I have started contributing a daily science column in the fifth page of the famous Telugu daily Andhra Bhoomi.
It started appearing in the net version too.
I give here a sampler that appeared in the column yesterday.
The link to the page is given here.
http://www.andhrabhoomi.net/features/science
Visit the page daily for reading about a latest development in the field of science and technology!
In TELUGU that is!!
మొక్కల నుంచి ప్లాస్టిక్ .
- గోపాలం కె.బి.
November 11th, 2010
ప్లాస్టిక్‌లతో కాలుష్యం కలుగుతుందని ఒకవేపు అంటూనే మొక్కల నుంచి ప్లాస్టిక్ తయారుచేసే పద్ధతి గురించి పరిశోధకులు పాటుపడుతున్నారు. సిద్ధాంతం ప్రకారం, పెట్రోలియం ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే రసాయనాలన్నీ మొక్కల నుంచి పొందే వీలుంది. అంటే ఆ రసాయనాలు మొక్కలలో తయారయ్యేట్లు జెనెటిక్ ఇంజనీరింగ్ చేయవచ్చునని అర్థం! కానీ కావలసిన మోతాదులలో మొక్కల నుంచి ఆ రసయనాలను తీయడం ఇంతవరకు సాధ్యం కాలేదు. పారిశ్రామిక స్థాయిలో, కాలుష్యం లేకుండా రసాయనాలను తయారుచేసే పద్ధతికి ప్రారంభంగా యు.ఎస్. ఎనర్జీశాఖ వారు తమ బ్రూక్ హాలెన్ జాతీయ పరిశోధనశాలలో ప్లాస్టిక్ తయారీకి అవసరమయ్యే ఒక రసాయన సమ్మేళనాన్ని మొక్కల ద్వారా తయారు చేయగలిగారు.
పాలీ ఎతిలీన్ వంటి ప్లాస్టిక్‌లను తయారు చేయడానికి ప్రారంభ రసాయనంగా వాడడానికి వీలున్న ఒక రకం ఫ్యాటీ ఆసిడ్‌ను వీరు తయారు చేయగలిగారు. అది రసాయనశాలలో మాత్రం కాదు. మొక్కలలో రసాయనాల చర్యలను ఇంజనీరింగ్ చేసి, ఆ మొక్కలలోనే పెద్ద ఎత్తున రసాయనం పుట్టే పద్ధతిని వీరు సిద్ధం చేశారు.
‘‘ప్లాస్టిక్ తయారీకి ప్రారంభ రసాయనాలు ప్రస్తుతం పెట్రోలియం నుంచి వస్తున్నాయి. బొగ్గు ఆధారంగా తీసిన సింథటిక్ వాయువులను కూడా ఈ పనికి ఉపయోగిస్తున్నారు. కానీ ఈ పద్ధతిలో ఈ రసాయనాలు మొక్కలు, వాటి విత్తనాల నుంచి వస్తాయి. కనుక వాటికి తరిగిపోవడం, దొరకకపోవడం అన్న సమస్యలు ఉండవు’’ అంటారు పరిశోధకులు జాన్ షాంకిన్. మొక్కల నుంచి వచ్చిన ఫ్యాటీ ఆసిడ్‌లను ప్లాస్టిక్ తయారీ ప్రారంభ రసాయనాలుగా మార్చడానికి మరిన్ని పద్ధతులు, మరింత శ్రమ అవసరం. అది త్వరలోనే వీలవుతుందని అంటున్నారు.
మిల్క్ వీడ్ లాంటి మొక్కల విత్తనాలలో ఒమెగా సెవెన్ రకం ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అయితే అవి చాలా తక్కువగా ఉంటాయి. గనుక పారిశ్రామిక సరళిలో ఉపయోగపడవు. ఈ రసాయనాలకు ఆధారమయిన జన్యువులను తీసి వేరురకం మొక్కలలో ప్రవేశపెట్టారు. అక్కడ ఉత్పత్తి మరింత తక్కువగా ఉన్నట్లు గమనించారు. రసాయనం కావలసిన స్థాయిలో తయారు కావాలంటే మొక్కల్లో మరేవో అంశాలను కూడా మార్చవలసి ఉంటుందని అర్థం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ప్రయోగాలన్నీ ఆరాబిడోప్సిస్ అనే మొక్క మీద జరిగాయి. మిల్క్‌వీడ్ కన్నా ఈ మొక్కలో చాలా ఎక్కువగా రసాయనం తయారయ్యేలా పరిశోధనలు చేరుకున్నాయి. ప్లాంట్ ఫిజియాలజీ అన్న ‘ఆన్‌లైన్’ జర్నల్‌లో ఈ అంశాలను ప్రకటించారు. అచ్చులో వివరాల కోసం డిసెంబర్ దాకా ఆగవలసిందే!
If you enjoy reading science in Telugu, my efforts would be worthwhile!
!!!!!!!!
Soory I do not know Telugu
ReplyDeleteHello sir, though I don't know Telugu, I asked one of my friends to read and tell me the gist of it. The article is interesting since it is on a recent research in biotechnology. I am doing BSc in biotechnology.
ReplyDeleteI wanted to know whether this plastic is degradable or not? is it cost friendly?
with regards