Saturday, September 7, 2019

మిమీ హేలే హేలే - భూటాన్ జానపద కథ


మిమీ హేలే హేలే

డాంగ్ బూ... డింగ్ బూ... అంటే అనగనగా ఒకప్పుడు....



మీమీ ఎర్రటి ఎండలో పడి పొలాల వెంట తిరుగుతున్నాడు. మీమీ ని పల్లెలోని వారు అందరూ తాతయ్య అంటారు. అతనేమీ పెద్ద బలం గల శరీరం కలవాడు కాదు. అయితే చూడటానికి చక్కగా ఉంటాడు. కాళ్లు వంకర తిరిగి ఉన్నా సరే అతని శరీరం వాటిమీద చక్కగా నిలబడి ఉంటుంది. కాళ్లు బలంగానే ఉంటాయి. పల్లె లో పదిమంది ఎక్కడ పొగ అయినా సరే తన చిన్న గడ్డాన్ని సవరించుకుంటూ తాతయ్య అక్కడ సిద్ధంగా వచ్చేస్తాడు. పిల్లిగడ్డం లో వెంట్రుకలు కూడా దుబ్బు గా ఉండవు. మరీ పలుచగా ఉంటాయి. ముసలి అతనికి హాయిగా తిరగటం తప్ప కష్టపడి పని చేయడం తెలియదు. ఊళ్లో వాళ్లందరి దయ మీద ఆధారపడి ఆయన చాలాకాలంగా బతికి పోతున్నాడు. చేతిలో పనిముట్టుని ఏదన్నా పట్టుకున్న సరే అది బలంగా కదలదు. అతను పొలాలలో పనిచేయడానికి పనికిరాడని వేరుగా చెప్పనక్కరలేదు. అటువంటి మనిషి కి పొలంలో తిరుగుతుండగా అమాంతంగా ఒక చెట్టు మొదలు అడ్డం వచ్చేసరికి ఎక్కడ లేని చికాకు కలిగింది. అది పొలంలో మరి మధ్య గా ఉంది. అతను కొంచెం సేపు దాని వైపే చూస్తూ ఉండిపోయాడు. తన గడ్డాన్ని అంతసేపు సవరించుకుంటూ నే ఉన్నాడు. చెట్టు బోదె అక్కడ ఉండకూడదు అని నిర్ణయించాడు. వెంటనే దాని మీద దాడి మొదలు పెట్టాడు. నెమ్మది నెమ్మదిగా దాని వేళ్ళను వెలికి తీశాడు. చేతనైనంతగా తవ్వాడు. ఇక తరువాత బోదె ను పట్టుకొని పెరకడానికి ప్రయత్నంగా పట్టి లాగ సాగాడు. పాపం బలం లేని అతగాని ముఖం మీద చెమటలు కారడం మొదలైంది. చేతులు ఎర్రబడి బొబ్బలు ఎక్క సాగాయి. చివరకు సూర్యుడు పడమటి కొండల వెనుక మాయం అవుతున్నాడు అనగా మీ మీ లాగిన ఒక్క ఊపుతో బోదె అమాంతం ఊడి బయటకు వచ్చింది.

బోదె ఉన్న చోట పెద్ద గుంట పడింది. గుంటలో పచ్చని పెద్ద  మరకతమణి కనిపించింది. పండగ వంటకాలు చేయడానికి పనికి వచ్చే పెద్ద బాణలి బోర్లించిన టు ఉంది అది. అతను తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. చాలాసేపు ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూనే ఉండిపోయాడు. చివరకు అతను విలువగల మరకతాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించాడు. అంతకు ముందు అతను అటువంటి విలువగల రాతిని ఎప్పుడూ చూడలేదు.

ఇప్పుడు నా దగ్గర ఒక మరకతం ఉంది. నేను ఇక మీద పని చేయవలసిన అవసరం ఉండదు. దీన్ని అమ్మి బోలెడు డబ్బులు సంపాదించుకుంటాను. అని అతను బయటికి అనేశాడు. ముసలి తనకి కొత్తగా సంపద దొరికింది. దానితో బోలెడు ధైర్యం కూడా దొరికింది. హుందాగా నడుస్తూ అతను బజారు కు బయలుదేరాడు. దారిలో ఒక గుర్రాన్ని తాడు కట్టి నడిపించుకుంటూ వస్తున్న మనిషి ఒకతని ఎదురయ్యాడు.

తాతయ్యా, ఎక్కడికి వెళుతున్నావు? అంటూ మనిషి మీ మీ ని అడిగాడు.
నన్ను ముసలి తాత అనకూడదు, నేను చెప్పిన మాటలు వినకుండా ఉండకూడదు, నేను పొలం లో తవ్వుతుండగా ఒక చెట్టు బోదె ఎదురైంది, బోదెను పెరికితే మరకతం దొరికింది, దాన్ని బజార్లో అమ్మడానికి వెళుతున్నాను. నా మరకతమణి ఇస్తాను గానీ, దానికి బదులు నీ గుర్రం ఇస్తావా? పాడుతున్నట్టు అడిగాడు మీ మీ.

ఎదురు వచ్చిన మనిషి కి ఏమీ అర్థం కాలేదు. మాట పెగల్లేదు. ముసలాయనకు ఏమైనా పిచ్చా? మరకతం అంటే ఎంతో విలువ గలది. కనుక తాను అవకాశాన్ని జార విడువకూడదు. మనసులో అనుకుంటూ అతను తాతయ్య మాటకు సరేనన్నాడు. మరకతమణి తీసుకుని మనిషి వడివడిగా వెళ్లిపోయాడు. ముసలాయన మనసు మార్చుకుంటాడు అని అతనికి భయం. అయితే మీ మాత్రం గొప్ప బేరం చేశాను అనుకుంటున్నాడు. సంతృప్తి గా ఉన్నాడు. తన దారిన వెళ్లిపోతున్నాడు. తాను కూడా తాడు పట్టుకుని గుర్రాన్ని నడిపిస్తున్నాడు. అతను మరీ దూరం పోకముందే ఒక ఎద్దును వెంటబెట్టుకుని మరొక మనిషి ఎదురయ్యాడు. అతను కూడా తాతయ్యా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు.

మీ మీ మళ్లీ తన పాత పాట పాడాడు. నా గుర్రం ఇస్తాను కానీ నీ ఎదురు ఇస్తావా అని చివరి మాట మార్చాడు. మనిషి నోరెళ్లబెట్టాడు. చలాకీగా ఉన్న గుర్రంతో ముసలి ఎద్దు పోలిస్తే బేరం సంగతి తెలుస్తుంది. కానీ అతను మరో మాట మాట్లాడకుండా మీ మీ అడిగినది ఒప్పుకున్నట్టు తల ఊపాడు. గుర్రం తాడు అందుకున్నాడు. ఎద్దును అప్పచెప్పాడు. దాని కొమ్ములకు తాడు వేసి కట్టి పట్టుకొని నడుస్తూ ముసలతను మళ్లీ దారి పట్టాడు. కొంత దూరం పోయిన తరువాత మరొక మనిషి ఒక గొర్రెతోపాటు ఎదురయ్యాడు. అతను కూడా మీ మీ ని ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు.

మీ మళ్లీ జవాబుగా తన పాత పాట పాడాడు. ఎద్దు ఇస్తాను కానీ నీ గుర్రం ఇస్తావా అని చివరి మాట మార్చాడు. గొర్రె సొంత దారుడు చిత్రంగా చూచాడు. సంతోషంగా బేరానికి ఒప్పుకుని ఎద్దును తీసుకుని తన దారిని పోయాడు. గొప్ప బేరం చేశాను అన్న సంతోషంతో మీ మీ గొర్రెను పట్టుకుని గర్వంగా ముందుకు నడుస్తూ సాగాడు. చూస్తూ ఉండగానే అతను చాలా బేరాలు సులభంగా చేయగలిగాను అని అనుకుంటున్నాడు. గొర్రె తన అరుపులు అరుస్తూ అయిష్టంగానే కొత్త యజమాని వెంట వస్తున్నది.
కొంత దూరం పోయిన తరువాత కోడిపెట్టను చంకలో పెట్టుకుని వస్తున్న మరొక మనిషి ఎదురయ్యాడు. ఎక్కడికి వెళుతున్నావు అనే అతను అడగగానే మీ మీ తన పాత పాట పాడాడు. మరకతాన్ని ఇచ్చి గుర్రాన్ని కొన్నాను. గుర్రాన్ని ఇచ్చి ఎద్దును కొన్నాను. ఎద్దును ఇచ్చి గొర్రెను కొన్నాను. ఇప్పుడు గొర్రెలు ఇస్తాను కానీ నీ పుంజును ఇస్తావా అని గొప్పగా అడిగాడు. అది కూడా పాటగానే.
కోడిపుంజు యజమాని తడబడి పోయాడు. కాదు అనడానికి లేని బేరం ఎదురయింది. సంతోషంగా గొర్రెను తీసుకుని కోడిపుంజు ఇచ్చేశాడు. మీ మీ పుంజు ను చటుక్కున తన చంకలో పెట్టుకున్నాడు. నడక సాగించి కొంత దూరం వెళ్ళాడో లేదో హాయిగా గొంతెత్తి పాడుతూ ఒక మనిషి ఎదురయ్యాడు. మీ మీ మీ చూచి అతను పాట ఆపేశాడు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. మీ మీ మళ్లీ పాత పాట మొదలుపెట్టాడు. నీ పాట నేను తీసుకుంటాను గానీ, కోడిపుంజును తీసుకొని పాట ఇస్తావా అని మాట మార్చాడు. పాటగాని ఆశ్చర్యానికి అంతులేదు. పాట కాదు గదా నోట మాట కూడా రాలేదు. ఇస్తాను అన్నట్టు తల ఆడించాడు. కోడిని అదృష్టవంతుడు అయిన అతగాని చేతులకు అందించి మీ హాయిగా పాడుతూ ముందుకు సాగాడు. షోర్న్ లే లేమో లే పే ఔలెపే లే పే... అతను పాడుతున్నాడు.
పిచ్చి బేరాలు చేసేవారిని భూటాన్ లో మిమీ హేలే హేలే అంటారు.

No comments:

Post a Comment