Monday, February 1, 2010

Lakshman Aelay

లక్ష్మణ్ ఏలె

నాకు ఈయనతోని పరిచయము లేదు.
అట్లంటని అందరితోని ఉన్నదని గాదు.
శానమంది తెలుసు.
శానమందికి నేను తెలుసు.
అందుకే ఈయన తెలియడని చెప్పుతున్న.

కాని శానదినాలనించి ఈయన ఏస్తున్న బొమ్మలను చూస్తున్న.
శాన బాగ అనిపించినయి.
వాటి నిండ పల్లెతనము కనిపించింది.
ఆ మట్టి వాసన కనిపించింది.
అందుకే మనసుకు దగ్గరయినయి ఆ బొమ్మలు.

ఈ మొదటి బొమ్మ నిజానికి ఒక ఇన్విటేషన్ మీద ఉన్నది.
లక్ష్మణ్ కదిరేనిగూడెము అనే ఊర్ల పుట్టినడు.
ఆ ఊరి తీరు గురించి బొమ్మలేసినడు.
వాటిని ప్రదర్శనకు పెట్టినప్పుడు ఏసిన కార్డు మాద ఎనికి దిక్కు ఈ బొమ్మ ఉండింది.
ఈ ప్రదర్శన 1999లో జరిగింది.
అప్పటినుంచి ఈ బొమ్మ నా దగ్గర ఉన్నది.

అప్పుడీ కంప్యూటరు లేదనుకుంట. ఉన్నా స్కానరు లేదేమొ.
కొన్ని దినాలు ఈ బొమ్మ నా టేబులు దగ్గర గోడకు అతికించి పెట్టిన.
ఇటువంటి వస్తువులు ఇట్ల ఎన్ని దాచుకున్ననో లెక్కలేదు.
వాటికంత సర్పరాయి సామాను అని ఒకపేరువెట్టుకున్న.
ఆ ముచ్చట మళ్లెప్పుడన్న చెప్పుకుందము గాని.

ఇప్పుడు దాన్ని మరిన్ని బొమ్మలను సంతోషంగ అందరికి చూపాలని ప్రయత్నము.
అంటే ఇవి ఇంకెవరి దగ్గర లేవని గాదు. ఎవరూ చూడలేదనిగాదు.
నాకు నచ్చిన బొమ్మలను అందరికి పంచే పనిపెట్టుకున్న గనుక.

(Click on the pictures to see them in big size)
This is an exceptionally talented artist who crept on the ladder of popularity at a great speed based only on his talent and grit. There is the element of originality in his works and it is no exaggeration if said that ther is no show in the country today without a painting of Lakshman.

Here is a write up in Telugu on Lakshman that appeared in a publication called Mana Telangana.
I found it in the recent Hyderabad Book Fair.

We shall have more of his works once again in a later post.
Let us enjoy good works of art!
#########

No comments:

Post a Comment