Wednesday, December 23, 2009

A Question

If you ask a question, you will probbaly find an answer.
This is the philosophy in which I believe very strongly.
I remember when my son was very young I travelled on one day with him in a bus.
The journey took two hours or a little more.
We were spending time without much of awareness about what we were doing.
We were about to reach the destination.

Then a gentleman sitting next to us on the three seater gently said something.
Believe me, I was not even aware that there was a man noticing us.
The gentleman said, "Sir, Your son is very intelligent and you ahve a lot of patience."
He said that the boy went on asking questions and I went on answering him!

That is the best a father can do perhaps!
Let us ask questions!

Now, a question and an answer to it!

తెలుగు భాష, సంస్కృతి లేకుండా పోతాయా?


ప్రపంచంలో చాలా భాషలు, సంస్కృతులవారు ఈ ప్రశ్నను తమ భాష, సంస్కృతులను గురించి అడుగుతున్నారు. ఒకాయనను ఆట పట్టించడానికి ‘కోడినిస్తే తింటావా?’ అని అడిగారు. ‘ఓ తింటానన్నాడతను!’. ‘శాకాహారివి గదా! ఎట్లా తింటావూ?’ అని అడిగితే, ‘అమ్ముకు తింటాను!’ అన్నాడట. తెలుగు భాష, సంస్కృతీ ఎక్కడికీ పోవు. కాకపోతే మారిపోతాయి. మారిషస్ వెళ్లిన రంగడు, రింగడయినట్లు, ఇప్పటి తెలుగు తెలిసినవారికి ఇది తెలుగేనా అనిపించే భాష సంస్కృతి వచ్చేస్తాయి.

సంస్కృతి అంటే మాట, తిండి, కట్టూ, బొట్టూ, ఆచారాలూ, వ్యవహారాలూ, వగైరాలన్నీ. తరతరాలుగా ఇవన్నీ కొనసాగుతూ, ఒక ప్రజలకు ఒక గుర్తింపును తెచ్చిపెడతాయి. అది అందరి తెలివి,జ్ఞాపకశక్తి ఆధారంగా ముందుకు సాగుతుంది. వెనకట ఒక్కో పండుగ ఒక్కోలాగ ఉండేది. ఇప్పుడు అన్ని పండుగలూ (ముఖ్యంగా నగరాల్లో) ఒకేలా ఉంటున్నాయి. ఇక గతాన్ని చూడని వారికి, ప్రత్యేకతలను గురించిన తెలివిడి ఉండదు. జ్ఞాపకాలు అంతకన్నా ఉండవు.

జీవుల్లో కొన్ని రకాలు అంతరించి పోయినట్లే, సంస్కృతులు కూడా అంతరించి పోతున్నాయి, అంటున్నవారు ఉన్నారు. వారు, మారిన పద్ధతులను పాత పద్ధతులకు ప్రతినిధులుగా గుర్తించడానికి ఇష్టపడరు. వారిని తప్పుపట్టడానికి లేదు. సంస్కృతిలోని వైవిధ్యానికి గుర్తింపులు చాలా ఉన్నాయి. మతం వాటిలో ఒకటి. భాష అన్నిటికన్నా ముఖ్యమయినది. భాష మారుతుంటే, మొత్తం సంస్కృతి అదే దారిన పోతున్నదనవచ్చు.


కొన్ని భాషలు తామరతంపరగా పెరుగుతున్నాయి. (తామరతంపరంటే తెలియనివారు జాగ్రత్త!). విజ్ఞానం, వ్యాపారం, రాజకీయం, మొదలయినవాటితో బాటు, వసుధైక కుటుంబకం పేరున ఇంగ్లీషూ (మమ్మీ, డాడీ) దినదినం పెరుగుతున్నాయి. మిగతా భాషలు దిగజారుడు వేపున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో మాట్లాడుతున్న ఆరువేల భాషలలో సగానికి ఎక్కువ, మరుసటి దశాబ్దాలలోనే మైయమవుతాయని అంతరిస్తున్న భాషల నిధి అధికారి, డగ్లస్ వేలెస్ అన్నారు. సగం భాషలను ఇప్పటికే ఒక్కొక్కదాన్ని పదివేల మందికన్నా ఎక్కువ మాట్లాడడం లేదు. అవి సులభంగా మాయమవుతాయి. పావు వంతు భాషలను వెయ్యి మంది మాత్రమే వాడుతున్నారు. అవింకా సులభంగా పోతాయి. తెలుగు ఈ రెండు వర్గాలలోనూ లేదని గమనించాలి. న్యూజీలాండ్ లోని మవోరీ వారు తమ భాషను నిలబెట్టుకోవడానికి ప్రత్యేకంగా బడులు పెట్టుకున్నారట.

తెలుగు మారిపోతున్నది అని గోల పెడుతున్న నాలాంటివారు ఇంకొందరున్నారు. మీకుకూడా అది నిలబడితే బాగుండును అన్న భావం కలిగితే, తెలుగు ఎక్కడికీ పోదు.

Will the Telugu language and culture disappear?

Culture comprises of the language, food habits, accoutrement, practises and traditions etc. These things continue to exist and impart an identity to a population. Based on the intellect and the memory these practises continue the culture.

As Freedman often says, in the name of globalisation these boundaries are being gradually erased.

There are certain parameters of a culture. Religion is one among them. Language is the main feature. If the language is changing, we can say that the culture also is following the same trajectory. There are certain languages which are growing at fast pace. Along science, technology, business etc. English is growing. There are six thousand languages being spoken in the world now. Half of them are used by not more than ten thousand people. Such languages will disappear. Another quarter of languages are being used by just a thousand people. They will disappear much more easily. Telugu is not figuring in this list. It is being spoken by a large number people.

Telugu will not go anywhere. But, it changes so much that people like me who pine about the changes in the language will wonder whether what is being spoken is their own mother tongue.

If you have also had similar feelings about your mother tongue, it will sure continue, in some form or the other!!
@@@@@@@@

No comments:

Post a Comment