I really wonder how many people have read it and remember the simple story that made a flimsy plot for the small book. I found this book in one of the pavement stalls selling old books. I read it again after a few decades, and in one spell. No wonder, the book is so small and interesting in very disproportional manner. I bring you a few lines from the same.
సుందర్రావుకిదేమీ అంతు బట్టలేదు. అనుమానంతో మెడ టకటకా ఎడాపెడా తిప్పేసి ఇద్దర్నీ చూస్తూ ఇద్దరి మాటలూ వింటున్నాడు టెన్నిస్ ప్రేక్షకుడిలా.
“వెధవ” అన్నాడు వీర్రాజు
“చవట” అన్నాడు రామారావు పుంజుకుని --- సుందరం వంక చూస్తూ.
“రౌడీ”
“రాస్కెల్”
“గూస్”
“గాండర్”
“హార్స్”
“మేర్”
“మాన్”
“ఉమన్”
“బోయ్”
“గరల్”
“ఉరేయ్ రాజూ! ఆగు! మనం గ్రామర్ చదివేస్తున్నాం!”
“ఏమటిదంతా. మిమ్మల్ని గుడి గోపురం మీదకి విసిరేస్తా” అన్నాడు సుందరం.
“దుర్మార్గుడు” అన్నాడు వీర్రాజు
“దుర్జనుడు” అన్నాడు రామారావు
“దుష్టుడు”
“దుర్మతి”
తరువాత ఇద్దరికీ తెలుగు మాటలు జ్ఞాపకం రాలేదు.
“ఆ!... ఖలుడు” అన్నాడు వీర్రాజు
“మరే--- ఖలుడు” అన్నాడు రామారావు
“ఒరేయ్ రాముడూ--- నీకు ఖలుడు పద్యం వచ్చురా?”
“ఏ ఖలుడురా?”
“అదే---- ఖలునకు నిలువెల్ల విషము...”
“అదా---- మొదలు జ్ఞాపకం లేదు. ‘సుమతీ’ అని చివర్నొస్తుంది.”
సుందరానికి జ్ఞాపకం ఉంది. కానీ చెప్పలేదు.
వీర్రాజుకి కొంచెం జ్ఞాపకం వచ్చింది. “తలనుండు విషము ఫణికిని వెలయంగా డడ్డ డడడ డడడా నానా చివరని ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ---- గదరా రావుడూ?” అన్నాడు.
“మరే! నిలువెల్ల విషము.”
“ఖలుడెంత పవర్ ఫుల్లో తెలుసా? ఆ మధ్య ఓ ఖలుణ్ణి ఒక తేలు, ఖలుడన్న సంగతి తెలీక కుట్టిందట. --- అంతే ---ఖలునకు నిలువెల్ల విషము గదూ. ఠారున చచ్చింది. అలాగే ఓ పాము. ఇంకా అలాగే నల్లులు, దోమలు...”
“వీర్రాజూ! జ్ఞాపకం ఉంచుకోరోయ్! సినిమా హాలులో నల్లులు సమృద్ధిగా ఉండడం లేదు ఈ మధ్య. మ్యాటినీకి వదిలిన నల్లులు ఆరు గంట్లాటకల్లా ఛస్తున్నాయట. ఎందుకో తెలీక ఇన్నాళ్లూ గిలగిల్లాడా. ఈ పాడు పన్లు చేసేవాళ్లూ, కొంపలు తీసేవాళ్లూ, బ్లాక్ మార్కెట్ చేసేవాళ్లూ, మతి స్థిమితంకోసం అని అస్తమాలూ సినిమాలకెళుతున్నారు. ఆ నల్లులు తెలీక వాళ్లను కుట్టి, అమాంతం ఛస్తున్నాయి. విల్లేనా రాయకుండా.”
“అలాగే,----- రిసెర్చ్ బుక్కులో రాసుకుందిగానిలే. ఒరేయ్ రాముడూ, దోమల గురించి కూడా ఒక పుస్తకం రాయరా. బంగారయ్యగారింటి దగ్గర ఇప్పుడు కాగడా వేసి వెదికినా దోమల్లేవుట. నీలాటి రేవులోనూ, రచ్చబండ దగ్గరా ఇదే చెప్పుకు విస్తుపోతున్నారు, ఆబాలగోపాలం. దోమలు ఎందుకు లేవు తెలుసా. వీడు --- ఈ ఖలుడు అయిన సుందరం గాడు అక్కడ పడుకుంటున్నాడుగా. అమాయకపు దోమలు ముందు వెనుకా చూసుకోకుండా గొర్రెల మంద గోతిలో దూకినట్లు, వీడి మీద పడి కుట్టేశాయి. ఠారున మరణించాయి.”
“హయ్యబాబోయ్!” అన్నాడు రామారావు.
Bapu and Ramana are the two persons that all Telugu people should feel proud of. When they were not really involved in making films and concentrated only on making us laugh, we were much better!
This is a page from the inimitable book, “Iddarammayiloo, Muggurabbayiloo” by Mullapoodi Venkata Ramana garu. This is a small book written with only one intention, that is to make the readers laugh. I really wonder what happened to the humour that used to overflow from the Telugu magazines and books. Come Deepavali and every magazine worth the name would come up with special issues. Even Chandamama used to bring out an excellent special with fragrance added to the printing ink.
Mullapoodi and Bapu were the perennial sources of Telugu humour. You can call it slapstick or something else, pure humour just for the sake of a few laughs!!
Shree Gopalam Karamchedu
ReplyDeleteI have just visited your blogs, and have read some of your writing, the English translation of course. I liked your efforts in putting our Indian literature before the whole world. I salute you for the same.
If you are interested in reading the short stories and humorous articles , then a visit to my blog would be a good idea.
Naval Langa
Dear Navalji,
ReplyDeletePlease also visit my webpages at http://vijagopalk.tripod.com for more translations from Telugu.
I will sure visit your collection.
Thanks.
Gopalam Karamchedu
Vijayagopalji,
ReplyDeleteGreat Work. It is an excellent effort by you to bring the great Telugu Writers to the knowledge of Non Telugu People.
Please keep it up
excellent
ReplyDelete