Wednesday, November 5, 2008

A page from the diary

9-02-00
I sound very nostalgic and not very much happy with the situations in my musings written long back. There is no better person to invite change than me. I have always been keeping ahead of times. There are not many from my class who are savvy with a computer or internet. This is only an example.
In many things, I have the reputation of being a mixture of both old and new. When Andhra Prabha weekly was looking for an editor with a modern approach, they very much stopped with my name. I remember them saying that Gopal is a man with his heart in the past and mind in the future. My tastes are equally distributes in all the time lines. Classical musicians like many others keep lamenting about the falling standards. I see it as change.
In this entry there are more than one thing to comment upon. On that day perhaps, as usual, I was thinking about many things at once.
I have written about keeping the mind clean.
I have also talked about the milk processing in the past. Yes. Old methods are a favourite subject of mine. No qualms on that.

చిత్తము నిర్మలమయితే ఎదుటివాడు కుత్సితుడయినా నిర్మలుడుగానే కనబడతాడు. కొంతవరకు ఫరవా లేదుగానీ, ఆసాంతం అదే నయితే, చివరకు దారి గుంటలోకి చేరుస్తుంది. అలాగని నిరంతరం అందరినీ మన శతృవులుగానే భావిస్తూ, అందరినీ అనుమానిస్తూ కూడా గడవగూడదు.
ఈ భావం తరుచు చెప్పుకోవలసి వస్తున్నది.
(తరువాతి రాతకూ, పై మాటలకూ సంబంధం లేదు.)
దాలిగుంత అని ఒక ఏర్పాటు ఉండేది. అది అనారోగ్యానికి కూడా కారణమయ్యేదని ఇప్పుడనిపిస్తుంది గానీ, ఆ కాలపు పెరుగు గుర్తుకు వస్తే, ఏదీ ఆ కాలం అని ఆవేదన మొదలవుతుంది. నేలలో ఒక గుంట ఉంటుంది. అందులో పిడకలు పేర్చి, మధ్యలో ఒకటి రెండు నిప్పు కణికలు వేసి ఉంచాలి. కొంచెం రాజుకున్న తర్వాత పాలకుండ దాని మీద పెట్టి మీద చెక్క బోర్లించాలి. ఆ పాలు వెచ్చదనానికి నెమ్మదిగా కాగి, కాగి గోధుమరంగుకు దిగేదాకా చిక్కబడతాయి. సాయంత్రం కల్లా అడుగున వేడి పోతుంది. అప్పుడు పాలలో అక్కడే తోడు వేసి వదలడం. ఇక ఆ పెరుగు రుచి చెప్పనలవి గాదు. (ఆ లోపలి పొగకు, రుచికి ఏదో సంబంధం ఉందని ఇప్పుడనిపిస్తున్నది.)
ఈ కాలంలో లాగ మిల్క్ బాయిలర్స్, గ్యాస్ పొయ్యిలు, యు ఎచ్ టీ పాలు ఇవన్నీ లేవుగద. అంతా సావకాశంగా నడిచేది గద.
ఆరోగ్యం సంగతి ఎట్లున్నా, బ్రతుకు నాణ్యత గురించి, నిజంగా చర్చించవలసిన సమయమిది.
విభేదాలు అలుక్కుపోవడం, సంస్కృతి విషయంలోనయితే, ఎవరికీ ప్రత్యేకంగా గుర్తింపు మిగలదు.

No comments:

Post a Comment