Friday, February 26, 2010

Tao te ching by Lao Tsu


Some say that my teaching is nonsense.


నా బోధనల్లో అర్థం లేదంటారు కొందరు

Others call it lofty but impractical.

మరి కొందరు గొప్పగా ఉంది కానీ పనికి రావంటారు.

But to those who have looked inside themselves, this nonsense makes perfect sense.

కానీ, తమలోకి తాము తొంగి చూడగలిగిన వారికి మాత్రం, ఈ అర్థంలేని సంగతుల అర్థాలు తెలుస్తాయి.

And to those who put it into practice, this loftiness has roots that go deep.

ఇక వాటిని ఆచరణలో పెట్టినవారికి, ఈ ఔన్నత్యం వేళ్లు మరింత లోతయినవి.

I have just three things to teach: simplicity, patience, compassion.

These three are your greatest treasures.

నేను చెప్పేవి మూడే పాఠాలు. సింప్లిసిటీ, ఓపిక, ప్రేమ. మూడున్నూ మీకు గొప్ప నిధులువుతాయి.

Simple in actions and in thoughts, you return to the source of being.

పనుల్లోనూ, ఆలోచనల్లోనూ సింప్లిసిటీ ఉంటే మీరు అస్తిత్వపు మూలాలకు చేరుకుంటారు.

Patient with both friends and enemies, you accord with the way things are.

మిత్రులూ, శత్రువులతోనూ ఓపికగా ఉంటే, విషయాలున్న పరిస్థితి మీకు అర్థమవుతుంది.

Compassionate toward yourself, you reconcile all beings in the world.

ఇక మీ మీద మీకే ప్రేమ ఉంటే, ప్రపంచంలోని అన్ని జీవుల మీదా మీకు ప్రేమ ఉంటుంది. సర్దుకు పోగలుగుతారు.

No comments:

Post a Comment