Monday, July 11, 2016

A Story Samaramu-Shanti

సమరము – శాంతి



పక్కింట్లోకి కిరాయకు వచ్చిన వాండ్లు మంచి మనుషుల వోలెనే ఉన్నరు.
పలుకరించుకున్నము. ఆడివాండ్లు నిలవడి గోడ మీదినుంచి మాట్లాడుకున్నరు.
మూడు నెలలయింతర్వాత ఆమె తాళంచేతులు ఇచ్చింది. మేము గూడ ఇచ్చినము.
అప్పుడామె ఒక కుక్కను దెచ్చింది. సింహమంత ఉన్నదది.
దాన్ని సంభాళించాలంటె శేరు దినాలె.
ఆమె మాత్రం దానికి పేరుబెట్టి కుక్కబిస్కట్లుబెట్టి పెంచుతున్నది.
దానికి పుట్టినదినం గూడ చేసింది.
ఆ కుక్క సంగతి మాత్రం పట్టరాకుండ ఉన్నది.
అది దయ్యం మాదిరి ఇల్లిల్లు దిరుగుతుంది. గుంతలు దోడుతుంది.
పిల్లులను దరుముతుంది.
చెట్లను జూచిగూడ మొరుగుతుంది.
ఎంతయినా పక్కింటి వాండ్లయిరి. మేము ఓర్చుకుంటున్నము.
కుక్క రెచ్చిపొయ్యింది. మా తలవాకిట్లో పెంటజేసింది.
నేను దాన్ని ప్లాస్టిక్ సంచిలోకి ఎత్తి వాండ్లింటి ముందర పడేసిన.
మల్తనాడు మా తాళంచేతులు తలుపు కిందినించి మా ఇంట్లోకి వచ్చేసినయి.
తర్వాత వాండ్లింటి చెత్త మా చెట్ల నిండ వడింది.
ఎండలొచ్చినయి. అందరికి తిక్క లేచినట్టుగ ఉన్నది.
కుక్క గుంతలు దవ్వుతనే ఉల్లది.
పక్కింట్లో సందడి బాగ ఎక్కువయింది.
కుక్క మురికిలో దొర్లి, మా యింట్లోకి వచ్చి, మొత్తమంత గత్తర జేసింది.
ఆమెనేమో కన్న చెత్తంత మా యింటి ముందర పారేస్తున్నది.
***
ఒకనాడు ఇంటి ముందర లారీ వచ్చి నిలవడింది.
పక్కింట్లోకి కొత్తవాండ్లు వచ్చినరు.
వాండ్ల దగ్గర కూడ కుక్క ఉన్నది.
కాని, మొరుగదు.
రెండు వారాలు గడిచినయి.
నేను ఒకనాడు తిరుగుతుంటే కుక్క కనవడ్డది.
అది ఇంటి ముందర కాళ్లు బారజాపి పడి ఉన్నది.
నేను కొంచం దగ్గరికి వొయ్యిన.
మియ్యావ్ అన్న.
కుక్క ఒక్కసారి మొరుగుకుంట లేచి నిలవడింది.

***

No comments:

Post a Comment