పక్షి - కప్ప
భూటాన్ జానపద కథ
పక్షి - కప్ప
కోకిలమ్మ కప్పకు కమ్మని వీడ్కోలు చెప్పింది.
భూటాన్‌లో ఉత్తరంగా ఉండే కొండలవైపు ఎగురుతూ వెళ్ళసాగింది. కోకిల గాలిలో అలా
కొంతకాలం ఎగురుతూ ఉండిపోయింది. ఇక కప్ప తనను చూడలేదు అనిపించినప్పుడు మళ్లీ కిందకు
దిగింది. మడుగు పక్కనే ఉండే ఒక చెట్టు మీదకు వచ్చి వాలింది. ఆ చెట్టు గుబురుగా
ఉన్న ఆకుల్లో రహస్యంగా దాగి ఉండి పోయింది. అట్లా కప్పను గమనిస్తూ కొంతకాలం
గడిచింది. ఆ రోజు బాగా ఎండగా ఉంది. వేడిగా కూడా ఉంది. అందుకని చాలాసేపు కాకముందే
కప్ప మడుగు లోని ఒక తామరాకు మీదకు దూకింది. కాళ్లు చేతులు సాగదీసి ఒళ్ళు
విరుచుకుని అది గట్టిగా ఆవులించింది. చల్లని వాతావరణంలో హాయిగా ఎండ కాగుతూ
ఉండిపోయింది. అట్లా కూర్చున్న చోటే తనలో తాను అది గొణుగుతున్నది. ఆ గొణుగుడు
మడుగులో ఉన్న మిగతా జంతువులకు వినపడుతూనే ఉన్నది.
కోయిలా కోయిలా నా కోయిలా
మోన్లా ఖార్చుంగ్ మీద బహుశా ఎక్కుతుంటుంది
ఛాబ్ సాంగ్ లో బాగా తడిసి ఉంటుంది
చెమటతో ఆమె వీపు చిత చిత అయి ఉంటుంది
చూస్తుండగానే మడుగు లోని జంతువులు అన్ని
విరగబడి నవ్వ సాగాయి. ఆ నవ్వులతో వాతావరణం ప్రతిధ్వనించింది. కప్పకు అదేదో
సరదాగానే ఉన్నట్టుంది. అది తన పాటలు మళ్ళీ మళ్ళీ పాడసాగింది. కోకిలను
వెక్కిరిస్తున్నాను అనుకుంటున్నది. ఇదంతా చూస్తూ కోకిలమ్మ అవమానంగా తల దించుకున్నది.
కళ్ల నిండా నీళ్లు పెట్టుకున్నది. మొత్తానికి అతని మనసులో ఉన్నది ఇదన్నమాట.
ఒక్కసారిగా కోకిల ఆకుల చాటు నుంచి బయటకు వచ్చింది. కప్ప ముందు వాలింది. కోకిల కదలి
పోతున్నది.
నేను బయలుదేరి కనీసం ఒక రోజు కూడా కాలేదు. ఇక
నీవు నన్ను ఈ రకంగా అవమాన పరుస్తున్నావా? ఈరోజు నుంచి నీకు
నాకు ఎటువంటి సంబంధం లేదు. అన్నది కోకిల. కప్ప ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన పెద్ద
పెద్ద కళ్ళు పెట్టి అదే పనిగా చూస్తూ ఉండిపోయింది. కళ్ళు మరింత పెద్దవిగా
కనిపించాయి. కప్ప మరీ వికారంగా కనిపించింది. ఇటువంటి కప్పను కోకిల ఇంతకాలం ఎలా
భరించింది? కప్ప కూడా తప్పు తెలుసుకున్నట్టు ఉంది.
అవమానంగా అది నీళ్లలోకి పెద్ద చప్పుడుతో దూకింది. అది మళ్లీ బయటకు రానేలేదు.
నీవు ఉన్నావు కనుక ఈ నీళ్ళు కూడా అపవిత్రం
అయ్యాయి. దప్పిగొని చస్తున్నా సరే నేను ఇటువంటి నీళ్లను తాగను. అన్నది కోకిల.
కప్పకు కోకిలకు పెళ్లి ఎట్లాగ అయిందో తెలియదు
కానీ ఈ రకంగా వాళ్లిద్దరూ విడిపోయారు.
కోకిలలు మడుగులలో నీళ్లు తాగవని భూటాన్ వాసులు
చాలామంది నమ్ముతారు. నిజానికి తెల్లవారగా చూస్తే కోకిలలు గడ్డి మీది మంచు నీటిని
తాగుతూ ఉండడం కనిపిస్తుంది.
No comments:
Post a Comment