Friday, June 4, 2010

Change, A Challenge - The Story of the Changing Waters

మారిన నీరు - మారిన మనిషి

మోజెస్ గురువుగారయిన ఖిధ్ర్, ఒకానొకప్పుడు మానవాళికి ఒక హెచ్చరిక చేశారు. ఒకానొక దినాన, ప్రత్యేకంగా నిలువ చేసి ఉంచినవి తప్ప, ప్రపంచంలోని నీళ్లన్నీ మాయమవుతాయన్నారాయన. తరువాత కొత్తరకం నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తాగినవారికి పిచ్చి ఎక్కుతుంది. అది ఆయనగారి హెచ్చరిక. ఆ మాటలోని అసలు సందేశం ఒక మనిషికి మాత్రం అర్థమయింది. అతను నీటిని సేకరించి, ఒక రహస్యమయిన చోట దాచుకున్నాడు. మిగతా నీటి లక్షణం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూడసాగాడు.


అన్నట్టే ఒక రోజున నదులన్నీ స్తంభించాయి. బావులు ఎండిపోయినయి. ఈ మనిషి సంతోషంగా తను నీళ్లు దాచుకున్న చోటికి చేరాడు. ఆ నీటిని తాగుతూ ఉన్నాడు. ఒకటి రెండు రోజుల్లో తిరిగి జలపాతాలనుంచి నీరు దూకసాగింది. అంటే కొత్త నీళ్లు వచ్చినట్టు లెక్క. ఈ మనిషి, తరువాత అందరిలోకీ వెళ్లి గమనించసాగాడు.

అందరి ఆలోచనలు, మాటతీరు మారినట్టు సులభంగానే గమనించగలిగాడు. వారికెవరికీ గతం గుర్తు లేదు. గురువుగారి హెచ్చరిక అంతకన్నా గుర్తులేదు. ఈ మనిషి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేసి, అందరిచేతా పిచ్చివాడు అనిపించుకున్నాడు. అందరూ ఇతనిని అవహేళన చేశారు కూడా.

అతను చాలా కాలం వరకు కొత్త నీటిని తాగకుండా గడిపాడు. రహస్యస్థలంలో తను దాచుకున్న నీటిని మాత్రమే తాగుతున్నాడు.

కానీ రానురాను అతనికి అందరి మధ్యన ఉంటూ కూడా ఒంటరివాడయిన భావం కలిగింది. తాను అందరిలాగ ఆలోచించడు. అందరిలాగ మాట్లాడడు. అది అతనికి కష్టంగా తోచింది.

చివరకు అతను కొత్త నీటిని తాగాలనే నిర్ణయానికి వచ్చాడు. తాగాడు. అందరిలాగే తానూ మారిపోయాడు.

అతనికి కూడా గురువుగారి హెచ్చరిక, తను నిలువ చేసిన నీళ్లు ఏవీ గుర్తు లేవు. మిగతా వారందరూ ఈ మనిషిని చూచి, “పిచ్చివాని పిచ్చి కుదిరింది లాగుంది. మళ్లీ మామూలు మనిషయ్యాడు!” అన్నారు.

అతనూ అందరిలాగే బతకసాగాడు.



When the Waters Were Changed


ONCE upon a time Khidr, the Teacher of Moses, called upon mankind with a warning. At a certain date, he said, all the water in the world which had not been specially hoarded would disappear. It would then be renewed, with different water, which would drive men mad.


Only one man listened to the meaning of this advice. He collected water and went to a secure place where he stored it, and waited for the water to change its character.


On the appointed date the streams stopped running, the wells went dry, and the man, who had listened, seeing this happening, went to his retreat and drank his preserved water.


When he saw, from his security, the waterfalls again beginning to flow, this man descended among the other sons of men. He found that they were thinking and talking in an entirely different way from before; yet they had no memory of what had happened, or of having been warned. When he tried to talk to them, he realized that they thought that he was mad, and they showed hostility or compassion, not understanding.


At first he drank none of the new water, but went back to his concealment, to draw on his supplies, every day. Finally, however, he took the decision to drink the new water because he could not bear the loneliness of living, behaving and thinking in a different way from everyone else. He drank the new water, and became like the rest. Then he forgot all about his own store of special water, and his fellows began to look upon him as a madman who had miraculously been restored to sanity.

So, Does that mean we have to change to keep up with the world?
?????????

No comments:

Post a Comment