చేసిన వారు అర్ధంతరంగా వదిలేశారు.
రాతలో కుదురు లేదని నాకే అర్థమవుతున్నది!!

ఆలోచనలు కోకొల్లలుగా అన్ని దిశలనుంచి వస్తుంటే, దేనికని రియాక్ట్ కావాలో అర్థంకాదు.
ఎవరు కనిపిస్తే వారితో నడవాలని, దేన్ని గురించి చదివినా మనమూ అటువంటి పని చేయాలని అనిపించడానికి ఈ బహుముఖ రుచి కారణం.
అన్నింటా పనికిరాకుండా పోతున్నామని వ్యధ!

1 comment:

  1. అన్నింటా పనికిరాకుండా పోతున్నామంటారా? ఎంత వయసొచ్చినా ఈ గందరగోళం పోయేది కాదన్నమాట. ఏదో ఒక దాన్ని కాస్త కుదురుగా పట్టుకుని నడిచే ప్రయత్నం చేయగలిగితే గొప్పేనేమో ఈ జన్మకు. :-)

    ReplyDelete