Friday, March 25, 2011

How Can You Believe?

Here is a story that teaches a lesson!

We have to learn from the experiences!!

సింహరాజు

అడవికి రాజు సింహం.
అయినా అదీ ముసలిది కావలసిందే.
సింహం ముసలిదయింది. వేటాడడానికి శక్తి లేదు. తిండి దొరకడం లేదు.
శరీర బలంతో సాగనప్పుడు బుద్ధి బలం వాడటం మామూలే.
ముసలి రాజావారు ఒక గుహలో చేరి, అనారోగ్యంగా ఉన్నట్లు పడి ఉన్నారు.
‘అయ్యో! పాపం!’ అని అన్ని జంతువులూ పరామర్శకు వస్తున్నాయి.
అట్లా వచ్చిన జంతువులను రాజావారు హాయిగా భోం చేస్తున్నారు!
అదీ తెలివంటే!
చాలా జంతువులు కనిపించకుండా పోతున్నాయి. నక్కకు సంగతి అర్థమయింది
అది కూడా సింహరాజా వారిని పలకరించడానికి వెళ్లింది.
కానీగుహలోకి పోకుండా బయట నుంచే ‘అయ్యా! ఎలా ఉన్నారూ?’ అన్నది
‘ఏం బాగుండలేదు!’ అయినా నీవెందుకు అక్కడే ఆగినావు? లోపలికి రా! సింహం అన్నది
‘‘అయ్యా! చూస్తే లోపలికి వెళుతున్న అడుగుజాడలు చాలా రకాలు కనపడుతున్నాయి
అందులో పడి, బయటికి వస్తున్న జాడలు లేవు. ఎట్లా రమ్మంటారు?’’ అన్నది నక్క

(తెలివిగల వారు గతాన్ని గమనిస్తారు. పాఠాలు నేర్చుకుంటారు!)



Lion King!

That is the king of the jungle.
But, even he had to age!
Lion was old. No stamina to hunt. Therefore no food.
It is common to use the brains when the body does not help.
Old lion kept lying in a den as if sick!
Other animals took pity and came to visit.
Lion was happily having them for his lunch.
That is brains!

Mnay animals were missing.
The jackal understood tha matter.
He also went to visit the lion Lion King.
But, without enetering the cave, he asked "Sir! How are you?"
"Not really well! But, why did you stop there? Come on in!" said the lion.
"Sir! I can see the tracks that are going into the cave. None coming out! How can I come in?" said the jackal.

Intelligent people look into the past. They learn lessons from there.

Let us enjoy stories that teach us lessons!
########



=============



అసలు మాట!



తిరుగులేని తెలివి అంటే చిన్నతనపు తీరును పెద్దయినా సాగించడమే!... - థామస్‌హగ్జ్‌లే



చిన్న పిల్లలు ప్రశ్నలు అడుగుతారు. అనుమానం లేకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఆ పద్ధతి పెద్దయినా కొనసాగాలి. ‘పెరగడం’ అంటే ‘బాల్యాన్ని’ వదులు కోవడం కాకూడదు, ఆ కుతూహలం కొనసాగాలి!

1 comment:

  1. breezy kalyani in agood voice like sailing on calm seas

    ReplyDelete