Sunday, October 9, 2011

The Tree


The Tree

What had remained
Of the birch tree has
Succumbed to gravity, and
The erosive vapors of time.

From my arrival,
I attended to its demise.
First a branch, then a limb.
Until its greening was but memory.

Still, the trunk
Of it stood strong, its
Proud back a perfect curve
Paper bark, bleached by sun.
As is so often the case,
The dying came from
Within it.

I continued to
Offer it my hope, until
Today, in the very week of
Our leaving, sensing winter
In the shortening days.

During the night,
As we slept our last sleep,
It fell to the hill,
Another soul in flight.

The birch tree wishing to be
The birch tree no longer.

చెట్టు

మిగిలిన కొంచెం చెట్టూ
కరిగించే కాలం ఆవిరులకూ
నేల ఆకర్షణకూ
తలవంచింది

నేను వచ్చిననాటినుంచీ
దాని తుది ఘడియలను చూస్తూనే ఉన్నాను
ముందొక కొమ్మా, తరువాత మరొకటి
దాని పచ్చదనం జ్ఞాపకంగా మాత్రమే మిగిలే దాకా

కానీ, బోదె మాత్రం
నిలబడే ఉంది.
గర్వంగా దాని వెన్ను, బెరడుతో సహా
వంపు తిరిగి ఉంది.
ఎండకు రంగు వెలిసింది.
మామూలుగా జరిగే తీరుగనే
దాని మరణం
లోపలి నుంచి వచ్చింది.

వెళ్లిపోయే వారంలో,
కురచనవుతున్న దినాల కారణంగా చలిని
పసిగట్టి, ఇవాళటి దాకా,
దానికి నేను నా నమ్మకాన్ని అందిస్తూనే
ఉన్నాను,

రాత్రిపూట
మేము చివరి నిద్రలో ఉన్నప్పుడు
అది కుప్పకూలింది
మరో ఆత్మ ఎగిరిపోయింది
చెట్టు చెట్టులా ఇక ఏమాత్రం
ఉండదలుచుకోలేదు.

No comments:

Post a Comment