Thursday, December 15, 2011

Tagore - A Poem


పల్లె పట్టు

ఇక్కడే అతను నాకు మనసుకు దగ్గరవుతాడు
కాలి కింద నేలలాగ మరీ దగ్గరవుతాడు
పళ్లూ పువ్వులలాగ
గాలీ నీరూ లాగ
అంత దగ్గరవుతాడు

ఇక్కడే అతణ్ని నేను ప్రేమిస్తాను కూడా
పక్షుల పాటలలాగ
వాగుల గలగలలాగ
ఉషోదయపు సుతి మెత్తని కాంతిలాగ
తరువుల హరితతని  లాగ ప్రేమిస్తా నేను

ఇక్కడ నాకతనెంతో అందంగా తోస్తాడు
సాయంత్రం అందంలాగ
నిశిరాతిరి నిండుకున్న పువ్వుల పరిమళంలాగ
మంచు తడిసి కొత్తగాలి నిండిన ఉదయంలాగ
ఆకాశంలో నిలిచిన ఒంటరి నక్షత్రంలాగ

ఇక్కడ నా మనసుకతను నచ్చిన వాడవుతాడు
ఆకాశం నుంచి జారు వర్షం బిందువులాగ
రాతిరిలో పట్టిన కమ్మని నిద్దురలాగ
నది నీరూ తరఛాయాలాగ
నా కంటినుంచి జాలువారు వెచ్చని కన్నీటిలాగ

ఇక్కడ నా పాట అలవోకగా సాగుతుంది
అణువణువున దేహంలో నిండిన జీవంలాగ
ఇక్కడతని ప్రేమ నా గుండెల్లో నిండుతుంది



In The Country

Here I get him closest to my heart –
As close is the earth beneath my feet
As are close to me 
The fruits, flowers and the air and water.

Here I love him too
As I love the songs of birds 
The murmur of streams
The mellowness around
The light of dawn and the greeneries of trees.

Here I find him beautiful
As the evening is beautiful
As the fragrance of flowers filling the night
And the dew-drenched morning
With its clean air
And a lone star in its sky.

Here he is dear to my heart
As the rain water dropping from the sky
The sweet sleep of night
The water of rivers
And the cool shade of trees.
Like the tears trickling down my eyes 

Here my song flows with ease.
Here his love fills my heart
As life fills all my limbs.

No comments:

Post a Comment