Tuesday, March 15, 2011

Warning - A Lesson!

హెచ్చరిక


తాటిచెట్టు వంటి పొడుగాటి చెట్లెక్కడం ఒక కళ. ఒక పెద్ద మనిషి ఆ కళలో ఆరి తేరాడు. కనుక యువకులంతా ఆయన దగ్గర శిక్షణ పొందాలని వస్తుంటారు. పెద్దాయన చెట్టు ఎక్కడు. ఎలా ఎక్కాలో చెపుతాడు అంతే!

ఒక యువకుడు, మరీ ఎత్తయిన చెట్టెక్కి పైకి పాకాడు. చిటారు కొమ్మను తెగ నరకమంటే నరికాడు. చెట్టు భయంకరంగా ఊగిపోయింది. అయినా యువకుడు భయపడకుండా ఉండి, కిందకు దిగసాగాడు. చెట్టు ఊగుతూ ఉంది.

పెద్దాయన కిమ్మనకుండా చూస్తున్నాడు.

యువకుడు సగం దారికి వచ్చాడు. చెట్టు ఊగడం తగ్గింది. అప్పుడు పెద్దాయన ‘జాగ్రత్తగా దిగు’! అన్నాడు.

ప్రక్కని నిలబడి చూస్తున్న మరొకతను అదేమిటి? జాగ్రత్త అవసరమయిన సమయంలో నోరు మెదపలేదు. కిందకు దూకగలిగే ఎత్తుకు వచ్చిన తర్వాత హెచ్చరిస్తున్నారు?’ అన్నాడు.

‘అదే మరి!’ అన్నాడు పెద్ద మనిషి. ‘ఇక నష్టం లేదు అనుకున్నప్పుడే పొరపాట్లు జరిగేది’ అని బోధించాడు.

=============

మా నాన్న తాగుతూ ఉంటే, నేను పని చేశాను.

- జార్జ్ బెర్నార్డ్ షా

షా నాటక రచయిత. ఆయన ఈ మాట భయంకరంగా తోస్తుంది. కానీ, పచ్చి నిజం! వృత్తం సాగితే అంతా గల్లంతు! అది ఉందని అర్థమయితే దాన్ని తెంచే ప్రయత్నం చేయాలి! అది షా సూచన.

నా పిల్లలు మరీ పనిలో మునిగి బతకాలనుకోను. వారితో కలిసి ఆడుకుంటాను. నేను తేనెటీగను కాదు మరి! అన్నాడొకాయన.

Each moment is a lesson!
&&&&&

No comments:

Post a Comment