రాగమయీ
రావే నాలో సగభాగమయీ
అలమటిస్తున్న నా హృదయానికి
అమృతవర్షిణీ రాగమయీ
చిరునవ్వులనూ చిందించీ
చిలుకపలుకులతొ కరుణించీ
చెప్పవచ్చుగద నీదాననని
కీరవాణి అనురాగమయీ IIరాగమయీII
మవునంలో నను ముంచావూ
కలవేమో అనిపించావూ
చెప్పవచ్చుగద నేనున్నానని
కోకిలవరాళి రాగమయీ IIరాగమయీII
For many more lyrics of mine visit my web pages at
http://vijagopalk.tripod.com/
$$$$$$$$
No comments:
Post a Comment