Wednesday, October 21, 2009

A page from the diary


I wrote these lines on 30th October 1999.


I am sure I have changed my stand.


I have shared my brain with many, including you now!!



మెదడును పొట్లం కట్టి మంచం కింద దాచుకున్నాను.

ఏ పత్రికకూ పంపించలేదు.

బజార్లో పంచనూ లేదు.

మెదడును కుదువపెట్టి నెలకింత తెచ్చుకు తిందామని ప్రయత్నం

వాళ్లు నామెదడును అరగదీసి గంధంగా నాకే పూస్తున్నారు.

పైగా అది కంపు అంటున్నారు

అరగదీయడం మాత్రం మానడం లేదు.

అంతేగాదు, అమ్ముడవుతుందనుకున్న మెదడు, అంతంతకూ లోపల డొల్లయి పోతోందని అనుమానం కలుగుతున్నది.

కళ్లు ముక్కు చెవులనుంచి వచ్చే సందేశాలను అందులో నింపుకుంటుంన్నదేగానీ

తిరిగి బయటకు రానీయడం లేదు

అందుకే మెదడును పొట్లం కట్టి మంచం కింద దాచేశాను.

కదలడం తెలిసిన మెదడు మధ్యరాత్రెప్పుడో మంచాన్ని కుదేసినట్లుంది.

ఉలిక్కి పడి నిద్ర లేచాను

మెదడు నిశ్శబ్దంగా నవ్వుకున్నదని నాకనుమానం.

సందేహం తీర్చుకుందామంటే ఆలోచన నాదగ్గర లేదు.

అది లేందే ప్రశ్న లేదు.

ప్రశ్నించనిదే జవాబు రాదు.

అంతకు ముందటి ప్రశ్నలు జవాబులు మెదడులో కలగలిసి పోయి, చిక్కు పడిన దారంలా కనబడుతున్నాయి.

విప్పాలంటే విచక్షణ నాదగ్గర లేదు.

చెప్పింది చేయడం మాత్రమే తెలిసిన కండరానికీ, నాకూ ఇప్పుడు తేడా లేదు.

ఒకప్పుడు చెప్పకుండానే గుండెలా విరామం లేకుండా కొట్టుకునే వాడిని

ఇప్పుడు పేస్ మేకర్లో బలం తగ్గి బరువుగా కదులుతున్నాను.

ఇలాంటి కండరానికి ఇక మెదడుతో పని ఏమిటి?

అందుకే మెదడును పొట్లం కట్టి మంచం కింద దాచుకున్నాను

సందేహం తీర్చుకోవాలని అనిపించడం లేదు.

దాన్నిరిమోట్ కంట్రోల్ తో కదిలిస్తున్నారనీ, చదివేస్తున్నారనీ నా అనుమానం

నిద్దరొస్తున్నది.

మెదడు కుదిపేస్తుందేమోనని భయం.

అందుకే నిద్దరొస్తున్నది.

కండరం నిద్రపోతుంది.

మెదడు నిద్రపోదు.

జాగ్రత్త.


I have bundled my brain in a packet and hidden it under the cot.

I have not sent it to any magazine.

Not even distributed in the market.

The effort is to pawn the brain and get some monthly income.

But they are grinding my brain into paste and anointing me with it.

Moreover they say it stinks!

Still they continue to grind it.

What I thought will be sold, is getting empty inside, I doubt.

It is filling itself with the messages received from the eyes, nose and the ears and not letting anything out.

Only hence, I have bundled it and hidden under the cot.

Brain, that knows to move, looks like shook the cot in the middle of the night.

I was shaken out of sleep.

I doubt that the brain laughed silently.

To clear my doubt,

I do not have the ideas with me.

Without them there is no question.

No answer comes forth without a question.

Earlier questions and the answers are mixed up and are looking like a tangled mass of thread.

To untangle it I do not have the discrimination with me.

There is no difference between me and a muscle that only obeys a n order.

At one point of time I used pulsate like a heart without any command.

Now, the pacemaker has grown week and I am ticking very weak.

What has such muscle got to do with the brain?

Only hence, I have bundled up the brain and hidden it under the cot.

I have doubt that someone is manipulating with a remote control and playing with it.

I do not have the urge to clear the doubt.

I am sleepy.

I am afraid that the brain will shake me up.

That is why I am sleepy.

Muscle goes to sleep.

Mind would not.

Beware!

1 comment:

  1. Mee medadu potlamlo imidetanta chinnadikaadu.Daani paridhi visaala viswamanta.samudramlo eeta kottevaadini chembulo eeta kottamante elaavuntundo mee medadu potlamlonche prapanchamantaa vichhukuntoo vuntundi khaayamgaa.all the best

    ReplyDelete