Thursday, November 26, 2026

నూనె వ్యాపారి - అతని చిలుక : రూమీ కథ

 


నూనె వ్యాపారి - అతని చిలుక

నూనెలు అమ్ముకునే ఒక వ్యాపారి దగ్గర ఒక చిలుక ఉండేది. అది చక్కగా మాట్లాడుతూ అతనికి సరదా పుట్టించేది. యజమాని బయటకు వెళ్లినప్పుడు అంగడికి కాపలాగా కూడా ఉండేది. ఒకరోజున చిలుక అంగడిలో ఒంటరిగా ఉండగా ఒక పిల్లి వచ్చింది. నూనె జాడీలను తోసేసింది. వ్యాపారి తిరిగి వచ్చాడు. జరిగిన గోలను గమనించి చిలుకే ఆ పని చేసిందని అనుకున్నాడు. కోపంతో చిలుక తలమీద ఒక్కటి చరిచాడు. ఆ దెబ్బతో చిలుక తలమీది ఈకలన్నీ ఊడిపోయాయి. అంతేకాకుండా దెబ్బతో చిలుక దిమ్మతిరిగి పోయింది. చాలారోజుల వరకు అది మాటలు మరిచిపోయింది. చివరకు ఒకనాడు అంగడి ముందునుంచి ఒక బట్టతల మనిషి నడిచిపోతూ ఉండడం చిలుక గమనించింది. దానికి మాటలు తిరిగి వచ్చేశాయి. ‘అయ్యా, మీరు ఎవరి నూనె జాడీలను ఒలకపోశారు?’ అంటూ అది అరవసాగింది. బట్టతల మనిషి చిలుక పొరపాటును అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వాడు. వయస్సుతో వచ్చిన బట్టతలకు తన బట్టతలకు ఒకటే కారణం అనుకున్నది చిలుక.

 


No comments:

Post a Comment