Saturday, November 7, 2009

A page from the diary

I wrote these lines on the 31st Oct, 1999


ప్రవాహంలో నిలబడ్డవాని కాళ్ల చుట్టూ నీళ్లు కదులుతుంటాయి.

కాళ్ల క్రింద ఇసుక కదిలినట్లే ఉంటుంది. కాళ్లు కూడా కదిలినట్లే ఉంటుంది.

కదిలేది కాళ్ల కింద ఇసుక మాత్రమే.

అది కూడా ఉన్నది పోతుంది, అంతేకానీ కొత్తది వచ్చి చేరదు.

ఆ రకంగా కాళ్లు అంతంతకూ లోతుకు దిగుతుంటాయి.

ముక్కు మునిగే లోపల గట్టి నేల తగిలితే సరి!

లేకుంటే, ప్రవాహంలో ప్రవాహంగా, నీటిలో నీరుగా, మట్టిలో మట్టిగా, వాయువుల్లో వాయువుగా

మిగులుతాయి అ కాళ్లు!

ఇంతకూ కదిలేది నీళ్లా? కాళ్లా?

అసలింతకూ ఆ నీళ్లు ఎందుకు కదులుతున్నాయి.



అవి ఒకచోట ఉండలేవు గనుక!

వర్షం చినుకులు వరదలయి, వాగులయి, నదులయి, సముద్రాలయి, మరోసారి మేఘాలు కావాలి.

మళ్లీ వర్షం చినుకులు కావాలి!

అదో ప్రవాహం!

అదో చక్రం!

ఆగడానికి వీలులేని ప్రవాహం!


దానికి నీవు పేరు పెట్టి, అందులో దిగి నిలబడతానంటే అర్థముందా?


నదంటే ఏమిటి?

నిన్నటి నీటిచుక్కా?

నేటి ప్రవాహమా?

ఆ నీరా?

ఆ గట్లా?

ఆ ప్రదేశమా

ఏది నది?

నీరే నదయితే, నీరు లేనప్పుడు దాని పేరేమిటి?

ఈనీరు, ఇవాళటి ఇప్పటి ఈ నీరు, రేపటికల్లా మరోచోట మరోపేరు!

మరుసటినాడు సముద్రంలో పేరేలేదు.

గట్లనూ మట్టినీ నది అనడానికి అవి కదలవే!

మేఘాన్ని నది అందామా?

సముద్రాన్ని నది అందామా?

మాటలను కలగలిపి గజిబిజి చేసేకన్నా, మనం ఆ నీటిలో దిగకుండా ఊరుకుందామా?


ఇంతకూ నీవెవరు?

అబ్బాయివా?

అబ్బాయిగారి నాన్నగారివా?

అవిడగారి మొగుడివా?

అయనగారి అల్లుడివా?

నీవు వీవే! నీటి చుక్కవు!!

ఎక్కడుంటే అదేపేరు!!           

నదికి పేరేమిటి?

నీకు పేరేమిటి?


Roughly this is what I meant!!


For the one, standing in a stream, the water around the legs will be moving.

It feels like the sand under the feet is moving.

Even the legs feel movement.

What moves is the sand under the feet.

Even in that what is there goes out.

New sand does not come there.

Thus feet get moving deeper and deeper.

If you hit the hard bottom before the nose is in the water, it would be good.

Otherwise those feet would remain as a stream in the stream, water in the water, earth in the earth and air in the air!

On the whole what is moving?

Is it the water or the feet?  

Why is the water moving after all?

Because it cannot stay at one place.

 It has to turn as a drop of rain, and then a stream, a rivulet, a river, an ocean and again a cloud. Then it has to turn into a drop of rain once again. !

It is a flow.

It is a cycle.

That cannot be stopped.

Would it mean anything, if you want to give it a name and get into it?

What after all is a river?

 Is it yesterday’s water drop?

 Or today’s stream?

 Is it that water?

Those banks?  

That area?

Where is the river?

If water is the river, what do you call it when there is no water?

This water, that belongs to this day and this moment,

by tomorrow in another place and  another name!

Next day in the ocean without a name.

If you want to call the banks and the soil the river, they don’t move after all.

Shall we call the cloud a river?

Shall we call the ocean a river?

Instead of confusing by word jugglery, shall we desist from getting into it?


Who are you after all?

Are you a boy?

Or his father?

Or her husband?

Or his son – in – law?

You are after all YOU!! A drop of water!!

Name according to the place!!

Why name a river?

Why name you?


I swear! This is not poetry!!

No comments:

Post a Comment