Wednesday, August 3, 2016

Rumi Masnavi - First Story

Maulana jalaluddin Rumi's Masnavi Stories are in circulation in various versions. Here I present the first story in two versions. I recently read Sri S Sadasiva's Telugu verse version. He has a few more words additional to what I found in the English version. He has read perhaps the original Persian (through Urdu). I have the Urdu version also. I shall try to give that version too.



యువరాజు - పనికత్తె

ఒక దేశంలో ఒక యువరాజు ఉండేవాడు. అతను వేటకు వెళ్లాడు. అక్కడ ఒక అందమయిన పనికత్తెను చూచాడు. అడిగినంత బంగారాన్ని ఇచ్చి ఆమెను వెంట తెచ్చుకున్నాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి జబ్బు పడింది. ఇక యువరాజు ఆమెకు రకరకాల వైద్యులచేత మందులు ఇప్పించాడు. అయితే వాళ్లెవరూ ‘దేవుడు దయచేస్తే, మేము ఈమెను బాగుపరచగలం’ అనడం మాత్రం మరిచిపోయారు. వాళ్ల మందులేవీ పనిచేయలేదు. ఇక యువరాజు ప్రార్థనలు ప్రారంభించాడు. అందుకు సమాధానంగా అన్నట్టు స్వర్గం నుంచి ఒక వైద్యుడు వచ్చాడు. ఆ వైద్యుడు అంతకుముందు వారిచ్చిన మందులను గురించి తప్పు పట్టాడు. చాలా తెలివిగా రోగం నిర్ధారించాడు. అమ్మాయి అనారోగ్యానికి అసలు కారణం తెలుసుకున్నాడు. ఆమెకు సమర్‌ఖండ్‌లోని ఒక కంసాలి యువకుని మీద ప్రేమ ఉన్నదికనుక జబ్బు పడిందని తేల్చి చెప్పాడు. యువరాజు తన మనుషులను సమర్‌ఖండ్‌కు పంపించి ఆ కంసాలిని రప్పించాడు. అతనితో పనికత్తెకు పెళ్లి చేయించాడు. ఆరు నెలపాటు ఆ జంట అత్యంత ఆనందంగా బతికారు. ఆ సమయం గడిచిన తరువాత వైద్యుడు, దైవ సంక్పం అంటూ కంసాలికి విషం మందు ఇచ్చాడు. ఆ అబ్బాయి ఆరోగ్యం, అందం రోజురోజుకూ తగ్గసాగాయి. ఇక అమ్మాయికి అతనిమీద ప్రేమ కూడా తగ్గసాగింది. అప్పుడామెను మళ్లీ యువరాజు దగ్గరకు చేర్చారు. ఈ దైవాజ్ఞ దేవుడు అబ్రహాంను తన ఒక్కగానొక్క కొడుకు ఇస్మాయిల్‌ను చంపమని ఇచ్చిన ఆజ్ఞ వంటిదే. మోజెస్‌ సేవకును దేవదూతలు చంపడం కూడా ఇటువంటిదే. కనుక విమర్శించడం మనుషుల తరం కాదు. 

యువరాజు - పనికత్తె

ఇక ఇప్పుడు మీరు ఆలోచించడానికి ఒక కథ. అది మన ప్రస్తుత పరిస్థితి గురించి చెపుతుంది. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతను చాలా గొప్పవాడు, తెలివిగలవాడు. అతనిలో ఆధ్యాత్మికత కూడా తెలివితో కలిసి ఉండేది. 

ఒకప్పుడాయన తన ఇష్టమయిన గుర్రంమీద ఎక్కి మిత్రులతో వేటకు బయుదేరాడు. అందరికన్నా ముందు ఆయనే ఉన్నాడు. అప్పుడాయన ఒక పనిమనిషి అమ్మాయిని చూచాడు. ఒక్కసారిగా అతని మనసు నేరుగా ఆమెకు బానిస అయ్యింది. పంజరంలో పెట్టిన చిన్న పక్షిలాగ అతని గుండె రెపరెప లాడిరది. మరోమాట అనకుండా ఆమెకు అడిగిన ధర ఇచ్చాడు. 

వ్యవహారం ముగిసేలోగా ఆ అమ్మాయికి అనారోగ్యం మొదయింది. గాడిదమీద ఇవాళ జీనుకొంటే మరుసటి రోజు తోడేళ్లు దాన్ని ఎత్తుకుపోయినట్టు అయ్యింది. అన్నిటికన్నా మంచికుండలో మంచినీళ్లు తెస్తే ఏదో కుట్ర జరిగినట్టు కుండ పగిలినట్టయ్యింది. రాజు దూరదేశా నుంచి వైద్యును రప్పించాడు. మా ఇద్దరి ప్రాణాు మీ చేతుల్లో ఉన్నాయన్నాడు. ఆమె బాగుపడే దాకా నా బతుకు కూడా మిగదన్నాడు. ఆమే నాకు మందు అన్నాడు. ఆమే నా బతుకుకు మెగు అన్నాడు. ఆమెను బాగు పరిచిన వారికి అవిమాలిన నిధును ఇస్తానన్నాడు. 

వాళ్లందరూ కలిసి ఒక్క గొంతుగా ‘మా బతుకును పణంగా పెడతాము, అందరమూ ఆలోచిస్తాము, అందరి సలహాతీసుకుంటాము, ప్రపంచంలోని బాధసు మాన్పడానికే మేమున్నాము. మా దగ్గర ప్రతి గాయానికి మందు ఉంది’ అన్నారు. అయితే వాళ్లు ‘దేవుడు దయ చేస్తే’ అనే మాటలను మాత్రం గర్వం కొద్దీ మరిచారు. కనుక దేవుడు మనిషి చేతగానితనం ద్వారా తనను తాను తెలుసుకున్నాడు. మనిషి మనసులో భావాలు ముఖ్యం అంటున్నాను, పలికిన మాటలు కావు, అది చాలా చిన్న సంగతి. చాలా మంది ‘దేవుడు దయ చేస్తే’ అనే మాటను మరిచిపోతారు. వాళ్ల మనసు మాత్రం కదలకుండానే ఉంటాయి. అటువంటి మనుషులు మందులు తయారు చేసినా, మరొక చికిత్స చేసినా ఆ అమ్మాయికి బాధ పెరిగిందే తప్ప తగ్గలేదు. అమ్మాయి వెంట్రుక కన్నా సన్నబడింది. రాజు రక్తం కన్నీళ్లుగా ఏడ్చాడు. ఇచ్చిన మందుతో అమ్మాయి మరింత జబ్బు పడిరది. బాదాము నూనెతో ఆమె మరీ ఎండిపోయింది. పళ్లు పెడితే ఆమెకు అరగనే లేదు. నీళ్లు తాగితే శాపం అన్నట్టు మంటలు పుట్టాయి. 

ప్రతి నిత్యం మందు పని చేయని తీరు రాజు చూస్తున్నాడు. అతనిక జోళ్లు కూడా లేకుండా మసీదుకు చేరి ప్రార్థించాడు. మూలన చేరి తన భయాలను బయటపెట్టుకున్నాడు. కాళ్లకింది తివాచీని కన్నీళ్లతో తడిపాడు. ఆరళ్ల బాధలోనుంచి అతను మేలుకున్న తరువాత ప్రార్థనకు బదులు పలికిన దైవం ఇలాగన్నాడు. ‘ఓయీ, నీకున్న అన్నిటికన్నా చిన్న కానుక గురించి నీవు పడుతున్న బాధలు వర్ణించడానికి మాటలు లేవు. అవసరంలో ఉన్నప్పుడు దొరికే ఆసరాను మనమెవ్వరమూ పట్టించుకోము. నీవు నాకు రహస్యం తెలుసుగానీ నీకుచెప్పనని నేను అనలేదుగదా అన్నావు!’ రాజు తన గుండె లోతునుండి ఒక్క కేక వేశాడు. కలలో కనిపించిన విషయానికి కదిలిపోయాడు. నిద్రలేచి అతను కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఎదుట ఒక పెద్ద మనిషి నిబడి ఉన్నాడు. ఆయన గొంతు గంభీరంగా ఉంది. అతను ‘అభివందనాలు, నీ కోరిక తీరుతుంది, వినయంగల ఓ రాజా, నీ సాయం కొరకు రేపు ఒక మనిషిని పంపుతాము, అతడిని నమ్ము. అతను అన్ని చికిత్సలు తెలిసిన వాడు. చాలా పవిత్రుడు, విధేయుడు కనుక అతని మాటను అంగీకరించు. ఇక ఆశ్చర్యం నీ వంతవుతుంది. నీవే మెచ్చుకుంటావు, ఆ మనిషిలో దేవుని శక్తిని చూడగలుగుతావు’ అన్నాడు. 

మరునాడయింది, మరో వైద్యుడు వచ్చే వేళయ్యింది. సూర్యుడు వెలిగిపోతున్నాడు. నక్షత్రాలు మాయమయ్యాయి, బురుజెక్కి రాజు ఆత్రంగా చూస్తున్నాడు, రహస్యంగా అందిన హామీ కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. కనిపించే గుంపు చివరలో ఒక గొప్ప మనిషి కనిపించాడు. నీడల మధ్యన సూర్యుడిలా ఉన్నాడతను. అర్థ చంద్రుడిలాగ మాత్రమే అప్పుడు కనిపించాడు. ఉండీలేని దృశ్యాన్ని చూచినట్టుంది. ఆకారం మనసులో మాత్రమే మిగిలింది. ప్రపంచమంతా ఈ రకమయిన శక్తులతో నిండి ఉంది. వాళ్ల సమరాలు, శాంతి ఊహలలోనే ఉంటాయి. వాళ్ల అవమానం, గౌరవం ఊహలలోనే ఉంటాయి. ఆ మనిషి రాజుకు మరింత బాగా కనిపించాడు. మంత్రులను పంపడం కాక రాజు సొంతంగా తానే బయుదేరాడు. అతిథికి ఎదురు వెళ్లి ఆదరం చూపించాడు. కలయిక అనే సముద్రం తెలిసిన ఈతగాళ్లు ఇద్దరు. సూత్రం లేకుండానే వాళ్ల ఆత్మలు కుట్టుకుపోయాయి. ‘ఓయీ, నాకు నీవంటే ప్రేమ. ఆ అమ్మాయిమీద కాదు. నీవు ముస్తాఫావు. నేను నీ ఉమర్‌ని నీకు నేను చేతయిన సేవ చేస్తాను’ అన్నాడాయన. 
రాజు అతిథిని కౌగిలించుకున్నాడు. తప్పిపోయిన నేస్తంలాగ అతడిని ఆదరించాడు. నుదిటిని, చేతులను ముద్దు పెట్టుకున్నాడు. ఇంట్లో వారి క్షేమం గురించి అడిగాడు. ‘భగవంతుని మెగులువు నీవు, అన్ని ఆపదకు అడ్డు నీవు, ఆనందం కలగాలంటే అప్పటివరకు ఓపిక అవసరం. నిన్ను కలిస్తే మాకు జవాబు దొరికింది. చెయ్యి పైకెత్తి చేయవసింది చేయ్యి’ అని అడుక్కున్నాడు.  

వచ్చిన వైద్యుడు జబ్బు పడిన అమ్మాయిని చూచాడు. నాడి పరీక్షించాడు. నాలుకను చూచాడు. లక్షణాలను బట్టి కారణాలను కనుక్కున్నాడు. ‘ఇచ్చిన మందులన్నీ శాపంలా పనిచేశాయి. ఆమెలోని బలాన్ని మరింత పీల్చేశాయి. లోలోపలి కారణాన్ని మీ వైద్యులు చూడలేకపోయారు. చేసిన హానినుంచి దేవుడు రక్షించుగాక’ అన్నాడు. ఆయన అమ్మాయి బాధను అర్థం చేసుకుని వెనుకనున్న రహస్యాన్ని బయటపెట్టాడు. అయితే ఆ సంగతిని వెంటనే రాజు ముందు ఉంచలేదు. ‘కాలే కర్రనుంచి వచ్చే వాసన పొగలో ఉంటుంది. ఆ అమ్మాయి బాధ ఆమె మనసులో ఉంది. శరీరం బాగానే ఉంది. మనసొక్కటే ముక్కలవుతున్నది. ప్రేమలో పడితే గుండె కొట్టుకుంటుంది. అంతకంటే ఆ గుండెకు మరొక బాధ ఉండదు. ప్రేమికుల అనారోగ్యం అన్నిటికన్నా వేరు. అందరూ కోరుకునే ఆనందం అదే’ అంటూ వైద్యుడు అందర్నీ దూరం పంపించి అమ్మాయితో మాట్లాడాడు. ఆమె అన్ని సంగతులు అతని ముందు విప్పి చెప్పింది. 

విషయం తెలుసుకున్న వైద్యుడు రాజుముందుకు వెళ్లాడు. తెలిసిందంతా ఆయనకు వివరించాడు. ‘ఆమె ప్రేమలో పడ్డది. అతగాడిని నీవు వెంటనే రప్పించాలి. ఆమె బాగుపడాంటే ఇంతకంటే మార్గంలేదు. ఆ కంసాలి యువకుడ్ని వెంటనే తెప్పించు’ అంటూ వివరం చెప్పాడు. రాజు సమర్‌ఖండ్‌కు ఇద్దరు మనుషులను పంపించాడు. ఆ అబ్బాయిని వెంటనే తెప్పించాడు. అతగాడు రాజు ముందుకు వచ్చాడు. అమ్మాయిని కూడా రాజు రప్పించాడు. వైద్యుని సహా మీద వాళ్లిద్దరికి పెళ్లి చేయించాడు. ఆరు నెలు గడిచాయి. పనికత్తె మళ్లీ మామూలుగా మారింది. అప్పుడిక వైద్యుడు కుట్రగా కంసాలి యువకునికి ఒక మందు ఏదో ఇచ్చాడు. అతను దినదినం కృంగిపోసాగాడు. అతనిపట్ల ఆమె ప్రేమ కూడా తగ్గసాగింది. అబ్బాయి వికారంగా వెలిసిపోయినట్టు ముసలివాడిలాగ మారిపోయాడు. ప్రేమ అన్నది అందమయిన రూపం మీదనే ముందుగా మొదలవుతుంది. అందుకనే అది తగ్గిపోసాగింది.
అందమయిన ఆ అమ్మాయి మళ్లీ రాజు వద్దకు చేరింది. 

ఈ జరిగినదంతా అన్యాయం అనిపిస్తుంది. అయితే వైద్యుడు దురాశతోగానీ, భయంతోగానీ ఆ పని చేయలేదు. రాజు కోరికను తీర్చడానికి అంతకన్నా కాదు. అదంతా దేవుని ఆజ్ఞ. 

No comments:

Post a Comment