మారథాన్ పరుగుపోటీ ప్రత్యేకత ఏమిటి
పరుగు పందాలు రకరకాలుగా ఉంటాయి. వందమీటర్ల నుంచి మొదలయి, కిలోమీటర్ల దాకా పరుగెత్తడం, అడ్డంకుల మీదుగా ఎగురుతూ పరుగెత్తడం మామూలుగా ఉండేవే. అంతటితో తృప్తి చెందక ఊరిమీదపడి దారులంట, అడవులంట పరుగెత్తే క్రాస్ కంట్రీ పరుగులు మొదలు పెట్టారు. మనిషి, శ్రమకు తట్టుకునే శక్తికి నిజమయిన పరీక్షలు ఈ పరుగులు. ఇవి ఎక్కువ దూరం ఉంటాయి. అందులో మారథాన్ అనేది 26 మైళ్ల పైన ఉంటుంది.
1896లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లోనే మారథాన్ మొదలయింది. అప్పట్లో ఆ పోటీ అందరికీ నచ్చింది. ఆ పోటీలో పాల్గొని ఆనందంతో తిరిగి వచ్చిన బోస్టన్ క్రీడాకారులు 1897లో బోస్టన్ మారథాన్ ను నిర్వహించారు. అప్పటినుంచి ఆ పోటీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో నడుస్తూనే ఉన్నాయి. ఒలింపిక్స్ వచ్చేది నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే. అది అనువయిన ప్రదేశంలో లేకపోతే ఈ పోటీ చాలా కష్టమవుతుంది. బోస్టన్ మాత్రం చల్లనైన ప్రదేశం. అక్కడ పరుగు పెట్టడం సరదాగా ఉంటుంది.
మారథాన్ పరుగు 26 మైళ్ల 385 గజాలుగా 1908లో నిర్ణయమయింది. అందుకు కారణం మాత్రం చాలా విచిత్రమయింది. పోటీ ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాలి. అందరూ చూడడానికి అనువుగానూ, గౌరవకరంగానూ ఉండేచోట అది ముగియ గలగాలి. 1908లో ఒలింపిక్స్ లండన్ నగరంలో జరిగాయి. అక్కడ మారథాన్ విండ్సర్ కాసిల్ దగ్గర మొదలయింది. తిరిగి వచ్చి, స్టేడియంలో రాణీ, రాజూ ఉండే రాయల్ బాక్స్ ముందు ముగించాలని నిర్ణయించారు. ఆ రెండు స్థలాల మధ్యన ఎంపిక చేసిన దారి 26 మైళ్ల 385 గజాలు ఉంది. అయితే 1921 తర్వాతే ఆ దూరాన్ని పోటీకి స్థిరంగా నిర్ణయించారు. ప్రతిచోటా సరిగ్గా అంతే దూరం దారి వెతకడం కష్టం.
1896లో జి గ్రిగరే అనే అతను మారథాన్ పోటీ గెలిచాడు. అతను ఆ దూరాన్ని 3 గంటల 45 నిమిషాల్లో పరుగెత్తి చేరుకున్నాడు. నిజానికది చాలా ఎక్కువ సమయం. అదే సంవత్సరం ఒలింపిక్స్ లో స్పిరిడాన్ లూయీ 2 గంటల 58 నిమిషాల రికార్డుతో పోటీ గెలిచాడు.
ఈ మధ్యన మారథాన్ రెంటు గంటల కొన్ని నిమిషాలలో పూర్తి చేస్తున్నారు.
అది సమావేశం కానీ, చర్చలు గానీ తెగకుండా గంటలపాటు సాగితే మారథాన్ అనడం అలవాటు. అంటే, నిడివి ఎక్కువని అర్థం.
I wish this article may be given in English which will help us understand not only to me but also others who follow this site does not understand all regional languages
ReplyDeleteregards
bhaskaran from chennai