Monday, October 6, 2008

07 02 2000 A page from the diary

A page from the diary is an honest title. I have written my diaries exactly in this style for a long time. When I saw an old diary, I felt , I can share the ideas with the world. Here comes the series.

మనసు!

మనసు స్వాధీనమైన నరునకు మరి మంత్రతంత్రములేలా అన్నాడు త్యాగబ్రహ్మము!
మనసు స్వాధీనమవడమంటే మాటలా?
అదంతా సులభంగా వీలుపడే పనే అయితే, ‘స్వామీ స్వామీ... ఈ మారేమీ..’ అన్నపాట ఎందుకు పుడుతుంది?
‘నేను నిలిపిన చూపు నిలవక అకటా నీపై ముసిరెనే!’ అందిగదా ఆ అమ్మడు.
ప్రపంచంలో మనిషికి ఎన్నెన్నో ఆకర్షణలు?
ఎన్నెన్ని బలహీనతలు?
వాటిని అధిగమించగలగడం యోగం!
శతృవుకు మన సందేశం అందాలంటే, దాన్ని కనీసం వాని మిత్రునికి అందజేయాలి.
అదే చేశానేమో!
సంగీతం కోసం సుబ్రహ్మణ్యాలయానికి మళ్లీ వెళ్లాను.
మామిడిపూడి కృష్ణమూర్తిగారు, ఆనందంగారు కనిపించారు.
నేనువారిని ఎరిగి ఉండడం ఒకటయితే, వారు నన్ను పలకరించడం మరో ఎత్తు.
అదొక సంతృప్తి!
అంటే మనసు స్వాధీనం కాలేదనే!
అంతటితో ఆగకుండా, స్వోత్కర్షకు దిగేవాడు ఒకడు నాకు ఈ సంగీత సాంగత్యంలో తారస పడతాడు.
కళాకారుడు మా యింట్లో దిగాడు, అని చెప్పుకోవడం అతనికొక గొప్ప!
నాకది గొప్పగా కనిపించడం మానేసి కొన్నాళ్లయింది.
అసలు నాకేదీ గొప్పగా కనిపించడం లేదు.
శేఖరునికి నేను చెప్పిన పథకం అంతగా రుచించలేదులాగుంది.
వాడు ధనపతి, నేను విద్యాపతిని. సరస్వతికి లక్ష్మిదేవికి చుక్కెదురుగదా
వాడితో కలిసి నేను ముందుకు సాగగలనా అని అనుమానం కలుగుతుంది.
ఎవడూ కూడదంటే కుదరదు.
ఒకడినయినా నమ్మాలి!

No comments:

Post a Comment