Saturday, September 20, 2008

2-2-00 A page from the diary

ఈ ప్రపంచం ఒక ప్రవాహం లాంటిది.
జనులంతా సందడిగా ఊరేగింపులాగ సాగి పోతుంటారు.
వారిలో కలిసి, వారి మధ్యలో, వారి వేగంతో నడుస్తూ ఉంటే, వాళ్లతో ఉండవచ్చు.
చుట్టుపట్ల వాళ్లు నిన్ను గమనించనూ వచ్చు.
ఒక్కడుగు పైకి ఎగిసి, ఒక్క వెలుగు వెలిగితే, మరింత మంది వీ వేపు చూస్తారు.
నీవే వెలుగు బావుటావై, వేగంగా అందరికన్నా ముందు నడిస్తే, మిగతా గుంపంతా నీవెంట బుద్ధిగా నడుస్తారు.
పరుగు తీస్తారు.
అంతేగానీ,
నడిచే జనసందోహం సంగతి పట్టకుండా,
నీచోట నీవు నిలబడితే, వేలు పట్టుకుని ముందుకు నడిపించే వాడెవడూ ఉండడు.
ప్రవాహం ముందుకు కదిలి, నీవు వెనకబడి పోతే, ఉన్నావా, లేవా, అని వెను దిరిగి చూచే, ఓపికా, తీరికా ఏ ఒక్కరికీ ఉండదు.
ముందుంటావో, మధ్యనుంటావో, నీ అంతకు నీవు మిగిలి పోతావో, అంతా నీ ఖర్మ.
మైనంపాటి భాస్కర్ వచ్చి, నీవు మేధావివి అన్నాడు.
అప్పుడు నేనతనికి చెప్పిన మాటలివి.

No comments:

Post a Comment