Wednesday, September 10, 2008

My musings

ఆలోచనా లోచనాలు

మరో సారి తెల్లవారిందని అసంతృప్తి

మనం కూడా పడక వదలాల్సినందుకు అసంతృప్తి

పిల్లలింకా లేవలేదని అసంతృప్తి

పని మనిషి రాలేదని అసంతృప్తి, వచ్చిందనీ అసంతృప్తి

పులుసుసో ఇంగువ మింగలేక అసంతృప్తి

అందరూ వెళ్లిపోయి ఇల్లు ఖాళీ అయిందని అసంతృప్తి

తాళం వేయాల్సి వచ్చిందని అసంతృప్తి

బస్టాపులో బజ్జీల బండివాడు కంగాళీ తిండి అమ్ముతున్నాడని, తినని నాకు అసంతృప్తి

నా పని నేను చేయాలని అసంతృప్తి

మిగతావారు తమ పని చేయడం లేదని అసంతృప్తి

ఎవరో ఏదో అన్నారని అసంతృప్తి

ఎవరూ ఏదీ అనలేదని అసంతృప్తి

నిజానికి, ఈ ప్రపంచానికి కావలసింది మన అసంతృప్తి

దాన్ని ఇంత సులభంగా పంచిపెడుతున్నామని అసంతృప్తి!!

No comments:

Post a Comment