Tuesday, March 8, 2011

From the Deep Earth - A Poem

Here is a poem that I tried to translate!

This is a Vietnamese poem!!

భూమితోటి

నీవొచ్చిననాడు ప్రపంచానికి ఊపిరి సంగతి తెలిసింది.
వానపాములకు ఒక్కసారిగ పాట సంగతి తెలిసింది.
భూమి భూమంత ప్రాణంతోటి కదిలి పొయ్యింది.

నా తల్లి నన్ను పిండంగ కడుపులో నెలలు దాచుకున్నది.
నేనేమో ఆ చిన్న ప్రపంచంలో నుసిలి పొయ్యిన.
నా బొంగురు గొంతు లోలోపల గునిసింది.

గాలి నన్ను నీ చేతుల్లో పడేసింది.
నా ఏళ్లలో కాళ్లలో ఆ నొప్పి తెలియాలనే,

నీ చూపుతోని ఆకాశం విచ్చుకుంటది.
సూర్యుడు పొడుస్తడు. పొద్దుగూకాలని మరుస్తడు.
నీవు నన్ను పెదుములకద్దుకుంటవు, ఎద మీదవెట్టుకుంటవు.

మన చేతులు కలుస్తయి, చంద్రునికి, సూర్యునికి, గుట్టలకు, పాటలువాడే సముద్రానికి ప్రపంచం దొరుకుతది.
ప్రేమ నన్ను నీ మనసులోకి కంటది.
నీ మాట తోటి నా లోపల
సంతోషమయిన తలపుల వరదలు
రక్తంలో పొంగుతయి.

నీవూ మన్నే, నేనూ మన్నే
ఒకనాడు, ఒకరిలో ఒకరు కరిగి, నెమ్మదిగ
పచ్చని గడ్డిలో పదిదినాలు ఉండే
పాటలు తెలిసిన వానపాములను ఊహించుతము.

(ఈ కవి పేరు ఎట్ల పలకాలెనో తెలియలేదు.)

From the Deep Earth

The day you came, the world knew how to breathe,
earth worms suddenly knew how to sing,
and the earth's surface trembled with life.

My mother had kept my embryo inside for days and months
where I wriggled, the world too small.
I howl inside of my own hoarse voice.

Wind blows me into your hands, so I feel the pain pierce my fingers and toes.

Your gaze opens the sky.
The sun rises and forgets to set.
You place me on your lips and on your chest.

Our hands join to make a universe for the moon, the sun, the mountains
and the vast singing sea.

Into your heart love gives birth to me,
and your voice breathes
streams of joyful thoughts
into my blood.

You will be soil and I will be soil,
dissolved into each other, quietly one day,
conceiving earth worms who know how to sing
the eternal song of emerald grass.

Translation of "Ngoi Nha Trai Dat."
 
Let us enjoy some good poetry!!
!!!!!

No comments:

Post a Comment