Tuesday, February 16, 2010

200 and Not Out!


కవిత్వాన్ని కవులే చదువుతరని ఒక వాదం ఉండేది.
ఇప్పుడసలు కవితలు తగ్గిపోయినయని నాకనిపిస్తుంది.
బ్లాగులను మిగిత బ్లాగర్లు మాత్రమే చదువుతరని నన్ను కొందరు హెచ్చరించినరు.
నాఅనుభవం ఇంకొక రకంగ ఉన్నది.
నా బ్లాగుకు రకరకాల వారిని రప్పించే పని నేను చేయాలె.
ప్రపంచంలో చాల మంది, చాల తెలివి గలిగిన వారు గూడ, ఈ ప్రపంచం గురించి తెలువకుండ ఉన్నరంటే అతిశయోక్తి గాదు.
ఇదేదో గొప్ప అని నేనూ అనుకోలేదు.  కాని, ఇందులోని గొప్పదనం మిగతా మీడియాల్లో లేదని మాత్రం చెప్పగలను.
నేను మాత్రం గోడదిక్కు మళ్లి ఈ వర్చువల్ ప్రపంచంలో బతుకుతున్నాను.
ఇందులో తెలుగు తక్కువ. ఉన్న తెలుగులో తెలివి తక్కువ.

మనం రాసింది ఎంత మంది వింటున్నరన్నది రేడియోలో తెలిసేది కాదు.
పత్రికల్లో కనీసం సబెడిటర్లన్న చదువుతున్నరన్న నమ్మకం కలిగేది కాదు.
టెలివిజన్లో రాసింది చాల వరకు పేరు లేకుండనే వచ్చింది.
వాటిని ఎవరు చూస్తున్నరన్న సంగతి పట్టించుకునే ప్రయత్నం కూడ చెయ్యలేదు.
మొదట్లో కాదుగానీ టెలివిజన్ రాత ఎక్కువగ పైసల కొరకు చేసిన కూలి.
అయినా మనసు పెట్టకుండ రాసే పద్ధతి లేదు గనుక అక్కడకూడ రాతలో నా ఆనందం నాకు మిగిలింది.
బొమ్మ చూడకుండ రాసినా, కాకి అంటే కాకి వస్తుంది, పిట్ట అంటే పిట్ట వస్తుంది అన్న మిత్రుణ్ని మరవలేను.

నా వెబ్ సైటును చాలకాలంగ పట్టించుకున్నది లేదు. అయినా చాలమంది వచ్చి చూస్తున్నరని లెక్కలున్నయి.
అందులో నూటికి మించి పేజీలయినయి. కనుక చదివేటందుకు చాలనే ఉన్నదక్కడ.

ఇంక ఈ వెర్రిబ్లాగుల వ్యవహారం సాగుతున్నది.
ఇదేదో బ్లాగు పడదమని చేస్తున్న పనే గాని బాగుపడదమని మాత్రం కాదు.
ఈ బ్లాగులను ఎవరూ చూస్తులేరంటే అబద్ధం. నూర్ల మంది చూస్తున్నరన్నా అబద్ధం.
కడుపులోని సంగతులను కడుపులోనే దాచకుండ బయట పెట్టేటందుకు ఇదొక పద్ధతి.

నిత్యం ఈపేరున చదవాలె. ఇంకేదో పని చేయాలె. అది బాగుంది. కనుక బ్లాగుంది.
కలకాలంగ దాచుకున్న సంగీతాన్ని, పుస్తకాలను, బొమ్మలను, భావాలను పంచుకునేందుకు ఇదొక పద్ధతి.
ఇది బాగుంది. కనుక బ్లాగుంది.

అందరూ బ్లాగుపడాలని, కనీసం ఇటువంటి మసాలా ఉన్న మనుషులన్న బ్లాగు పడాలని ఈ నడుమ అందరినీ పోరుతున్న.
పైస ఖర్చులేకుండ మన సంగతులు ప్రపంచానికి పంచేందుకు ఇంత మంచి పద్ధతి లేదు.
ఇవాళకాకపోతే రేపన్న ఎవరో చూస్తరు.
లేకపోతే పోని. చెప్పదలుచుకున్నది చెప్పినమన్న సంతృప్తి మనకయితే మిగిలింది గద.
కనుకనన్న అందరు ఈ విద్య నేర్చుకోవాలె.
నాకు తెలువకుండనే 200 పోస్టులు అయినయిక్కడ.
బ్లాగు బ్లాగు. లెస్సగనున్నది.

ఇక్కడ చదివేటందుకే గాక వినేందుకు సంగీతం, కంటికింపయిన పెయింటింగులు కూడ ఉన్నయి.
అయితే, ఇంకా ఇంకా వైవిధ్యం కావాలె.
ప్రయత్నం చేసే ఓపికె ఉన్నది. చేస్త.
వచ్చి చూస్తున్న వారందరికి దండాలు. రాని వారికి రెండు దండాలు.

This is the 200th post in my Lokabhiramam, the counter says.
I have consciously made it a bilingual blog.
I am aware that not all people coming here are able to read Telugu.
That is not my intention either.
Telugu papers and magazines write about Telugu people and things Telugu.
Telugu radio and TV always cater to the Telugus with only the content about Telugu.
I am always of the opinion that there should be an exchange of material between language groups.
With the diversity in languages, we Indians do not exactly know, what people of the next state are doing or thinking.
There is no scope and chance to read about the world in Telugu.
We don’t see much content about the world in Telugu and about things Telugu in world media.
I am pleasantly surprised that many non Telugus visit my web pages and blog.
Some of them almost demanded me to make entries in English so that they can also follow what I am trying to bring to the table.

Had I made it an exclusively Telugu blog, I would have attracted many more visitors.
But, there is a hitch. All of them will, invariably, be Telugus. I would be partly at least carrying coals to New Castle.

I am not really worried about numbers.
I could make friends with people from across the globe, both Telugus and others.

I know there has to be better content here. The same stuff will not sustain the blog.
Tell me what you would like me to add!!
I am game!!
I am ready to make the necessary effort to make this a meaningful exercise.
Thanks to those who visited!
Welcome to all those who are yet to come!!

All are my friends! I am only yet to meet some of them!!

**********

No comments:

Post a Comment