Thursday, April 15, 2010

The Professional - A Story

This is a story by an Argentinian lady!
It is shocking!

Read it for yourself!!

Professional



Normal people fantasize a lot about our work, which is really pretty routine and not at all like what you see in the movies. Our first jobs are perhaps the most memorable. Contrary to popular belief, those of us who are experienced refuse jobs that are uncomfortable, difficult, or unpleasant. These fall, naturally, to the beginners. You can always find a needy kid who’s willing to strangle an old man for a hundred dollars.


I was just a beginner when I sat down in front of my first client, Mrs. Mercedes de Ulloa. I was nervous. Sure, I’d killed before, but always during armed robberies or gang fights. I had one important advantage getting into the profession: I’d never been caught.


I met the lady at night, in her house. Clients hate to deal with us directly, but in this digital age nothing leaves less of a trace than a face-to-face meeting. Absolutely no one could see me enter. She’d leave the door open for me so I wouldn’t have to ring the bell.


The house was full of pictures telling the story of a couple. In them, everyone looked happy. Mercedes was in her study, in the shadows, behind a large walnut desk. She looked old, swollen, blotchy, and she smelled bad, but she was recognizably the woman in the pictures. The whole room had a sickly sweet smell to it. I couldn’t believe anyone would pay money to smell like that. She didn’t waste time. She had half the money right there on the desk.


“I want you to kill my husband. Drown him in the bathtub. An eye for an eye.”


I interrupted her. Her motives didn’t matter.


“Okay,” I said. “In the next couple days . . .”


“Right now. There’s the bathroom.”


This woman’s crazy, I thought. And besides . . . killing someone in a bathtub is a dirty, hard job. You grab them by the ankles and lift up as hard as you can. Usually they can’t hold on and their head goes under. It is true that a drowning person kicks like crazy. But the man was old and I was cocky. Without thinking too hard about it, with the money burning a hole in my pocket, I went into the bathroom. In spite of my misgivings, it was a piece of cake.


My clothes were soaked when I came out. The rest of my money was on the desk. I looked everywhere for my client, but she was gone. Maybe she didn’t want to hear the noises coming from the bathroom.


The old man’s death was easily ruled an accident. Nothing to interest the newspapers. Still, several days later, there was a brief note saying that an old man had had an accident in his bathtub. Alerted by his absence, the neighbors called the police, who found the decaying corpse. The man was a widower and had no children.


No wonder Mrs. Ulloa smelled so bad.






కూలిపని


మామూలు మనుషులు మా పనిని గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ మా పని మాత్రం చాలా మామూలు రకం. అది, మీరు సినిమాల్లో చూచినట్టు మాత్రం ఉండదు. మా మొదటి అవకాశాలు మాత్రం మాకు బాగా గుర్తుండిపోతాయి.అందరూ అనుకున్నట్టుగాక మాలో కూడా అనుకూలం గాని పనులను, కష్టమయిన వాటిని, అంతగా నచ్చనివాటిని అనుభవంగలవాళ్లు ఒప్పుకోరు. ఇవి మామూలుగానే కొత్తవారికి అందుతాయి. ఓ వంద డాలర్లిస్తే, ముసలాడి పీక పిసికేందుకు సిద్ధంగా ఉన్న కుర్రవాళ్లు ఎప్పుడూ దొరుకుతారు మరి.

నేను నా మొదటి క్లయింటు శ్రీమతి మెర్సిడీస్ డీ ఉల్లోవా గారి ముందు కూచున్నప్పుడు నిజంగా పనిలోకి కొత్తగా వచ్చినవాణ్ని. నాకు కాస్త జంకుగా ఉందింకా. అంతకు ముందు కొందరి ప్రాణాలు తీశాను నిజమే. కానీ అది, దొంగతనాలు, గుంపు కొట్లాటల సమయంలో మాత్రమే. ఈ వృత్తిలోకి దిగడంలో నాకు మరో గొప్ప వెసులుబాటు ఉంది. నేనెప్పుడూ పట్టుబడింది లేదు.

నేనావిడను వాళ్లింట్లోనే రాత్రిపూట కలిశాను. క్లయంట్లు సాధారణంగా మాతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ ఈ డిజిటల్ యుగంలో, సాక్ష్యాలు అందకుండా ఉండడానికి, ముఖాముఖీగా కలవడంకన్నా, మంచి మార్గం ఇంకొకటి లేదు. నేను ఇంట్లోకి రావడం ఎవరూ చూచే అవకాశమే లేదు. ఆవిడ నాకోసం తలుపు తెరిచే ఉంచింది. చివరకు, గంట మోగించాల్సిన అవసరం కూడా రాలేదు.

ఇంట్లో ఒక జంటకు సంబంధించిన కథలు చెపుతున్నట్టు బోలెడు ఫొటోలున్నాయి. వాటిల్లో అందరూ ఆనందంగా కనిపించారు. మెర్సిడీస్, నీడగా ఉన్న తన గదిలో మసకచీకట్లో ఒక పెద్ద బల్ల ముందు కూచుని ఉంది. ఆవిడ ముసలిగా, వాచిపోయినట్టూ, ముతకగా ఉంది. కంపుగొడుతున్నది గూడా. కానీ ఆ బొమ్మల్లో ఉన్న మనిషి ఆవిడేనని గుర్తించడం కష్టంగాదు. ఆ గదినిండా ఏదో వికారమయిన తీపి వాసన నిండి ఉంది. అలా కంపుగొట్టడానికి డబ్బులు ఖర్చుకావాలంటే నాకు నమ్మకం కలగలేదు. ఆవిడ ఏమాత్రం కాలయాపన చేయలేదు. సగం డబ్బు అప్పటికే బల్లమీద పెట్టి ఉంది.


“నువ్వు నా భర్తను చంపాలి. బాత్ టబ్బులో ముంచేయాలి. ఎంతకు అంత జరగాలి!”


నేను అడ్డు తగిలాను. ఆవిడ కారణాలతో నాకు పనిలేదు మరి.


“సరే! మరో రెండు రోజుల్లో...”


“ఇప్పుడే. అదుగో బాత్ రూము”


‘పిచ్చి ఆడది!’ అనుకున్నాను నేను. పైగా ఒకర్ని బాత్ టబ్బులో చంపడమంటే, మురికి, కష్టంతోగూడుకున్న పని. కాళ్లను పాదాల దగ్గర పట్టుకుని, మనిషిని చేతయినంతగా, పైకి ఎత్తాలి. మామూలుగానయితే వాళ్లు తట్టుకోలేరు. తల నీళ్లలో మునుగుతుంది. అలా మునిగి పోతున్న మనుషులు చాలా గట్టిగా కాళ్లూ చేతులు కొట్టుకోవడం మామూలే. కానీ ఈ మనిషి ముసలతను. నాకదే బాధ. ఇక సంగతి గురించి మరీ ఆలోచించకుండా, జేబులో డబ్బులను గుర్తుంచుకుని, పనిలోకి దిగాను. నా అనుమానం మాట అటుంచి, పని అలా అలా ముగిసి పోయింది.


నేను బయటికి వచ్చే సరికి నా దుస్తులు తడిసి ఉన్నాయి. మిగతా డబ్బులు సిద్ధంగా బల్లమీద ఉన్నాయి. నేను నా క్లయింటు కోసం అటుఇటు చూచాను. కాని ఆవిడ వెళ్లి పోయింది. బాత్ రూములోంచి వచ్చే చప్పుళ్లను వినదలుచుకోలేదేమో!


ముసలతను ప్రమాదవశాత్తు చచ్చాడని నిర్ణయించడం కష్టంగాలేదు. వార్తా పత్రికల్లో రావడానికి అంత అదేమీ, ఆసక్తికరమయిన సంగతిగా లేదు. ఒక ముసలతను ప్రమాదవశాత్తూ బాత్ టబ్బులో చచ్చాడని చాలా రోజుల తర్వాత రాశారు. అతను కనిపించకపోయే సరికి పక్కింటి వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్లకు కుళ్లిన శవం దొరికింది. ఆతను ఒంటరి మనిషి. పిల్లలూ లేరు.


ఉల్లోవా కంపుగొట్టిందంటే ఆశ్చర్యం లేదు మరి!

ఆనా మారియా షువా

ఆర్జెంటీనా రచయిత్రి

For many more original and stories in translation please visit my web pages.
http://vijagopalk.tripod.com/
 
Let us enjoy good works of words!!

No comments:

Post a Comment