I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Saturday, August 23, 2025
Friday, August 22, 2025
M D Ramanathan - Samajavaragamana - Hindolam
M D Ramanathan
Samajavaragamana - Hindolam
Thursday, August 21, 2025
Nedunuri Krishna Murthy Shritakamala Ragamalika
Nedunuri Krishna Murthy
Shritakamalakucha - Ragamalika - Jayadeva Kavi
Tuesday, August 19, 2025
లోకాభిరామం - పద్యంవిద్య - Lokabhiramam - Padyamvidya
లోకాభిరామం - పద్యంవిద్య
నా పుస్తకం నుంచి మరో వ్యాసం - మీ కోసం
రాస్తారా అన్నప్పుడు,
చూస్తానంటే తప్పని, రాస్తానన్నా!
రాస్తే ఏమవుతుందో,
చూస్తాననుకున్నానూ, రాస్తున్నాను!
- ఇది కంద పద్యమేనా? ఏమో? నాకు తెలియదు. రాశాను, అంతే.
నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు,
ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటుంటే,
పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి
మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు.
వచనం (కథ, నవల, వ్యాసం) రాయడం
గాల్లో విమానం నడపడం లాంటిదనీ, పాట రాయడం, రోడ్డు మీద కారు నడపడం లాంటిదనీ అన్నారాయన. ఇక పద్యం,
పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే,
వెళ్లవలసిన చోటికి అదే వెళుతుంది! అన్నారాయన. ఏ పనయినా అంతే,
చేతనయిన వారికి, చాలా సులభంగానే
కనపడుతుంది. మిగతా వాళ్లకది చెక్కల బావిలో మోటార్ సైకిల్ నడిపినట్లుంటుంది.
చెక్కలతో బావి కట్టి, అందులో గోడల మీద, సైకిల్, మోటార్ సైకిలూ, నడిపిన గురుభిక్‌సింగ్ ప్రదర్శన నాకు
ఇన్నేళ్లయినా గుర్తుంది. ఆయనకదే బతుకు. (బహుశ: దాని అంతం కూడా!) ఎట్లా నడుపుతారు,
అంటే, ‘ఓస్! సులభం’
అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు. కనుక, నాతో మొదలు ఎవరయినా ప్రయత్నించవచ్చు. జారిపడినా దెబ్బలు
తగలవు!
చిన్నప్పుడు, అదెందుకో, ఏమిటో తెలియకుండానే, శతకాలకు శతకాలు భట్టీయం (ఇది నోటికి నేర్చుకునే విద్య!) వేయించేవారు. ఇది
పక్కనే పెడితే, మా ఊరి బడి ఒక సెంటర్ స్కూలట. సెంట్రల్ కాదని
మనవి. చుట్టుండే అయిదారు పల్లెలకు అది కేంద్రమని అర్థం! ఆ బడులలో పంతుళ్లు వచ్చి
ఒక ‘సెంటర్ క్లాస్’ అనే కార్యక్రమంలో ‘మాదిరి తరగతి’ అనే మాడల్ క్లాసులు
నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కనబెడితే, ఈ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదూ?
నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం, పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు, కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులాగుంది.
వాళ్లంతా, నట్టుతూ, ముక్కుతూ మూడు నాలుగు పద్యాలు చదివి, అలసి ఆగిపోయారు.
నేను మాత్రం, వద్దన్నా ఆపకుండా, మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. అది మూడవ, నాలుగవ తరగతిలో ఉన్నప్పటి మాట!
సినిమా పద్ధతిలో సీన్ కట్ చేస్తే, ఎనిమిదవ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్లు గారు తెలుగు
చెపుతారు. చాలా బాగా చెపుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ, అంటే పదాలను విడగొట్టి చూపడం, తరువాతి అంచె. అర్థం చెప్పడం, సమన్వయం, ఆ తరువాత జరుగుతాయి. పద్యాన్ని మరో సారి చదువుతారు. అప్పుడు
పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా, ఒక క్రమంలో కూచుంటారు గదా! రెండు బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి.
అందులో మొదట్లోనే నేను ఉండేవాణ్ని! అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే,
ఆ పద్యం చదివేవాణ్ని! అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలాకాలం
నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి? క్లాసులో ఉండే
ఆడపిల్లలలో ఇద్దరు, ఇదంతా నచ్చలేదనుకున్నారు. ‘మీరు ఏ పద్యం
చెప్పబోతున్నారో ముందే వాడికి చెపుతారు. వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు! బడాయి!’
అన్నారు. ఆచార్లు గారికి నేనంటే, ఆనాటికీ, ఈనాటికీ అభిమానమే. ‘ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంత సేపు, అతను పద్యం మనసులో మననం చేసుకుంటాడు. మీరు చేయరు. అంతే!’ అన్నారు. సిలబస్‌లో
లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ, వంతు రాగానే, నేను పద్యం
అప్పజెప్పాను. పుస్తకం లేకుండానే! ఆ తరువాత ఏమయిందో నాకు గుర్తులేదు.
బడిలో నాతోబాటు పద్యాల పోటీలో పాల్గొన్న
మిత్రుడు, బంధువు విష్ణు, చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్లిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి
విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవరికీ ఇవ్వరు. పేరుతోబాటు ఒక నంబరేమయినా
ఉండేదేమో? గుర్తు లేదు. ఫలానా శర్మ, కేరాఫ్ 56, ఎ.పి.ఓ. అని రాస్తే
చాలు, ఉత్తరం వెళ్లిపోతుంది. ఏపీఓ అంటే ఆర్మీ పోస్ట్
ఆఫీస్ అని తరువాత తెలిసింది. (తెలిసిందా?) 56 అంటే విష్ణు ఉండే చోటయి ఉంటుంది. ఈ సంగతంతా పక్కన పెడితే, ఒకసారి ఉగాదికో, సంక్రాంతికో వాడికి
ఇన్‌లాండ్ లెటర్ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు.
వాడి దగ్గర గానీ, ఉందేమో ఉత్తరం, అడగాలి!
చిన్నాయనగారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో
‘వసుచరిత్ర’ పాఠం చెప్పారు. ఇంట్లో, సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యవిద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో
కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ, ఎందుకో అది కుదరదు.
దేనికదే వేరువేరుగా ఉండిపోతయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర, ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. ‘అన
విను, గృహస్థ రత్నంబ! లంబమాన రవిరథతురగ..’ అంటూ
వచనమంతా ఒక్క పట్టున అప్పజెబితే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అప్పకవీయం
పరిచయమయింది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకమది. నిడుదలు, జడ్డక్కరములు, పిరుందకడ యూదిన
యక్కరముల్ గురువులు. కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్‌తో గణములు,
గణముల కాంబినేషన్స్‌తో వృత్తములు, పద్యములు. తరువాత డి.ఎన్.ఏ. గురించి చదువుతుంటే నాకిదంతా గుర్తుకు
వస్తుండేది. ‘జరల్ జరల్ జగంబుకూడి సన్నుతిన్ రచింపగా, పరాజితార ధీరవీర పంచచామరంబగున్!’ పంచచామరం అనే పద్యం లక్షణం పంచచామరంలో!
రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్‌వ్యూహము.
‘రామాండెమంటే, సామాండెమా? గొల్లేశమంత కథ!’ అని ఒక మాట. రామాయణం సామాన్యం కాదు! బయలాటలో వచ్చే
గొల్లవేషమంత ఉంటుందని, అన్న మనిషి భావం! ఈ ఇంటర్‌వ్యూహము కూడా గొల్ల
వేషమంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము గనుక, అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది గనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్సుకు
సంబంధించింది. ముగ్గురు నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతయినంత వరకు నేనూ వారి
బుర్ర తిన్నాను. కైసర్ కలందర్ గారని ఒక అందమయిన పెద్దాయన, కమిటీ అధ్యక్షులు. ‘సైన్సు సరే! హాబీలేమిటి?’ అని అడిగారు. ‘తిండి, అమ్మాయిల’ గురించి
చెబితే కుదరదు. కనుక ‘సంగీతం, సాహిత్యం’ అన్నాను.
‘ఒక పద్యం చెప్పగలవా?’ అన్నారాయన. ‘కలడుల్లోక మహా మహోగ్ర’ అంటూ
వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక్క సంస్కృత సమాసం మరి! ‘అర్థం
చెప్పగలవా?’ అన్నారాయన. ‘ఓ యస్’ అన్నాను. భయపడ్డారేమో,
‘వద్దులే’ అని మరేదో అడిగారు. నాకా ఉద్యోగం ఇస్తారని అక్కడే
అర్థమయింది. అది మరో గొల్లవేషం కథ!
మళ్లీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి, ఆలోచన ఏదయినా వస్తే
వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేనూ జవాబుగా ఒక కార్డు రాసేవాణ్ని. ఒకసారి
ఆయన రాయవలసిందేదో రాసి, కార్డు వెనుక చిరునామా రాసేచోట పక్కన ఖాళీలో
రెండు పద్య పాదాలు రాశారు. ‘శాంతి సంగరంబు, స్వాతంత్య్ర సమరాన, సగము కాలినట్టి సమిధ నేను’ అని మాత్రం
రాశారాయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేనూ అదే పద్ధతిలో ‘కడమ సగముగాల్చి కవితా
ప్రపంచాన, కారు చీకట్లను పారద్రోలె!’ అని రాసి పంపాను.
నమ్ముతారో లేదో? కార్డు అందిన మరుక్షణం ఆయన ఆఘమేఘాల మీద
వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. ‘తెలుగు పద్యం’ గురించి నేను వేస్తున్న
పుస్తకంలో, నీ పద్యం ఉండాలి!’ అన్నారు. పద్యం లేదు. అదే
వేరే సంగతి!
Nedunuri Krishna Murthy - Santhanagopalakrishnam - Khamas
Nedunuri Krishna Murthy
Santhanagopalakrishnam - Khamas
Monday, August 18, 2025
Franz Kafka Story in Telugu
Literature at it's best!
Franz Kafka!
A story or is it?
నిత్యం జరిగేదే - కథ
నిత్యమూ జరిగేదే!
ఫ్రాంత్స్ కాఫ్కా
మామూలు సంఘటన : దాన్ని ఎదురుకున్నామంటే అదొక గొప్ప!
ఇతనికి పక్క ఊళ్లోఉండే అతనితో జరూరు పని ఉంది. పది
నిమిషాలలో వెళతాడు. కొంత మాట్లాడి మళ్లీ వస్తాడు. ఎంత తొందరగా వచ్చానో అంటాడు
పైగా.
మరునాడు అతను మళ్లీ అక్కడికి పోతాడు. ఈసారి కొన్ని గంటలయినా
సరే వ్యవహారం తేల్చేయాలి. పొద్దున్నే బయలుదేరతాడు. అన్ని పరిస్థితులు, కనీసం ఇతని
దృష్టిలోనిన్నటిలాగే ఉన్నాయి. కానీ అక్కడికి చేరడానికి ఇతనికి పది గంటలు పడుతుంది.
అలసి సాయంత్రానికి అక్కడకు చేరుకుంటే, ఇతను రాలేదని విసుగుచెంది అతను ఇతని స్థావరానికి
బయలుదేరాడన్నారు. బయలుదేరి అరగంటయింది. దారిలో ఎదురయి ఉంటాడు అనీ అన్నారు. ఇతడిని
కొంచెం సేపు ఉండమన్నారు. అతను త్వరలోనే వస్తాడన్నారు. ఇతను మాత్రం ఆత్రంగా
వెనుదిరిగి వచ్చాడు.
ఈసారి అతను సంగతి తెలియకుండానే, క్షణంలో ఇల్లు
చేరుకున్నాడు. అతను పొద్దున్నే వచ్చాడనీ, నిజానికి ఇతను బయలుదేరకముందే వచ్చాడనీ చెప్పారు. నిజంగా
అతను ద్వారం దగ్గరే ఎదురయ్యి, వ్యవహారం గురించి చెప్ప ప్రయత్నించాడు. ఇతను మాత్రం తనకు
టైం లేదనీ, తొందరగా వెళ్లాలనీ
అంటూసాగిపోయాడు.
ఇతని తీరు అర్థంగాక అతను అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు. ఇతని
గదిలోనే ఉండి మళ్లీమళ్లీ వచ్చాడా అని అడిగాడు. అతనింకా అక్కడే ఉన్నాడిప్పుడు.
అతడిని కలిసి సంగతి వివరించవచ్చునన్న సంతోషంతో ఇతను మెట్లెక్కసాగాడు. పైమెట్టు మీద
పడిపోయాడు. దొర్లుతూ వచ్చి బాధ కారణంగా మూర్ఛపోయాడు. కనీసం అరవను కూడా లేదు.
చీకట్లో ఉండి మూలుగుతున్నాడు. అతను కోపంగా మెట్లు దిగి గబగబా `దగ్గరనుంచా, దూరంనుంచా
తెలియలేదు` వెళ్లిపోవడం మాత్రం
కనబడుతూనే ఉన్నది. అతను వెళ్లిపోయాడు.
I I I I
ఇది కాఫ్కా రచన. దీన్ని కథ అనాలా? మరి కాఫ్కా కథకుడు
గదా? కథానికలు రాసే
వారందరికీ అతను అంత ఎత్తున కనిపిస్తాడు గదా? అందుకే కాఫ్కా తీరు (కాఫ్కాయెస్క్) అనే మాట పుట్టింది.
పద్ధతి పుట్టింది.
ఇంతకూ కథానిక అంటే ఎట్లుండాలి? ఎవరు చెప్పగలరు?
B N Suresh - Ragam Tanam Pallavi - Shanmukhapriya
B N Suresh - Flute
Sunday, August 17, 2025
Voleti Venkateswarlu - Sri Raghuvara - Kambhoji శ్రీ రఘువర - కాంభోజి -...
Voleti Venkateswarlu
Sri Raghuvara - Kambhoji
Saturday, August 16, 2025
Kadri Gopalnath - Saxophone - Two offerings
Kadri Gopalnath - Saxophone
Vinayaka Ninuvina - Hamsadhwani
Samanamevaru - Kharaharapriya
Enjoy some scintilating Music!
Friday, August 15, 2025
M Balamuralikrishna - Aligite - Husseni - Kshetrayya Padam
M Balamuralikrishna
D K Pattammal Patriotic Song - Our Land
D K Pattammal
D K Pattammal - Tyagarajayogavaibhavam - Anandabhairavi
D K Pattammal
Tyagarajayogavaibhavam - Anandabhairavi
Thursday, August 14, 2025
Pelli Dustulu - A Story from Marakesh in Telugu
Pelli Dustulu - A Story from Marakesh in Telugu
పెళ్లి దుస్తులు - మరాకష్ జానపద
కథ
అలీ తన భార్య ఇద్దరూ షేఖ్ హమీద్‌తో పాటు ప్రయాణం చేస్తున్నారు.
ప్రయాణంలో శ్రమ తెలియకూడదని వాళ్లు కథలు మొదలుపెట్టారు. అలీకి కథలు వినడం చాలా
ఇష్టం. ఇక షేఖ్ హమీద్ చరిత్రకథలు చెప్పడంలో చాలా గొప్పవాడని పేరున్న మనిషి. ఆయన
చెపుతున్న కథను అలీ చాలా ధ్యాసతో వింటున్నాడు. ఒక్కసారి అతని చూపు పక్కకు
కదిలింది. ఇసుకలో ఏదో ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. వెళ్లి ఆ వస్తువు ఏమిటో
చూడాలని అలీకి బలంగానే కోరిక కలిగింది. కానీ బాబాయి కథను వినకుండా మధ్యలో పక్కకు
పోతే అది మర్యాద కాదని అనుకుని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన జేబులో ఉన్న
గింజలను అతను బయటకు తీశాడు. దారివెంట వాటిని వరుసగా పడవేయసాగాడు.
చివరికి వాళ్లు తమ గూడానికి తిరిగి వచ్చారు.
షేఖ్ హమీద్ తన గుడారం లోకి వెళ్లిపోయాడు. కానీ అలీమాత్రం గుర్రంమీదనుంచి
దిగనేలేదు. తల్లితో అతను తన గురించి ఎవరయినా అడిగితే పడుకున్నాడని చెప్పమన్నాడు.
గుర్రాన్ని వెనుకకు తిప్పి అతను వచ్చినదారిలోనే మళ్లీ పోసాగాడు. దారివెంట తాను
జారవిడిచిన విత్తనాలను గమనిస్తూ సరయిన చోటికి తిరిగివచ్చాడు. అక్కడ దిగి చూస్తే
ధగధగలాడుతూ ఒక బంగారు చేతికడియం కనిపించింది. దానిమీద ముత్యాలు పొదిగి ఉన్నాయి.
పనితనం చాలా గొప్పగా ఉంది. అది తప్పకుండా ఎవరో ఉన్నతవంశురాలయిన అమ్మాయి కడియం
అనుకున్నాడు అలీ.
అతను కడియాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు.
ఇంటికి వచ్చిన అలీకి వాళ్ల అమ్మ, మీ బాబాయి
రెండుసార్లు నీగురించి అడిగాడు, అని చెప్పింది. అలీ
కడియం కూడా తీసుకుని షేఖ్ హమీద్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ చాలామంది కూర్చుని
ఉన్నారు. ఆ సంగతి, ఈ సంగతి మాట్లాడుతున్నారు. అలీ కడియాన్ని షేఖ్
హమీద్ చేతికి ఇచ్చాడు. ఆయన కడియాన్ని అటుఇటూ తిప్పుతూ చాలా జాగ్రత్తగా చూచాడు.
‘ఇది తప్పకుండా చాలా మంచి పనితనంగల కంసాలి చేతిలో తయారయ్యింది. నీకు ఎక్కడ
దొరికింది?’ అంటూ అడిగాడు.
అలీ వివరమంతా చెప్పాడు.
‘ఈ కడియం సొంతదారు మామూలు వ్యక్తికాదు. వెళ్లి
వెతుకుదాం పద’ అన్నాడు షేఖ్ హమీద్.
వాళ్లు గూడెంలోని దాయిని పిలిపించారు.
కడియాన్ని ఆమె చేతికి ఇచ్చారు. మొత్తంలో గూడెమంతా వెతికి ఈ కడియం ఎవరిదో
తెలుసుకురావాలని ఆమెకు పనిపెట్టారు. బహుశా వేరే గూడెంలోని మనిషి అయి ఉండవచ్చు.
మొత్తానికి నీవు సంగతి తెలుసుకు రావాలన్నారు.
దాయి కడియం తీసుకుని వెతుకులాట కొరకు
బయలుదేరింది. ఒక గుడారం నుంచి మరొక గుడారానికి తిరగసాగింది. చాలాచోట్ల ఆ పద్ధతిగా
అడుగుతూ పోయింది. ఆమె ఆ రకంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ప్రాంతానికి చేరేసరికి అక్కడ
గుడారాలన్నీ నల్లని గుడ్డతో వేసిఉండడం కనిపించింది. అందులోనూ ఒక గుడారం మరీ
పెద్దది. ఎనిమిది వాసాలమీద దాన్ని నిలిపి ఉంచారు. అక్కడ ఒక యువతి దాయికి స్వాగతం
చెప్పి లోనికి పిలిచింది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె శరీరం అద్దంలాగ నిగారింపుతో
మెరుస్తున్నది. ఆమె ముఖంకూడా చంద్రునికన్నా బాగా వెలిగిపోతున్నది.
దాయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నది.
మంచినీళ్లు తాగింది. అప్పుడిక రుమాలులోనుంచి కడియాన్ని బయటకు తీసి చూపించింది.
గుడారంలో అమ్మాయి కడియాన్ని చేతికి తీసుకుని అటు ఇటూ తిప్పి చూచింది. ఈ కడియం
నాదేనంటూ తన పెట్టెలోనుంచి దాని జతకడియాన్ని కూడా తెచ్చి దాయికి చూపించింది.
రెంటిలోను ఎంతమాత్రమూ తేడాలేదు. ‘ఈ కడియం తప్పకుండా నీదే. కనుక రెండూ నీవే తీసుకో’
అన్నది దాయి.
‘అమ్మా, మీరు చాలా
శ్రమపడ్డారు. కనుక మీరే ఈ రెండు కడియాలను తీసుకోండి. ఒకటి లేకుంటే మరొకటి ఎందుకూ
పనికిరావు అవి’ అన్నది ఆ అమ్మాయి. ఇక దాయి వాళ్ల గూడెం వివరాలు, అమ్మాయి పేరు, మిగతా అవసరమయిన
విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నది. ఇక తిరిగి తమ గూడానికి వచ్చి చేరింది.
ఆమె షేఖ్ హమీద్ గుడారానికి తిరిగి వచ్చింది.
అక్కడ వాళ్లంత దాయి కొరకే ఎదురుచూస్తున్నారు. దాయి రెండు కడియాలు బయటకు తీసి
చూపింది. అమ్మాయి గురించి పొగుడుతూ ఎంతో చెప్పింది. అమ్మాయి నిజంగా ఉదారతగల మనిషి,
అంత అందమయిన మనిషి అంటే మామూలు వంశం మనిషి కావడానికి
వీల్లేదు అనుకున్నాడు షేఖ్ హమీద్. ఆ అమ్మాయి తప్పకుండా చాలా ప్రత్యేకమయిన
వ్యక్తి అని అతనికి తోచింది. తన గూడెంలోని కొంతమంది పెద్ద మనుషులను, అలీని కూడా వెంటతీసుకుని గుర్రాలమీద బయలుదేరాడు. నల్లని
గుడారాల ప్రాంతానికి వాళ్లంతా చేరుకున్నారు.
నల్ల గుడారాలలో వారికి గొప్ప స్వాగతం
ఎదురయింది. మొదలు గుర్రాలకు మేత దొరికింది. లోపల చక్కని మర్యాదలు జరిగాయి. చాపలు
పరిచి కూర్చోబెట్టారు. గొర్రెలు, ఒంటెల పిల్లల
మాంసంతో మంచి విందు కూడా జరిగింది. మూడు రోజులపాటు విందులు కొనసాగాయి. ఇక
నాల్గవనాడు ఆ అమ్మాయి తండ్రి అయిన అమీర్ అతిథులుగా వచ్చినవారి పనిగురించి
అడిగాడు. షేఖ్ హమీద్ కడియాలగురించి వివరం చెప్పాడు. ‘ఈ కడియాల సొంతదారు చాలా
ఉదారస్వభావంగల మనిషి. చాలా అందమయిన మనిషి కూడా అయి ఉంటుందని నాకు తోచింది. ఆమె
గొప్ప వ్యక్తిత్వంగల మనిషి అనుకున్నాను. ఆమెతో నా వివాహం జరిగితే బాగుంటుందని నా
ఆలోచన’ అన్నాడు హమీద్.
అమ్మాయి తండ్రి ఒక్కసారి బరువుగా నిట్టూర్చాడు.
కోరిక కలగడం చాలా సులభంగానే జరుగుతుందన్నాడు. అయితే ఒక తండ్రికి తన కూతురు
అన్నిటికన్నా విలువయినది అన్నాడు. ‘కానీ మీరు అతిథులుగా వచ్చారు. అతిథులను
నిరాశపరచడం అరబ్బుల సాంప్రదాయంలో లేదు. ఇక మీవంటి గొప్పఇంటి అతిథుల విషయం మరింత
ప్రత్యేకం. నా తలను మీముందు వంచుతున్నాను’ అన్నాడతను.
అమ్మాయిని పెళ్లికూతురుగా అలంకరించారు. డెబ్బయి
ఒంటెలు, తివాచీలు, దుప్పట్లు, తలగడలు మరెన్నో సరంజామాను వాటిమీద ఎక్కించారు.
ఒక సేవకురాలిని, ఒక బానిసనుకూడా అమ్మాయితోబాటు అప్పగించారు.
వాళ్లు బయలుదేరుతుండగా అమ్మాయి తండ్రి షేఖ్
హమీద్‌తో ‘దేవుని దయతో పెళ్లికూతురు వల్ల మీకు మంచి జరుగుగాక’ అన్నాడు.
షేఖ్ హమీద్ తమ గూడానికి తిరిగి వచ్చాడు.
అక్కడి వారంతా డెబ్భయి ఒంటెలు, కొత్త
పెళ్లికూతురిని చూచి సంతోషించారు. పెళ్లిపాటలు పాడసాగారు. ఇక షేఖ్ హమీద్ అలీని
ముందుకు పిలిచాడు. ‘నీ పెళ్లికూతురు, పెళ్లి గుడారంలో
ఉంది. కంట్లో కాటుక పెట్టుకుని నీకోసం ఎదురుచూస్తున్నది’ అన్నాడు.
‘అదెలా కుదురుతుంది? అమ్మాయిని మీరు వెతికారు. ఆమె తండ్రితో మీరు మాట్లాడి పెళ్లి నిర్ణయించారు’
అన్నాడు అలీ.
షేఖ్ హమీద్ ఒక్కమాట కూడా పట్టించుకోలేదు.
పెళ్లి దుస్తులను అలీకి అప్పగించాడు. ‘కడియం నీకు దొరికింది. పెళ్లికూతురు కూడా
నీకే చెందవలసి ఉంది. ఇక ఆలస్యం చేయకు. ఆమె దగ్గరకు వెళ్లి చేరు’ అన్నాడు ఆయన.
అలీ పెళ్లి గుడారం వేపు బయలుదేరాడు. కొంతదూరం
కూడా నడవక ముందే ఒక వ్యక్తి వచ్చి అతని కాళ్లమీద పడ్డాడు. కాళ్లను
ముద్దుపెట్టుకుంటూ ‘నన్ను ఒక అతిథిగా గుర్తించి దయచూపండి షేఖ్ హమీద్!’ అన్నాడు.
పెళ్లి దుస్తుల కారణంగా అతను అలీని చూచి షేఖ్
హమీద్ అనుకున్నాడు.
ఇంతకూ నీవు ఎవరని అలీ వివరం అడిగాడు. ఎక్కడి
నుంచి వచ్చావని కూడా అడిగాడు.
‘మీరు పెళ్లి చేసుకుని తెచ్చుకున్న అమ్మాయి నాకు
బాబాయి కూతురు’ అన్నాడు ఆ యువకుడు. ‘ఆమెతో నా పెళ్లి నిశ్చయమయింది. మీరేమో ఒక
అతిథిగా మా బాబాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం ప్రస్తావించారు. ఆయన మిమ్మల్ని
కాదనలేకపోయాడు’ యువకుడు వివరించాడు.
అలీ వెంటనే తన పినతండ్రి తనకు అందజేసిన పెళ్లి
దుస్తులను తీసి యువకుడికి కట్టబెట్టాడు. ‘యువకుడా, ఆ అమ్మాయి మీద అన్నిరకాల నీవే హక్కు కలిగి ఉన్నాయి. పెళ్లికూతురు నీకే
చెందుతుంది.’ అన్నాడు.
మరుసటి రోజు అలీ మామూలు దుస్తులలో తిరుగుతూ
ఉండడం షేఖ్ హమీద్ గమనించాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. విషయం ఏమిటని ఆయన అలీని
అడిగాడు. ‘మరి నీవు పెళ్లికొడుకు దుస్తులలో ఉండాలి కదా?’ అన్నాడు.
అలీ తనకు కలిసిన నవయువకుని గురించి వివరం
చెప్పాడు. విషయం విన్న షేఖ్ హమీద్ ఎంతో సంతోషించాడు. బుద్ధిమంతుని లక్షణం అంటే
ఇదే అని కూడా అన్నాడు.
పెళ్లికూతురితో వచ్చిన డెబ్భయి ఒంటెలతో మరొక
డెబ్భయి ఒంటెలను కూడా కలిపి షేఖ్ హమీద్ పెళ్లిజంటకు మరెన్నో విలువయిన బహుమతులను
కూడా ఇప్పించాడు. యువకుడు అతని భార్య చాలాసంతోషంగా వీడ్కోలు చెప్పి తమదారిన
పోయారు.
(మరాకష్ దేశపు జానపద కథ)
Pelli Dustulu - A Story from Marakesh in Telugu
Pelli Dustulu - A Story from Marakesh in Telugu
పెళ్లి దుస్తులు - మరాకష్ జానపద కథ
B N Suresh - Flute - Darini Telusukonti - Suddha Saveri
B N Suresh - Flute
Darini Telusukonti - Suddha Saveri
Tuesday, August 12, 2025
Lokabhiramam - Goppavaru - Goppa Ooru (గొప్ప వారు - గొప్ప ఊరు)
Lokabhiramam
లోకాభిరామం
Goppavaru - Goppa Ooru (గొప్ప వారు - గొప్ప ఊరు)
మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా?’ ప్రశ్న
‘లేదండీ! అందరూ
పిల్లలే పుడుతున్నారు!’ జవాబు.
నీలంరాజువారు : లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. నేను
మురళీధర్ గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయట పడేశారు.
ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్
చేశారా? అని నాకు గాభరా!
ఆయన మళ్లీ పిలిచి (కాల్ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట
శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం
పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్’ కూడా
అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు
ఆదర్శం, అని వినయంగానే
అన్నాను. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన
గొప్పవారు!
(గురజాడ వారి ఇల్లు)
ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది
కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు
తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు
(ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి
ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం
గొప్పవాణ్ని! భళా!
గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది.
మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో
ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం
వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి
మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడు గారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణ బాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల
పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!)
నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి
మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను!
తాపీ ధర్మారావు, సాలూరు
రాజేశ్వరరావు!!! వాసా వారు,
అంట్యాకుల
పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!
బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు
చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది.
బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో
విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం
నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే
ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది!
విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు
నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!
గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని
చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది
ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే
కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి.
ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు
చదువుకుంటున్నారు. పై అంతస్తు లోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను
వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది ‘మెటిల్డా’
అంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను
కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని
సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. అమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ
ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి
గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగి
రాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే
అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు
తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిశెట్టి రామారావు కార్టూన్ల గురించిన
పుస్తకాలు దొరికాయి.
(సంగీత కళాశాల - వెనుక భాగం)(సంగీతం మర్రి చెట్టు)
సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక
పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం
గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది.
మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ
మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం
లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం
చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక
పెద్ద మర్రిచెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి
ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన
భావం కలిగింది. ఆవరణ లోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతం వల్లనేమో
అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం
దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారు’ అని
అడగండి, ఎవరైనా చెబుతారు
అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు
దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత
సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు
చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను
పిలిచింది ఒక స్కూల్ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్ పేరున
పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు
జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్ ఇచ్చి
సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్ అక్కడ
స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి
దొరుకుతాయన్నారు. అందుకు టైమ్ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.
ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం
మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను
ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని
తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి
రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం
కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ
సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే
తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!
AKC Natarajan - Saraswati namostute - Saraswati
A K C Natarajan
Saraswati namostute - Saraswati
Monday, August 11, 2025
Srirangam Gopalaratnam - Two great items
Shravanam continues!
Kum Srirangam Gopalaratnam
Paramapavana - Ranjani
Parulannamata - Kapi Javali
Enjoy great Music!
Sunday, August 10, 2025
Bandit Queen - A novel by Bankim Babu
Bandit Queen
Bankim Babu
Excerpts:
Bhutanath village in Barendra county was where Profullo and her mother were going. That was home to Profullo’s father-in-law, Hara Ballav Babu. Profullo’s father-in-law was a wealthy man.
He owned land, houses, a temple, a walled garden, a lake. All of this was but six miles from Profullo’s home. Walking, Profullo and her mother reached there about three in the afternoon.
Once there, Profullo’s mother could barely make herself enter the house. It was not that Hara Ballav Babu despised them for being poor. No. It was what had happened after the wedding.
Profullo was surpassingly beautiful, a matchless beauty. This was why Hara Ballav had selected her for his son. Delighted at this good fortune, Profullo’s mother had spent all her money on the wedding, and on lavish food for the groom’s party. Unfortunately she had not provided half as much to her neighbors, the bride’s party. Insulted, they had refused to eat and walked out. Profullo’s mother had been angry, and had let her neighbors know it. Deeply offended, they had taken their revenge.
On the third day of a wedding, the bride ritually enters her husband’s kitchen and touches the food and the cookware, showing that she is now part of her husband’s household, that she has a right to his food, and she has brought good fortune with her.
On that day, Profullo’s neighbors, (who had been invited to the feast) refused to eat. Surprised, Hara Ballav had asked what, if anything, was wrong with the food. Their answer shocked and dismayed him. Profullo’s mother, they claimed, was a widow, and had lost caste by keeping bad company. A rich man may do as he pleased, but they were poor people with nothing but their honorable caste to lose. And they were not going to lose that by eating what Profullo had touched. Why would they lie?
The next day Hara Ballav had sent Profullo home to her mother.
Now, as Profullo’s mother looked at Hara Ballav’s house, she trembled. Yet they had come, they had screwed up their courage and come. There was no going back now. Mother and daughter entered the house.
At that moment, Hara Ballav was taking his post-prandial rest. Hara Ballav’s wife was getting her hair done – which meant having her grey hairs plucked out.
Want to read the book?
No intention of impinging copyrights. Strictly for personal pleasure!
Download from Here!