Wednesday, November 19, 2008

A page from the diary

10-02-00

నాయకత్వంలో మంచి ఆనందం ఉంది. ఆ నాయకత్వం అందరికీ ఆమోదయోగ్యమయితే మరింత ఆనందకరంగా ఉంటుంది. మంచి ఆలోచన కలగడం ఒక ఎత్తు. దాన్ని పదుగురి ముందు పెట్టగలగడం మరొక ఎత్తు. అలా బయటకు వచ్చిన ఆలోచనలను బేరీజు వేసి, ఎవరినీ నొప్పించకుండా మెత్తమెత్తని చీవాట్లు వేస్తూ, అందరినీ ముందుకు తీసుకు పోతుంటే....., చిన్నప్పుడు రైలాట ఆడుతుంటే, ముందుండే వాడికేగదా, కూ! అనే అవకాశం, దారి నిర్ణయించే అవకాశం.....! ఇక్కడా అంతే!
అందుకే అందరూ ఆ నాయకత్వం కోసం నానా అగచాట్లు పడతారు. దాన్ని నెరపలేక అభాసుపాలవుతారు. అందరి చేతా తిట్లు తింటారు. నాయకత్వానికి కావలసింది, సత్వర స్థిర నిర్ణయశక్తి, చొరవ, పటిమ లాంటివి. ఇవి వయసుతో కొంత వస్తాయేమో గానీ, సహజంగా వచ్చేవే ఎక్కువ.

నేనెప్పుడూ పెరుమాండ్లను నాకుగా, నా కొరకు ఏదీ కోరి ఎరుగను. తిరుపతిలో వెంకన్న ముందు నిలబడి, మా వెంకన్నకు నోటి పూత తగ్గించమని, అందరూ సుఖంగా ఉండేలా చూడమని అడిగిన వాణ్ణి. సింహాచలంలో కప్పస్తంభం అని ఒకటి ఉంటుంది. దాన్ని కావిలించుకుని కోరిక కోరమన్నారు. నేను కోరుకున్నాను. ఇది స్వార్థము. ఆనందము నిండిన కోరిక. తీరుతుందేమో. (తీరలేదని నేను చెపితే, నరసింహుడేమనుకుంటాడో). చందనంలో దాగున్న స్వామి నన్ను కొంత ప్రభావితుడిని చేశాడు. (అప్పట్లో) పూజార్లు మాత్రం పూజార్లే, మారరు.

గుళ్లోగానీ, ఇంట్లోగానీ, దేవుని ముందు పెట్టే దీపం పేరు మాకు తిరువళికె. అది తమిళంలోని తిరువిళక్కునకు పట్టిన గతి. (లేదా మార్పు). ఒంట్లో తమిళం లేదు. ఒక తరం పోతే, ఇంట్లోనూ మిగలదు. దేవుని దీపం అనగూడదు. పెరుమాండ్ల తిరువళికె అనాలె. తమిళులం. కన్నడ ప్రాంతం నుంచి వచ్చి తెలుగు నాట బతుకుతున్నాం. ( సంగతి మా వారెవరూ ఒప్పుకోరు!). గుర్తింపు మాత్రం తెలుగు వారిగానే మిగిలింది.

My goodness! I had ideas about leadership even when I was not exactly teaching it! I was practising it at that point of time. I was reasonably good leader then. This is not just my judgement but many people endorsed the idea. Why then I left that very comfortable job? The question is who was comfortable? Everybody else except me! I never wanted to be a boss! I joined all India Radio, thinking that I will be a producer, doing creative work all through the life. I was having people like Bhradwaja in my view. They enjoyed their job! Of course the official rigmarole makes such people uncomfortable. Then there is compensation in the form of putting your creativity to best use. How many people in this world can throw their ideas on to the world like a media man does?
Then AIR has sucked! It literally chased me away!
Am I happy after that? Yes and No! It depends. If I had stayed there itself, I would have been a very different person. I do not have any complaints about that department even today. It is only people who make or break the institutions.

So, this was the day I chaired the Co-ordination meeting at Vizag. We all went to Simhachalam. I thought I did a mistake to visit a Vaishnavite temple in an official manner and dress. I asked God for some small favour. He never gave it to me! He had different plans for me. I welcomed it! No regrets!
I am used to take life as it comes!

Talking of temples I became aware of some terminology. I commented about the Tamil terms still in use in our households. They are transformed so very much that we ourselves do not recognise the fact that we follow Tamil culture. In fact some of our people hate Tamil and Tamilians.
Funny!

No comments:

Post a Comment