Monday, April 6, 2009

Yaadi (యాది) by Sri Samala sadasiva of Adilabad


The following is an excerpt from one of the article Sri Sadasiva wrote for the Telugu daily Varta.
He has written about many people and many things. His erudition peeps in between lines in every piece therein. The selections of articles are printed in a book “Yadi” which means memoirs. The Yaden of such people are tutorials in many aspects of life including simple and sweet prose.

If I claim that Sri Sadasiva is a friend, it will not be an exaggeration. He saw that the book is delivered to me through a friend, who is another great man.

People interested in Telugu and culture should be reading and listening to such people. There are not many like him. If we do not take advantage of their presence, we will be the losers.
Recently, I received an invitation from a group felicitating some people on Ramanavami day. Sadasiva’s name also is found there at the end of the list. He is described as a music critic. Those people have only seen a part of his personality. Such people deserve to be studied over months and years. Only then, we will know what they are! I call him a polyglot. He knows so much. Did such extraordinary things! And is silently living in a place, where there are not even a few people who understand his wisdom.

I had the good fortune of interacting with him in a limited way!

I asked him recently “How is it that you found only good people everywhere and no bad people anywhere?” He coolly said, “I have not taken cognisance of the other kind of people.”
Can you find such people around?

Sri Viswanatha Satyanarayana visited Kaloji brothers at Warangal.

This is incident during that visit.

Sri Sadasiva heard it from Sri Kaloji Narayana Rao and wrote it in his column.

Incredible people and incredible incidents!!

విశ్వనాథవారు కాళోజీల ఇంట వున్నప్పుడు తమ గురువుగారి కవిత విశ్వనాథకు వినిపించాలనుకున్నారట కాళోజీ ప్రముఖులు. గార్లపాటి (రాఘవరెడ్డి) వారికి అది ఇష్టమో కాదో. శిష్యుల కోరిక మన్నించారు. విశ్వనాథవారి అభిమానులో, అయినవాళ్లో, కానివాళ్లో వారిగురించి పనిగట్టుకుని ఎన్ని కథలు ప్రచారం చేసే వాళ్లంటే, అవి విన్నవాళ్లకు వారిని చూడాలనిపించేది కాదు. ‘అతనితో మనకెందుకులే’ అనిపించేది. కాళోజీల యింట (మాటి మాటికి ఇలా అనేకంటే రామాబాయమ్మ గారి యింట అనడం బాగుంటుంది. ఆమె అందరికీ అన్నదాత్రి) విశ్వనాథవారు భోజనంచేసి, తాంబూలచర్వణం చేస్తూ, పరిచిన మంచంలో పడుకున్నారు. కొంచెం ఎడంగా ఉన్న నులక మంచం మీద రాఘవరెడ్డిగారు పద్యాల కాగితాలు పట్టుకుని కూర్చున్నారు. ‘అయ్యా! మాగురువుగారి పద్యాలు చిత్తగించండి’ అని విన్నవించుకున్నారు శిష్యులు. ‘చదవమనండి’ అని గోడవైపు తిరిగి పడుకున్నారు విశ్వనాథవారు. ‘ఈ తెలంగాణా రెడ్డిగారి పద్యాలు నేను వినదగినవా’ అనుకున్నారా? రాఘవరెడ్డిగారు తమ పద్యాలు వినిపిస్తున్నారు. ఎవరు వింటున్నారో ఎవరు వినటంలేదో వారికి అనవసరం. విశ్వనాథవారు ఎటు తిరిగి వింటున్నారనేది కూడా వారికి అనవసరమే. తమ పద్యాల మీద వారికి నమ్మకం. ధారారమ్యమైన భావబంధురమైన పద్యాలు. కొన్ని పద్యాలు విన్నతర్వాత, అటు తిరిగి పడుకున్న విశ్వనాథవారు ఇటు తిరిగి పడుకొని కవిని చూస్తూ పద్యాలు వింటున్నారు. మరికొన్ని పద్యాలు వినగానే మంచంలో కూర్చుండి వింటున్నారు. ఇంకా కొన్ని పద్యాలు విన్న తర్వాత, మంచం దిగి, రెడ్డిగారు కూర్చున్న నులక మంచంకోడును పట్టుకుని, నేలమీదనే కూర్చుండి వింటున్నారు. మరిన్ని పద్యాలు విని లేచి, రెడ్డిగారిని గట్టిగా కౌగిలించుకుని ‘రెడ్డిగారూ! మీరు మహాకవులు! మీ పద్యాలు నన్ను కదిలించాయి!’ అని అభనందించారు విశ్వనాథవారు. వారి కళ్లలో ఆనందాశ్రువులు. అక్కడున్న వారందరి కళ్లలోనూ ఆనందాశ్రువులే.

కాళోజీ సోదరులు మాటల్లో చిత్రించిన ఈ దృశ్యం, రెడ్డిగారెంతటి కవులో, విశ్వనాథవారెంతటి సహృదయులో తెలియజేస్తున్నదికదా

పోతన చరిత్ర రచించి, అభినవ పోతనగా కీర్తింపబడిన వానమామలై వరదాచార్యులవారు నాతో చెప్పిన ఒక ముచ్చట చెప్పి ముగిస్తాను. ఆచార్యులవారి పద్యాలు ఎంత రసరమ్యమైనవో, వారు తమ పద్యాలనెంత కమ్మగా గానం చేసేవారో, చదివిన వాళ్లకు, విన్నవాళ్లకు తెలుసు. కాళోజీల వలెనే వారుకూడా మొదట్లో మడికొండ వాస్తవ్యులు. మొదట్లో వారు మణిమాల అనే చిన్న పద్యకావ్యాన్ని రచించి దాన్ని అచ్చువేయించే మార్గాలు అన్వేషిస్తున్నారట. అప్పట్లోనే సాహిత్య ప్రియులైన వరంగల్లు పురప్రముఖులు కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించాలని తలపెట్టినారట. ఘనంగా అంటే శాలువా, నూత్న వస్త్రాలు, అయిదువేల రూపాయిల నగదు. ఆ కాలంలో అయిదు వేలంటే పెద్ద మొత్తమే. సన్మానానికి కొన్ని గంటలు ముందు వానమామలవారు విశ్వనాథవారికి మణిమాలలోని కొన్ని పద్యాలు వినిపించినారట. రామాబాయమ్మవారింటనే కావచ్చు. విశ్వనాథవారు శ్రద్ధగా విన్నారట కాని తమ అభిప్రాయం తెలుపలేదట. మెచ్చుకున్నట్లా? మెచ్చుకోనట్లా? వారు మెచ్చుకోకపోయినా వానమామలవారి పద్యాల వన్నెతగ్గదు. బాగున్నయి అనైననా అనాలెగదా. అదీ అనలేదట. సాయంకాలం సన్మానసభ. వరంగల్లు విద్వాంసులు, పురప్రముఖులు విశ్వనాథవారి సమున్నత సాహితీ వ్యక్తిత్వాన్ని బహుధా ప్రశంసించినారట. ఇక సన్మాన కార్యక్రమం. వారిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, శాలువా కప్పి, ఐదువేల పర్సును సమర్పించబోతుండగా, “ఆగండి!” అన్నారట విశ్వనాథ. శ్రోతల్లో కూర్చున్న ఆచార్యులవారిని వేదికపైకి ఆహ్వానించి, ‘ఇతడు శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు. ఇతని కవిత విన్నాను. ఇతను పద్యం హృద్యమయింది. రమణీయమైంది. ఇతని మణిమాల కావ్యం ముద్రణకు నోచుకోలేదు. మీ ఊరి కవిని సన్మానించుకోక ముందే, నాకీ సన్మానమెందుకు చేస్తున్నారు? ఈ డబ్బుతో ఇతని కావ్యాన్ని ముద్రింపజేయండి. అది నా సన్మానమే అని సంతోషిస్తాను’ అన్నారట. ‘అయ్యా వారు మావారే. వారి కావ్యాన్ని త్వరలోనే అచ్చువేయించి, మీకొక కాపీ పంపిస్తాము. ఈ డబ్బు మీరు స్వీకరించండి’ అని ఎన్నో విధాల బతిమాలిన తర్వాత విశ్వనాథవారు స్వీకరించినారట. ఈ ముచ్చట నాకు వానమామలవారే చెప్పినారు.

ఇట్లాంటివారు విశ్వనాథవారు.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Sir, Im happy to read this post. great ppl are forgotten but you have provided enough record. thnk you again. Looking forward for more piece of works from Samala Sadashiva

    ReplyDelete