Wednesday, March 2, 2011

You and You!

Here are a few lines that I wrote for a column of mine recently!
These are not exactly my words!

They are good to contemplate on!

నీలో లేనిదేదో, బలహీనత ఏమిటో నీకు తెలిసినప్పుడు నీవు నీవవుతావు!


ఉన్నదానికన్నా ఎక్కువ కోసం ఆశపడకపోతే నీవు సంతృప్తి గలవాడవవుతావు. ధనం గురించయినా అంతే, ఎంత ధనం ఉన్నా సంతృప్తి లేకుంటే అది ఆశ!

అద్దం చూచే అవసరం లేకుండానే సంతృప్తిగా ఉంటే, అందం నీ సొత్తు!

దుఃఖం బరువు కింద నలిగిపోకుండా ఉండగలిగితే దుఃఖంలో కూడా నీకు నీవు, ఎదుటివారికీ ధైర్యం చెప్పగలిగితే నీవు బలంగల వ్యక్తివి!

భయం అన్నది ఎరుగక ముందుకు సాగ గలిగితే మిగతా వారికీ, భయం గురించిన భయం పోగొట్టగలిగితే నీవు ధైర్యంగల వ్యక్తివి.

ఈ ప్రపంచంలోని ఆనందాన్నీ, అందాన్నీ అనుభవించగలిగితే నీవు ఆనందానివి!

నీవు బాధలో ఉన్నా సరే, ఎదుటి వారి బాధను గుర్తించి ఆదుకునే ప్రయత్నం చేయగలిగితే నీవు ప్రేమమూర్తివి!

నీవు తెలియనిది ఏమిటో నీకు తెలిసిందంటే, నీవు తెలివిగల వ్యక్తివి!

నీలోని వెర్రితనాన్ని, నీవు చేసిన తప్పుడు నిర్ణయాలను గుర్తించుకోగలగితే నీవు నిజాయితీగల వ్యక్తివి.

నీవు ఉండాల్సిన పరిస్థితిని పక్కనబెట్టి, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగితే నీవు పెరుగుతున్నావని అర్థం!

గడిచిన కాలంలో పొరపాట్లకన్నా, రానున్ను కాలపు ఆశ గొప్పదనుకుంటే నీవు నిజంగా జీవిస్తున్నావని అర్థం!

నీకు నీమీద నియంత్రణ ఉండి, ఇతరులను నియంత్రించాలనే ఆశ లేకుంటే నీవు స్వతంత్ర వ్యక్తివని అర్థం.

ఇతరులను గౌరవించడమే, నీకు గౌరవం అనుకుంటే నీవు గౌరవం గల వ్యక్తివి!

నన్ను చూచి నీవు నన్నుగా పలుకరిస్తే, నీవుగా మాట్లాడితే నీవు ఆలోచనగల వ్యక్తివి!

ఇచ్చినంత సులభంగా పుచ్చుకోగలిగితే నీవు దానశీలివి.

Great thoughts are forever!

No comments:

Post a Comment