People come and people go.
There are only a few people who make a difference.
Even among them, there are only a handful, who are loved by all.
Pandit Bhimsen Joshi was (Oh! My God!) one such Giant!
I heard him with the adoration of a student.
Was it happening because he wanted to excell in music?
I feel music chose him to excell itself!
I was in tears when the news came of the end of a journey.
How many noticed that he passed away on Pushya Bahula Panchami?
As a tribute, I bring you here my most favourite song by Joshiji!
Bhagyada Lakshmi!
Many people who do not even know Kannada sing it!
It is different when the Master sings it!
A tearful adieu Master!
!!!!!!!
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, January 24, 2011
Sunday, January 23, 2011
Unbroken by Laura Hillenbrand
You are asked to introduce a book.
You cannot do it without reading it!
What do you do?
The same thing many people do!
Look for the book on the net.
I did the same.
What abook!
Written by someone who cannot even move from home.
About a person who has seen the worst of life.
I always feel why such books do not come in our langauages.
I recommend translation of the book seriously!
అన్బ్రోకన్
రచన: లారా హిలెన్ బ్రాండ్
పేజీలు: 473
ప్రతులకు:
రాండమ్ హౌస్ పబ్లికేషన్స్
ఇది కల్పన కాదు. కథ అంతకన్నా కాదు. ఒక సచిత్ర జీవితయాత్ర. పుస్తకానికి ఇచ్చిన సబ్ టైటిల్ చదివితే విషయం అర్థమయిపోతుంది. A World War-II Story of Survival, Resilience and Redemption.
రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవారు రోజుకు 700 మంది చొప్పున చనిపోతున్నారట. వారితో ఇలాంటి కథలన్నీ మరుగున పడుతున్నాయి. లారా హిలెన్ బ్రాండ్ అలాంటి ఒక యుద్ధవీరుడు లూయీ జంపెరీనీని కలిశారు. అప్పుడాయన వయసు 80 సంవత్సరాలు. ప్రస్తుతం 93. అంటే ఇంతకాలమూ వారు కలవడం, కబుర్లు కలబోసుకోవడం, కథనానికి కావలసిన సామగ్రి సమకూరడం లాంటివన్నీ జరిగాయన్నమాట.
రచయిత్రి జంపెరీనీతో 75 సార్లు మాట్లాడారు. ఇందులో ఒక చిత్రం ఉంది. ఈ రచయిత్రి స్వయంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇంటికి అతుక్కుని ఉండే మనిషి. అందుకే ఆమె తన పరిశోధనకు వస్తువయిన వ్యక్తిని కలిసింది తక్కువే. మిగతా అంతా ఫోను సంభాషణల ద్వారా, చర్చలు జరిగాయన్నమాట.
ఇదంతా పుస్తకం రాయడానికి, నిజమయిన పద్ధతి కాదేమో అనిపిస్తుంది మనకు. అందుకే ఈ పుస్తకాన్ని మరింత ఆసక్తిగా చదవాలి.
రచయిత్రి గురించి: లారా హిలెన్ బ్రాండ్, 1967 మేలో పుట్టారు. గ్రాడ్యుయేషన్ అయ్యేలోగానే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి రావడంతో ఇల్లు చేరుకున్నారు. ప్రస్తుతం కూడా ఆమె ఇల్లుకదలకుండా వాషింగ్టన్లో ఉంటారు. ఆమెకు 2008లో కాలేజీ మిత్రుడు, ప్రస్తుతం ప్రొఫెసర్ అయిన బోర్డెన్ ఫానగాన్తో పెళ్లయింది.
లారా తొలిరచన ‘సీ బిస్కెట్’ ఎంతో గొప్ప పేరు పొందింది. ఈ పుస్తకానికి ‘స్పోర్ట్స్ బుక్ ఆఫ్ ది ఇయర్’ బహుమతి 2001లో వచ్చింది. అవును! అదే ఆశ్చర్యం. ఈ పుస్తకం సీ బిస్కెట్ అనే రేసుగుర్రం గురించిన రచన. ఆ గుర్రం, దానితో సంబంధంగల వారు అలవిమాలిన, అసంభావ్యమయిన విధంగా జీవితాలు గడపడం రచయిత్రికి గొప్ప ఆకర్షణ అయిందట. మొదట్లో ఈ విషయం కేవలం ఒక వ్యాసంగా వచ్చింది. అందరూ చాలా బాగుంది అన్నారు. అందుకని నవలగా వచ్చింది. తరువాత అదేపేరుతో సినిమగా వచ్చింది. అన్నీ గొప్ప హిట్టే అయినయి.
హిలెన్ బ్రాండ్ రెండవ పుస్తకం ప్రస్తుతం మనం చర్చించుకుంటున్నా ‘అన్బ్రోకన్!’ ఒక కదలలేని మనిషి ‘పరుగు పందాల గుర్రం గురించీ, జీవితంతో నిజంగా పోరాడి గెలిచిన మనిషి గురించీ, రాసి అవుననిపించుకోవడం అద్భుతం!’ నా ఊహల్లో నేను సీ బిస్కెట్ మీద దౌడు తీశాను. లూరుూతోబాటు పరుగెత్తాను’ అంటారు లారా హిలెన్బ్రాండ్.
అన్బ్రోకన్:
1943 మే నెలలో జంపెరీనీ తన బి-24 విమానంతో సహా పసిఫిక్‌లో కూలాడు. ఏడువారాల పాటు (ఇంకా ఎక్కువేనేమో?) తను, తన పైలట్ ఒక తెప్పమీద గడిపారు. రెండువేల మైళ్ళ ప్రయాణం తర్వాత నేల తగిలింది. అది జపానువారి ఖైదీల క్యాంపని తేలింది. అక్కడ రెండేళ్ళపాటు రకరకాల చిత్రహింసలకు గురయ్యాడతను. ఆ వివరాలు చదివితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జపాను వారి క్రూరత్వం కర్కశంగా కనబడుతుంది.
మనకు ఈ సరికి కథానాయకుని మీద కావలసినంత జాలి పుట్టేసింది కదూ? అతను చిన్నప్పుడు బాలనేరస్తుడు. దొంగతనాలు చేసి పట్టుబట్టాడు. పోలీసుల నుంచి తప్పించుకునే పేరుతో పరుగుల వీరుడయ్యాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో అతను అయిదువేల మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్నాడు. హిట్లర్ ఇతని గురించి ఏదో అనుకున్నాడట కూడా. ఇతను నాలుగు నిమిషాల్లో మైలుదూరం పరుగెత్తేవాడట. కోచ్ ఇతడిని చూసి ‘నీకన్నా వేగంగా పరుగెత్తేది, సీ బిస్కెట్ ఒకటే’ అన్నాడట. (!)
యుద్ధం వచ్చింది. జంపెరీనీ సైన్యంలో చేరాడు. విమానం కూలింది. ఉన్న 11 మందిలో ముగ్గురు మాత్రమే మిగిలారు. అనుకోకుండా తెప్పమీద వాలిన అల్బట్రాస్ (పక్షు)లను పట్టి తినడం నేర్చుకున్నారు వారు. దాడికి వచ్చిన సొరచేపను కూడా ఒకటి, రెంటిని చంపి తిన్నారు. వర్షం వస్తే మంచినీరు దొరికింది. ముగ్గుర్లో ఒకతను చనిపోయాడు. చిత్రంగా వీళ్లు ఆ శరీరాన్ని సముద్రంలోకి తోశారు. తినలేదు! ఊహల్లోనే వంటలు చేసి తింటూ, చివరకు శత్రుస్థావరానికి చేరుకున్నారు ఆ ఇద్దరూ!
అతను ఒలింపిక్ వీరుడు. అందుకే శత్రువులు అతడిని చంపకుండా వదిలారు. కానీ చిత్రహింసలకు గురి చేశారు. తరువాత అతని జీవితం మరింత నాటకీయంగా సాగింది. తాగుడు, పాడయిన సైకాలజీ. మరి ఎలా బాగయ్యాడు? ఈ విషయాలన్నీ ఎలా చెప్పగలిగాడు. తరువాతి కథ వెండితెరపై చూడడానికి ఆశించవచ్చేమో? అందాకా పుస్తకం వెదకండి!
జంపెరీనీతో సరదాగా ‘సీ బిస్కెట్’ మాట్లాడలేక పోయింది. నేనే మేలు. కనీసం మాట్లాడగలను అన్నాడుట. లారా సంవత్సరాల పాటు అన్నిమార్లు అతనితో మాట్లాడవలసి వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. రేడియో, టీవీ ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలను కూడా ఆమె స్టడీ చేసింది.
పుస్తకంలో అక్కడక్కడ తప్పులున్నాయి అనిపిస్తుంది. అది సమాచారం అందించిన లూయీ లోపమా? రాసిన లారా లోపమా? ఇద్దరిదీనా? చర్చ అనవసరం.
జీవితంలో చెప్పరాని బాధలు అనుభవించి, మనిషి కాకుండా పోయిన మనిషిచేత బతుకు పుస్తకం తెరిపించి, పుస్తకంగా అందించిన ఈ రచయిత్రిని అభినందించకుండా ఉండలేము.
ఇలాంటి రచనలు చేసే ప్రయత్నం ఎంతమంది చేశారు?
మచ్చుకు ‘అన్ బ్రోకన్’ నుంచి నాలుగు మాటలు..
- ఆగస్టు 25న జెపెలిన్ సాన్ ఫ్రాన్సిస్కో చేరింది. (ఇదొకరకం విమానం అనవచ్చు). తీరం వెంట అందరూ అరుస్తూ ఆహ్వానం పలికారు. అది అస్తమయంలోకి జారుకుంది. ఆ చీకటి, నిశ్శబ్దాలలోకి జారుకుంది. అర్ధరాత్రిలోకి జారుకుంది. కదిలే గాలిలాగే నెమ్మదిగా అది టొరిన్స్ మీదుగా ఎగిరింది. అక్కడ దాన్ని పట్టించుకున్నది, నిద్రమత్తులో తూగుతున్న కొందరు మాత్రమే. అందులో గ్రామర్సీ వీధిలో ఇంటి వెనకాల నుంచి చూస్తున్న పజామా తొడిగిన అబ్బాయి ఒకడు.
-ఏర్షిప్ కింద నిలబడ్డ, అతని కాళ్ళకు గడ్డికీ మధ్యన చెప్పుల్లేవు. అతను స్ణాణువయ్యాడు. అది భయంకరంగా, అందంగా’ ఉందన్నాడతను. విమానం ఇంజన్ రొద గాలిని కుదుపుతున్నట్లు ఉంది. కానీ చీకట్లో దాని వెండిరంగు శరీరం కనబడడం లేదు. పక్కలు, తోక కూడా కనబడడం లేదు. అది ఉన్న ప్రాంతపు చీకటి మాత్రమే కనబడింది. was not a great presence, but a great absence ఈ వాక్యాన్ని ఏమని అనువాధం చేయాలి!)
- అతనికి ఒకటంటే మాత్రం భయం. లూయీ కుర్రవాడుగా ఉండగా, ఒక పైలట్ తన విమానాన్ని టూరాన్స్లో దించాడు. లూరుూని అందులో ఎక్కించుకుని ఒక చుట్టు తిప్పాడు. అంత చిన్న కుర్రవాడు ఆ అనుభవంతో బ్రహ్మానంద పడిపోయి ఉంటాడని అందరూ అనుకోవచ్చు. కానీ ఆ ఎత్తు, వేగం అతడిని భయంలో ముంచాయి. ఆ రోజు నుంచి అతను ఇక విమానాల జోలికి వెళ్లకూడదు అనుకున్నాడు.
Let us enjoy great books!
!!!!!

Thursday, January 20, 2011
Madurai Mani Iyer - Disc
Shravanam with Bhairavi!
Let us enjoy some great Music!
Sri Madurai Mani Iyer - Bhairavi, Charukesi etc., Disc
Let us enjoy some great Music!
Wednesday, January 19, 2011
Prof. N. Gopi
Gopi is a friend for long.
His place Bhongir was the connection then.
I worked at that place for a short period.
The Telugu language is the second link.
His research on Vemana made him a famous man.
His poetry went place from place.
He became Dr Gopi.
Then he became Prof Gopi.
Then he became the Vice Chancellor of the Telugu Unversity.
Interestingly, Gopi remained what he was!
A Friend!
This book, a volume published on the occassion of his Sixtieth birthday, is a fine tribute to my friend.
There are articles by many frinds there.
I partcularly like the piece by a common friend, Prof. Kishan Rao.
It is really touching.
I thought I salute my friend by bringing the piece to my blog page.
Intrestingly Mrs Aruna, Gopi's wife, was featured in my blog earlier.
She is a fine poet too!
Let us enjoy some good books!
()()()()()()()()

Friday, January 14, 2011
Monkey Business This?
Not at all!
They keep company when I am alone!
Somehow they never disturb us though they are around a lot!
Let us enjoy some good company!
PPPPPP

Wednesday, January 12, 2011
Rooms and Gardens - A Polish Poem
Rooms and Gardens
They will greet you with mysterious
smiles, those who were there before you.
Later, when new ones arrive, you will already
know it all.
You will welcome them with the same smile and
show them in.
With a sweeping gesture you will present
the freshly made beds and the expansive view of the gardens.
At last, when they will have composed themselves a little,
you will explain
where they are and what the future has in store for them.
గదులూ గార్డెన్సూ
వాళ్లు నిన్ను అర్థం కాని చిరునవ్వుల్తో పలకరిస్తారు.
అదే, నీకన్నా ముందు అక్కడ ఉన్న వాళ్లు.
తరువాత, కొత్తవాళ్లు వచ్చినప్పుడు,
నీకు సంగతంతా తెలిసే ఉంటుంది.
నీవు వాళ్లను అదే చిరునవ్వుతో ఆహ్వానిస్తావు,
లోనికి రమ్మంటావు.
ఒక్కసారి చెయ్యి చాచి,
శుభ్రమయిన పడకలనూ
కనిపించే తోటల విశాల దృశ్యాలనూ వాళ్లకు చూపిస్తావు.
చివరకు వాళ్లు సర్దుకున్న తరువాత,
నీవు వాళ్లకు,
వాళ్లెక్కడ ఉన్నదీ, ముందు ముందు జరగబోయేదీ
చెపుతావు.
గ్రెగోర్ రోబ్లేవ్స్కీ పోలిష్ కవితకు
ఇంగ్లీషు అనువాదం, ఆగ్నియేస్కా పోకోస్కా
తెలుగు - విజయగోపాల్
Grzegorz Wróblewski, born in 1962 in Gdansk and raised in Warsaw, has been living in Copenhagen since 1985. He has published nine volumes of poetry and two collections of short prose pieces in Poland; three books of poetry, a book of poetic prose and an experimental novel (translations) in Denmark; and a book of selected poems in Bosnia-Herzegovina, as well as a selection of plays. His work has been translated into
eight languages.
Let us enjoy poetry!
%%%%%%
Monday, January 10, 2011
Puttaraj Gawai - Harmonium
Shravanam in the New Year!
Read about this saintly muiscian who passed away recently!
http://sangeetyogashram.org/puttarajgawai.shtml
http://puttarajgavaiji.com/dr_Puttaraj_gawaiji.html
Let us enjoy some great music!!
@@@@@@
Sri Puttaraj Gawai - Harmonium - Hindustani
Read about this saintly muiscian who passed away recently!
http://sangeetyogashram.org/puttarajgawai.shtml
http://puttarajgavaiji.com/dr_Puttaraj_gawaiji.html
Let us enjoy some great music!!
@@@@@@
Saturday, January 8, 2011
What The Dog Saw!
Happy New Year Friends!
I was taking a kind of break from the blogging activity!
I am sure I am back again!
Can you believe Telugu News Papers and Magazines started writing about English books?
The following is one such article written by me recently!
Here you go!
It is about the Book "What The Dog Saw!" by Malcom Gladwell.
What The Dog Saw!
బ్లింక్ అని ఒక పుస్తకం. ఫుట్‌పాత్‌ల మీద కూడా అమ్ముతున్నారు. రచయిత మాల్కం గ్లాడ్వెల్. మనుషులు క్షణాల్లో విషయాలను అర్థం చేసుకుని క్షణాల్లో నిర్ణయాలు చేయడం గురించి పరిశోధించి రాసిన రచన యిది. ఇది కథకాదు నవల కాదు వ్యాసాల పరంపర. చదువుతూ ఉంటే ఎంత బాగుందో అంత కష్టంగానూ ఉంది. ఆ ఆలోచనలను అందుకోవడం క్షణంలో మాత్రం వీలు కాదు. కానీ ఆలోచింపజేసే పుస్తకం! అదే రచయిత రాసిన సరికొత్త పుస్తకం ‘వాట్ ద డాగ్ సా’ మరో వ్యాసాల సంకలనం.
రచయిత:
పుస్తకం గురించి తెలుసుకునే ముందు ఈ రచయిత గురించి కొంచెం తెలుసుకోవడం అవసరం. గ్లాడ్వెల్ 1963లో లండన్‌లో పుట్టాడు. తండ్రి యూనివర్శిటీలో ప్రొఫెసర్. తల్లి జమైకాలో పుట్టిన స్ర్తి. గ్లాడ్వెల్ పుట్టింది ఇంగ్లండ్లోనయినా, పెరిగింది మాత్రం కెనాడాలో. టూరం టో యూనివర్శిటీలో చరిత్ర చదువుకున్నాడు. తర్వాత యు. ఎస్.కు చేరి పత్రికా రచయితగా పనిచేశాడు. వాషింగ్టన్ పోస్టుకు సైన్స్, వ్యాపారాలను గురించి రాశాడు. తర్వాత న్యూయార్క్‌లో ఫ్రీలాన్సర్‌గా రాశాడు. చివరకు స్టాఫ్ రైటర్‌గా చేరాడు. గ్లాడ్వెల్ మొదటి పుస్తకం ‘టిష్పింగ్ పాయింట్’. కొన్ని ఆలోచనలు అంటువ్యాధులలాగ ఎందుకు వ్యాపిస్తాయి? అన్న విషయం గురించి రాసిన పుస్తకం పాఠకులకు అంటువ్యాధిలా అంటుకున్నది. తర్వాతి పుస్తకం ‘బ్లింక్’. అది కూడా అంతర్జాతీయంగా పేరు పొందింది. మూడవ పుస్తకం ‘ఔట్లయర్స్’. మనుషులు సాధించే విజయాల మీద వాతావరణం, సంస్కృతీ చూపించే ప్రభావాల గురించి ఈ పుస్తకంలో చర్చించిన తీరు అద్భుతమన్నారు పాఠకులు.
వరుసబెట్టి బెస్ట్ సెల్లర్స్‌ను అందించిన రచయిత మరో పుస్తకం వెలువరించాడంటే అందరూ ఆసక్తిగా చదవడంలో ఆశ్చర్యం లేదు. మాల్కం గ్లాడ్వెల్ ‘ద న్యూయార్కర్’ పత్రికలో రాసిన వ్యాసాల పరంపరలో కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ వ్యాసాలన్నింటిలోనూ ఒక పద్ధతి ఉంది. ప్రతి వ్యాసం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. కానీ చూస్తుండగా విషయం మారిపోతుంది.
పుస్తకం:
‘వాట్ ద డాగ్ సా’ ముందుమాటలో మాల్కం గ్లాడ్వెల్ ‘ముత్యాలు’ కొన్ని....
Let us enjoy some good reading!!
$$$$$$$

పుస్తకంలోని వ్యాసాలను మూడు భాగాల కింద చూడవచ్చు. మొదటిది మైనర్ జీవియసెస్! తెలివిగలవాళ్ళే. కానీ గొప్పవారు కాదు. రెండవ భాగంలో ‘సమస్యలకు సమాధానాల’ గురించి వాటిని వెతికిన మనుషుల గురించి వ్యాసాలున్నాయి. అర్థంకాని విషయాలు, రహస్యాలకు మధ్య తేడాను చర్చించే వ్యాసాలు ఈ వరసలో ఉన్నాయి. చివరిభాగం తెలివి. వ్యక్తిత్వాల గురించిన చర్చలతో సాగింది. తెలివి చిన్నతనం నుంచే బయటపడుతుందా, లేక కొంత శ్రమ తర్వాత కనిపిస్తుందా? అన్న అంశాన్ని ఈ భాగంలో విశే్లషిస్తాడు రచయిత. అన్ని వ్యాసాలు, ఒకే రకమయిన ఆసక్తిని రేకెత్తించలేదు. నిజమే గానీ, అంశాలను మారుస్తూ రకరకాలుగా వివరించిన తీరు మాత్రం హాయిగా ఉంటుంది అన్నారు విమర్శకులు.
మూడవ భాగంలోని ఒక వ్యాసంలో ఇద్దరు రచయితల ప్రసక్తి వస్తుంది. వారు బెన్ పౌంటెయిన్, జొనాతన్ సఫ్రాన్ ఫోయర్లు వారిద్దరి మధ్యన ఏ రకంగానూ పోలిక లేదు. వీళ్లిద్దరినీ లేట్ బ్లూమర్స్ (ఆలస్యంగా వికసించిన పూలు) అంటాడు గ్లాడ్వెల్. హయితీకి 30 సార్లు తిరిగి, నానా కష్టాలు పడి రచయిత అనిపించుకున్నాడు పౌంటెయిన్. ఫోయర్ మాత్రం 19ఏళ్ల వయస్సులో ఒక్కసారి మాత్రం ఉక్రేన్ దేశానికి వెళ్లివచ్చి అద్భుతమయిన పుస్తకం రాసేశాడు. పాల్ సెజాన్, ఎమిలీ జోలాలను కూడా ఈ వర్గంలోనే చేరుస్తాడు గ్లాడ్వెల్.
ప్రతి వ్యాసంలోనూ సంభాషణలుంటాయి. అవి పాఠకులను సులభంగా ముందుకు నడిపిస్తాయి. చెప్పదలచిన విషయాలను సూటిగా చెప్పకుండానే పాఠకుడి తలకు ఎక్కించడం ఇక్కడి పద్ధతి. ఒక దానికొకటి వ్యతిరేకంగా ఉండే అంశాలను ఎంచుకుని, చర్చించి, చివరకు వారు అనుకున్న విషయాన్ని ముందుకు తేవడంలో రచయిత, చూపిన ఒడుపు తిరుగులేనిది.
గ్లాడ్వెల్ పుస్తకాలన్నింటికీ కవర్‌పేజీలు ఒకేలాగ ‘సింపుల్‌గా’ ఉన్నాయి. రంగులు, హంగులకు దూరంగా, నేరుగా విషయంలోకి దూకడానికి అవి సూచికల్లాగ ఉంటాయి. ప్రస్తుతం వచ్చిన పుస్తకంలో తేడా, ఇవన్నీ పత్రికలో అచ్చయిన వ్యాసాలు. అన్నిట్లోనూ ఒకటే శైలి. విషయంలో తేడా ఉన్నా, నిర్మాణం ఒకే లాగ ఉంటుంది. కుక్క అరుపు గురించి చెప్పినా మనిషి మనసు గురించి చెప్పినా ఒకే తీరు. ఇలా ఇదివరకే ‘బాగున్నాయి’ అనిపించుకున్న వ్యాసాలను ఒకచోట చేర్చడంలో తెలివి ఉందా? ‘హిట్టయిన పాటలన్నీ ఒక సీడీలో తెస్తే తెలివి ఉందా?’ అని జవాబు
వాటర్‌గేట్ పరిశోధన, క్యాన్సర్ పరిశోధన, ఒసామా కోసం వేట లాంటి అంశాలను గురించి ‘ఓపన్ సీక్రెట్స్’ అంటూ చెబితే బాగుంటుంది. ఎంతో బాగుంటుంది. ‘ఓడిపోవడం ఒక కళ’ అని వ్యాసం రాస్తే తప్పకుండా బాగుంటుంది. ఎక్కడా ఒక పక్షంవేపు మొగ్గులేదు. ప్రతి సంగతి గురించీ శాస్ర్తియమయిన చర్చ మాత్రమే ఉంటుంది. రచయితకు, పాఠకుడికి కూడా శ్రమ తెలియదు. హెయిర్‌డైల గురించిన ప్రకటనల్లాంటి అంశాలతో మొదలుపెట్టి, మరో విశాలమయిన విషయాన్ని వివరించగలగడం ఈ రచయితకున్న ప్రతిభ. తాను ప్రవేశపెట్టిన అంశాన్ని చివరకు తానే కాదనడం ఈ రచయిత బలం.
ఇంతకూ ఈ పుస్తకంలో ఎక్కడయిన కుక్క కనిపించిందా? అది ఏం చూడగలిగింది? జవాబు చెబితే బాగుండదు. ఎవరికి వారే తెలుసుకుంటే బాగుంటుంది. ఈ పుస్తకం ఫుట్‌పాత్ మీద దొరికేదాకా ఆగకూడదు. వీలయినంత తొందరగా దీన్ని వెలుగులోకి తేవాలి. పత్రికల్లో వ్యాసాలు రాసేవాళ్ళందరూ ఈ పుస్తకాల్ని ‘స్టడీ’ చేయాలి.
‘వాట్ ద డాగ్ సా’ ముందుమాటలో మాల్కం గ్లాడ్వెల్ ‘ముత్యాలు’ కొన్ని....
నాకు తరచూ ఎదురయ్యే ప్రశ్న. నీకీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని! దానికి నేనెన్నడూ సరిగా జవాబు చెప్పలేదు. కొందరు నాకు రకరకాల సంగతులు చెప్పడం గురించి, ఎడిటర్ హెన్రీ ఇచ్చిన పుస్తకంలో ఆలోచన వచ్చిందనీ, లేదంటే అసలు నాకే సంగతి గుర్తు లేదని ఏదో చెపుతూ ఉంటాను. ఈ వ్యాసాలను ఒక చోట చేరుస్తూ, ఆ ప్రశ్నకు జవాబు వెదుకు దామనుకున్నాను. ఈ పుస్తకంలో ఒక దీర్ఘమయిన వెర్రి వ్యాసం ఒకటే ఉంది. ‘హైన్జ్ కెచప్కు పోటీగా మరో బ్రాండ్ ఎందుకు రాలేదు’ అని. అది సరుకలమ్మే వ్యాపారంలో ఉన్న నా మిత్రుడు డేన్ నుంచి వచ్చిన ఆలోచన. అతను అలాంటి సంగతుల గురించి ఆలోచిస్తుంటాడు. ఆలోచనలను పట్టుకోవాలంటే, ప్రతి ఒక్క వస్తువు, వ్యక్తి నుంచి ఒక కథ రావచ్చని మనల్ని మనం ఒప్పించడం అనే ట్రిక్ వాడాలి. నేను ట్రిక్ అన్నాను. కానీ అది ఒక ఛాలెంజ్ అని నా భావం. ఆ పని చేయడం చాలా కష్టం మరి. మనం స్వాభావికంగా, చాలా విషయాలు అంత ఆసక్తికరమయినవి కావు అనుకుంటాం. టీవీలో ఛానల్స్ మారుస్తూ పదింటిని కాదని, పదకొండోదాన్ని చూడడం మొదలెడతాం. పుస్తకాల స్కోరులో ఇరవై నవలలను తిప్పి చూచి ఒక్కటి కొంటాం. మనం ప్రతిదాన్ని జల్లించి, మార్కులిచ్చి, నిర్ణయాలు చేస్తాం. చేయాలి మరి. ఎన్నో సంగతులున్నాయి. కానీ, రచయిత కావాలంటే మాత్రం ఈ స్వభావంతో ప్రతిరోజూ తలపడవలసి ఉంటుంది.
నేను రచయిత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. లాయర్ కావాలనుకున్నాను. కాలేజీ చివరి సంవత్సరంలో అడ్వర్టయిజింగ్లోకి వెళ్లాలని నిర్ణయించాను. 18 ఏజెన్సీలకు అప్లై చేశాను. అంతమందీ లేదు పొమ్మన్నారు. ఆ ఉత్తరాలను వరుసగా గోడకు అంటించాను. ఇంకా పై చదువుల గురించి ఆలోచించాను. ఇక్కడ మంచి మార్కులు రాలేదు. మరేదీ దొరకక రాతలో చిక్కాను. రాత కూడా ఒక పనే అని అర్థం చేసుకోవడానికి చాలాకాలం పట్టింది మరి. జాబ్ అంటే సీరియస్‌గా కష్టంగా ఉండాలి మరి. రాతేమో సరదాగా ఉంది! *
$$$$$$$